తెలంగాణ

విద్యా వ్యవస్థ పటిష్ఠతకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేగుంట, నవంబర్ 17: విద్యా వ్యవస్థను పటిష్టపరచడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిరంతరం కృషి చేస్తున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో మోడల్ పాఠశాల, కళాశాల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో మంత్రి హరీష్‌రావు కృషితో ఎనలేని అభివృద్ధి జరుగుతోందన్నారు. రాష్ట్రంలో 594 కోట్లతో మోడల్ పాఠశాలల అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. చేగుంట, దౌల్తాబాద్ మండల కేంద్రాల్లో నూతన పాఠశాలల భవన నిర్మాణాలు ప్రారంభిస్తామన్నారు. ఈ పాఠశాలల్లో లక్షా 25 వేల మంది బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటారని, మెస్ చార్జీలు అందిస్తున్నామని తెలిపారు. చేగుంట మోడల్ పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని, మార్కులే కాకుండా జీపీఏ సాధించి రాష్ట్ర స్థాయిలో నిలవాలన్నారు. మోడల్ పాఠశాలలో సరిపడు ఫర్నిచర్ ఇచ్చామని, దోమతెరలతో పాటు చలికాలంలో వేడినీళ్లు అందించడానికి మిషన్లు ఏర్పాటు చేస్తామని కడియం శ్రీహరి పేర్కొన్నారు. 475 కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయని, వాటిలో హాస్టల్ వసతి కల్పించామని, విద్యార్థులకు చలికాలంలో ఉలెన్ జాకెట్‌లు ఇచ్చామన్నారు. సామాజిక బాధ్యతతో సీఎం కేసీఆర్ కొత్తగా 542 గురుకుల పాఠశాలల ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 838 గురుకుల పాఠశాలలు ఉన్నాయని, 475 కేజీబీవి పాఠశాలల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు కడియం తెలిపారు. 1507 గురుకుల పాఠశాలల రాష్ట్రంలో నడుస్తున్నాయని, ఇందులో ఎనిమిది లక్షల మంది విద్యార్థులు చదువుకునే అవకాశం దక్కిందన్నారు.