క్రీడాభూమి

లాంగర్ ముందు పెను సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, మే 3: ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ కోచ్‌గా, క్రికెట్ ఆస్ట్రేలియా నియమించిన జస్టిన్ లాంగర్ (47)ను, తనకు ముందు కోచ్‌గా పనిచేసిన డర్రెన్ లెహ్‌మాన్‌కు పూర్తి భిన్నం. ఆస్ట్రేలియా జట్టుకోసం పూర్తి నిబద్ధతతో పనిచేసే నైజం ఇతని సొంతం. ఇప్పటికే బాల్ టాంపరింగ్ వ్యవహారంలో అప్రదిష్టపాలైన జట్టుకు పూర్వ వైభవం తీసుకురావడానికి లాంగర్ మాత్రమే సమర్థుడు. బాల్ ట్యాంపరింగ్ అంశంపై లెహెమాన్ తన కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. క్రమశిక్షణే ఉపిరిగా క్రికెట్ జట్టులో పనిచేసే ఆటగాళ్లను మలచడంలో సిద్ధహస్తుడని లాంగర్‌కు పేరుంది. లెహ్‌మన్, ఆస్ట్రేలియా క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన సంస్కృతిని చొప్పించాడంటూ ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంగా లాంగర్ మాట్లాడుతూ, ‘నాకు కెరీర్ పరంగా దేశం ఎంతో మద్దతిచ్చింది. ఇప్పుడు జట్టుకు కోచ్‌గా నియమితుడిని కావడం ఎంతో ఉత్తేజాన్ని నింపింది’ అన్నాడు. ‘ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ ముందు ఎన్నో సవాళ్లున్నమాట నిజం. ఇదే సమయంలో అద్భుతమైన ప్రతిభ కూడా పుష్కలంగా ఉంది. ఈ ప్రతిభే దేశానికి గర్వకారణంగా నిలుస్తుంది’ అన్నారు. లాంగర్ 1993 నుంచి 2007 వరకు మొత్తం 105 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. సగటు 45.27 పరుగులతో మొత్తం 7,696 పరుగులు సాధించాడు. ఇందులో 23 సెంచరీలున్నాయి. అంతకుముందు జస్టిన్ లాంగర్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఆస్ట్రేలియన్ క్రికెట్‌లో లాంగర్ ఆడిన కాలాన్ని స్వర్ణయుగంగా పరిగణిస్తారు.