క్రీడాభూమి

ఒకరినొకరు ఓడించాలని అనుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 2: తన సోదరుడు అజిత్ తెండూల్కర్‌తో చిన్నతనంలో జరిగిన మ్యాచ్‌లో గెలవాలని తాను అనుకోలేదని భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ అన్నాడు. అదే విధంగా అజిత్ కూడా ఆ మ్యాచ్‌లో గెలవాలని కోరుకోలేదన్నాడు. ఇద్దరూ వేరువేరు పూల్స్ నుంచి పోటీపడడంతో, ప్రత్యర్థులుగా నిలిచామని, అయితే, ఒకరినొకరు ఓడించాలని అనుకోలేదని సచిన్ చెప్పాడు. బంద్రాలోని ఎంఐజీ క్రికెట్ క్లబ్‌లో తన పేరు పెట్టిన పెవిలియన్‌ను సచిన్ గురువారం ప్రారంభించాడు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ, ఆ సంఘటన ఎప్పుడు జరిగిందో తనకు గుర్తులేదన్నాడు. కానీ, అప్పట్లో ఎంఐజీ క్రికెట్ క్లబ్‌లో సింగిల్ వికెట్ టోర్నమెంట్స్ జరిగేవని, ఒకసారి తాను, తన సోదరుడు అజిత్ వేరువేరు పూల్స్ నుంచి పోటీపడ్డామని చెప్పాడు. తన అన్న ఓడిపోకూడదని, అందుకే తాను గెలవకూడదని అనుకున్నట్టు చెప్పాడు. అజిత్ కూడా తన మాదిరిగానే ఆలోంచాడని అన్నాడు. ఈ విషయాన్ని తాను ఇంత వరకూ ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదని, ఎంఐజీ మైదానాన్ని చూసినప్పుడు ఆ సంఘటన గుర్తుకొచ్చిందని తెలిపాడు.

సోదరుడు అజిత్‌తో సచిన్ తెండూల్కర్ (ఫైల్‌ఫొటో )