కృష్ణ

ఒకే తరగతి.. ఒకే ఎగ్జామ్ కేలండర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఫలితాలు కనబరచని ఉపాధ్యాయుల్ని ఉపేక్షించం
* ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల సమీక్షలో సిఎం చంద్రబాబు
విజయవాడ, డిసెంబర్ 3: పదో తరగతి విద్యార్థులకు నిర్వహించినట్టుగానే రాష్ట్రంలోని మిగిలిన తరగతుల విద్యార్థులకు ఒకే సమయంలో పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ రూపొందించే ఎగ్జామ్ కేలండర్‌ను బిసి, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా తప్పనిసరిగా అనుసరించాలని స్పష్టం చేశారు. సాంఘిక సంక్షేమశాఖ పనితీరుపై విజయవాడలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కార్పొరేట్ విద్యాసంస్థల కన్నా మెరుగైన సదుపాయాలు వున్న రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వైఫల్యాన్ని అధిగమించేందుకు ఎక్స్‌పర్ట్ టీమ్‌ను ఏర్పాటుచేసి మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. ఉత్తమ ఫ్యాక్టల్టీతో వీడియో క్లాస్‌రూమ్‌లు నిర్వహించడం వంటి ప్రయోగాలు చేయాలన్నారు. ఉపాధ్యాయుల ఫెర్ఫార్మెన్స్ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పెట్టి, ఫలితాలు కనబరచని వారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడవద్దని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ టీచర్ల శిక్షణ కోసం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని వట్లూరు దగ్గర ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. రాష్ట్రంలోని 998 సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. దీన్ని వందశాతం అమలుచేసేందుకు అవసరమైన బయోమెట్రిక్ మిషన్లను, ట్యాబ్‌లను కొనుగోలు చేసి త్వరితగతిన ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.
సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగ యువతకు ప్రముఖ కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇప్పించే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకానికి అనూహ్య ఆదరణ వస్తోందని సాంఘిక, గిరిజన సంక్షేమశాఖల మంత్రి రావెల కిషోర్‌బాబు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఏడాది 350 మందికి ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద శిక్షణ ఇస్తున్నామని, ఒక్కో విద్యార్థికి సుమారు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నామన్నారు. ప్లిప్‌కార్డ్, అమెజాన్, స్నాప్‌డీల్ తదితర ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలు గిరిజన ఉత్పత్తులకు విస్తృతంగా మార్కెటింగ్ కల్పించి, అమ్మకాలు పెరిగేలా ఐటిడిఏలు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. టెలిగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాద్యమాలను ఉపయోగించుకుని ఎక్కువ మందికి ప్రభుత్వ పథకాల సమాచారం విస్తృతంగా తెలిసేలా చేయాలని చెప్పారు. సమీక్ష సమావేశంలో మంత్రి రావెల కిషోర్‌బాబుతో పాటు సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్, గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి విద్యాసాగర్ పాల్గొన్నారు.