కృష్ణ

వాతావరణ మార్పులతో అన్నదాతల్లో ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, నవంబర్ 29: రోజురోజుకూ వాతావరణం మారుతుండటంతో అధిక వ్యయప్రయాసలతో ఆరుంగాలాలు కష్టించి పండించిన పంట రక్షణలో అన్నదాతలు తలమునకలయ్యారు. పశుగ్రాసం కోల్పోయినా ధాన్యలక్ష్మిని ఇళ్లకు తరలించేందుకు సంప్రదాయ వరికోతలకు భిన్నంగా ఆదివారం మొవ్వ మండలంలో పలువురు రైతులు యాంత్రిక వరికోతలు ప్రారంభించారు. సంప్రదాయ వరి కోతలకు ఖర్చు ఎకరాకు రూ.2500 నుండి రూ.5500లకు చేరడం, కట్టివేతలు, కుప్పలకు రూ.3500లు, మరలా నూర్పిడికి రూ.2200లు అవుతుండటంతో గన్నవరం ప్రాంతం నుండి తరలివచ్చిన కోత యంత్రాలతో ముమ్మరంగా వరి కోతలు చేపట్టారు. తమ కష్టానికి ప్రతిఫలంగా ఎకరాకు 35 బస్తాల దిగుబడి రావటంతో అన్నదాతలు సంతృప్తి చెందుతున్నారు. గత వారంగా వాతావరణం పొడిగా ఉండటం, సంప్రదాయ పద్ధతుల్లో కోసిన వరి పనలపై ఉండటంతో ఆదివారం ఒక్కసారిగా వాతావరణం మారటంతో ఆందోళన చెందారు. ఇప్పటికే ఎండిన వరి పనలతో యుద్ధప్రాతిపదికన కుప్పలు వేయసాగారు. మొవ్వ మండలంలో దాదాపు 2వేల ఎకరాల్లో పనలపై ఉన్న పంట రైతుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కృష్ణా జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు అన్నదాతల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నెలలో 5, 6, 15 నుండి 20వ తేదీ వరకు మొవ్వ మండలంలో కురిసిన 296.8మి.మీల వర్షానికి తోడు వీచిన గాలుల కారణంగా చాపచుట్టగా పడిన వరి పంట కంకులు నేలరాలుతుండటం దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పొలాల్లో నీరు పోయి ఎండుతున్న తరుణంలో మరలా అల్పపీడన ప్రభావంతో 24గంటలు వర్షాలు కురుస్తాయన్న సమాచారం అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
కునుకు కరవు!
గుడ్లవల్లేరు : మరో అల్పపీడన ద్రోణి ఉంటుందన్న వాతావరణ శాఖాధికారుల హెచ్చరికలు రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే రెండు వాయుగుండాల ప్రభావంతో తీవ్రంగా పంట నష్టపోయిన రైతులు మరో వాయుగుండం ఏర్పడితే తిండి గింజలు కూడా దక్కే పరిస్థితి లేదని వాపోతున్నారు. ప్రస్తుతం గత వాయుగుండాల ప్రభావంతో నేలవాలిన పంటను రైతులు నిలబెట్టి కోతలు కోస్తున్నారు. ఈ దశలో వర్షాలు కురిస్తే భారీగా నష్టం తప్పదన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.