అంతర్జాతీయం

తుది దశకు చేరిన వాతావరణ చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒప్పందంపై చిగురిస్తున్న ఆశలు
నిర్మాణాత్మక పాత్ర పోషిస్తానన్న భారత్

లీ బౌర్గెట్ (ఫ్రాన్స్), డిసెంబర్ 7: వాతావరణ సమస్యలపై ఫ్రాన్స్‌లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యాన జరుగుతున్న శిఖరాగ్ర సదస్సు తుది అంకానికి చేరుకుంది. ఈ సదస్సులో ఎంతో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న భారత్ తన వాణిని మరింత బలంగా వినిపించేందుకు సిద్ధమవడంతో కర్బన ఉద్గారాలను (గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను) తగ్గించేందుకు పటిష్టమైన ఒప్పందం కుదురుతుందని ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో ప్రపపంచ దేశాల పర్యావరణ శాఖల మంత్రులు సోమవారం ఇక్కడ కీలక చర్చలకు ఉపక్రమించారు. ఈ సదస్సుకు హాజరైన 195 దేశాల మంత్రులతో చర్చల్లో పాల్గొనేందుకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఇప్పటికే ఫ్రాన్స్‌కు చేరుకున్నారు. వాతావరణ మార్పులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న పలు ప్రధాన సమస్యలను పొందుపర్చి 48 పేజీలతో రూపొందించిన ముసాయిదా ఒప్పందంపై వీరు చర్చలు జరిపి బలమైన ఒప్పందానికి పునాది వేస్తారు. వాతావరణ సమస్యలపై 2009లో కోపెన్‌హాగన్‌లో జరిగిన శిఖరాగ్ర చర్చలు ఘోరంగా విఫలమైన విషయం విదితమే. అయితే ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న చర్చలు కీలక దశకు చేరుకున్నందున ఈసారి ఇటువంటి వైఫల్యం పునరావృతం కాబోదని, వచ్చే వారాంతంలోగా ఏదో ఒక ఒప్పందం కుదురుతుందని ఈ సదస్సుకు హాజరైన ప్రపంచ దేశాల ప్రతినిధులు గట్టి విశ్వాసంతో ఉన్నారు. అయితే ఈ సదస్సులో ప్రపంచ దేశాల మధ్య ఎటువంటి ఒప్పందం కుదిరినప్పటికీ అది భూతాపాన్ని (గ్లోబల్ వార్మింగ్‌ను) 2 డిగ్రీల సెల్సియస్‌కు లేదా అంతకంటే తక్కువకు పరిమితం చేసేందుకు దోహదపడకపోవచ్చని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. వాతావరణ సమస్యల పరిష్కార నిమిత్తం అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2020 నుంచి ప్రతి సంవత్సరం 100 బిలియన్ డాలర్ల చొప్పున నిధులు అందజేస్తామని 2009లో ధనిక దేశాలు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నిధులను 2020 కంటే ముందుగానే అందజేయడంతో పాటు కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఉపకరించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు బదిలీ చేయాలని భారత్‌తో పాటు పలు వర్థమాన దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. వాతావరణ సమస్యలపై గతంలో జరిగిన శిఖరాగ్ర చర్చల మాదిరిగా ప్రస్తుత చర్చలు వృథా కాకుండా చూడాలని భారత్ కృతనిశ్చయంతో ఉందని, ఈ విషమై ధనిక దేశాలను ఒప్పించేందుకు మరింత నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని ప్రకాష్ జవదేకర్ ఆదివారం స్పష్టం చేశారు.