అంతర్జాతీయం

హిల్లరీనే అమెరికాకు సరైన అధ్యక్షురాలు : బిల్‌ క్లింటన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిలడెల్ఫియా: సామాజిక న్యాయం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతూన్న హిల్లరీనే అమెరికాకు సరైన అధ్యక్షురాలని, దేశంలో మార్పు ఆమె వల్లే సాధ్యమని ఆమె భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఫిలడెల్ఫియాలోని డెమోక్రటిక్‌ జాతీయ సమావేశంలో అమెరికా అధ్యక్ష ఎన్నికకు హిల్లరీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా బిల్‌ క్లింటన్‌ హిల్లరీపై ప్రశంసల వర్షం కురిపించారు. లోపాలను సరిచేసుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేయగల గొప్ప మహిళ అని క్లింటన్‌ పేర్కొన్నారు. ఆమె ఓ సహజ నాయకురాలు. పుట్టుకతోనే సమాజం పట్ల బాధ్యత పెంచుకున్న పోరాటవేత్త అంటూ క్లింటన్‌ అభివర్ణించారు .