రంగారెడ్డి

శతచండీయాగంలో ముఖ్యమంత్రి దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 3: ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఎలిమినేడులోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న శతచండీయాగంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం ఉదయం 11 గంటలకు ఎలిమినేడుకు చేరుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శతచండీయాగంలో భాగంగా నిర్వహించిన పూర్ణాహుతిలో పాల్గొన్నారు. యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పండ్లు, పుష్పాలు సమర్పించారు. యాగంలో పాల్గొని పీఠాధిపతులు, వేద పండితులతో శతచండీయాగం నిర్వాహణపై చర్చించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మీడియాతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మాట్లాడకుండానే తిరుగు పయనమయ్యారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్, ఎంపిపిలు మర్రి నిరంజన్‌రెడ్డి, జ్యోతి నాయక్, హరిత, జడ్పిటిసిలు రమేష్‌గౌడ్, ఎలిమినేడు సర్పంచ్ బుట్టి యాదమ్మ, ఎంపిటిసి సదృశ, నగరపంచాయతీ చైర్మన్ భరత్‌కుమార్, కౌన్సిలర్లు ఆకుల యాదగిరి, తెరాస నాయకులు జక్క రాంరెడ్డి, రాజిరెడ్డి, సత్తు వెంకటరమణారెడ్డి, ధనలక్ష్మి, లక్ష్మారెడ్డి, జెపి శ్రీనివాస్‌రావు, వెంకట్‌రెడ్డి, వెంకటేష్, రాములు, సత్యనారాయణ, వై.నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన హైలైట్స్
శతచండీయాగంలో పాల్గొనేందుకు ఎలిమినేడుకి వచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటన గంటన్నర పాటు కొనసాగింది. ముందుగా 11:07 గంటలకు ఎలిమినేడుకు హెలిక్యాప్టర్‌లో ముఖ్యమంత్రి దంపతులు ఎలిమినేడు గ్రామానికి చేరుకున్నారు. 11:11 నిమిషాలకు హెలిక్యాఫ్టర్ ల్యాండింగ్ కాగా, 11:18 నిమిషాలకు ముఖ్యమంత్రి దంపతులు యాగశాలకు చేరుకున్నారు. యాగశాలకు చేరుకునే క్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి దంపతులు ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులకు సాదరంగా స్వాగతం పలికారు. కాసేపు యాగశాలలో కూర్చొని 11:38 నిమిషాలకు అగ్నిగుండం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, 11:40కి యాగానికి హారతి పట్టారు. ఇరవై నిమిషాల పాటు యాగంలో పాల్గొని 12 గంటలకు అమ్మవారిని ప్రతిష్టించిన వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. 12:10 నిమిషాలకు తమవెంట తీసుకొచ్చిన పండ్లు, పుష్పాలను అమ్మవారికి సమర్పించారు. 12:20 నిమిషాలకు ఎమ్మెల్యే దంపతులు ముఖ్యమంత్రిని ఘనంగా సన్మానించారు. ఆ తరువాత అక్కడే భోజనం చేసిన తరువాత 12:46 నిమిషాలకు హెలిక్యాఫ్టర్ వద్దకు చేరుకొని తిరుగుపయనమయ్యారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్, ఎల్‌బినగర్ డిసిపి తఫ్సీర్ ఇక్బాల్ ముందస్తుగానే ఏర్పాట్లను పర్యవేక్షించారు. సిఎం పర్యటనకు 24 గంటలకు ముందుగానే యాగశాల పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి పర్యటన ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, శతచండీయాగంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్థానిక పరిస్థితులనుద్దేశించి ప్రసంగిస్తారనుకున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు నిరాశే ఎదురయ్యింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ముఖ్యమంత్రి ఒక్క మాటకూడా మాట్లాడకుండానే తిరుగు పయనమయ్యారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత పద్దెనిమిది నెలల కాలంలో రెండవ సారి నియోజకవర్గానికి రావడం పట్ల ఈ ప్రాంత ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.