విశాఖపట్నం

కాల్‌మనీ దోషులను కఠినంగా శిక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాధితులకు బాసటగా సిపిఎం
విశాఖపట్నం, డిసెంబర్ 18: కాల్‌మనీ దోషులు ఎంతటి వారైనా ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాధం డిమాండ్ చేశారు. గత కాంగ్రెస్ హయాంలో మైక్రో ఫైనాన్స్, ఇప్పుడు కాల్‌మనీ పేరిట అమాయకుల నుంచి అధిక వడ్డీలను వసూలు చేసే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయన్నారు. అధిక వడ్డీలు వసూలు చేయడం, వడ్డీ చెల్లించని వారిని లైంగికంగా వేధించడంతో పాటు సెక్స్ కార్యకలాపాలను పురిగొల్పడం ఫైనాన్సియర్ల వికృత చేష్టలకు అద్దం పడుతోందన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా గొప్పలు చెప్పుకునే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇంతటి ఘోరాలు చోటుచేసుకున్నాయని, మహిళలకు భద్రత కల్పించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా కాల్‌మనీ వ్యవహారంలో నిందితులు ప్రవర్తించడం దారుణమన్నారు. అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చే వారిపై కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తోందని, అయితే అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితులు ప్రభుత్వాలే కల్పిస్తున్నాయని ఆరోపించారు. నిరుపేదలకు విద్య,వైద్యం అందుబాటులో లేకపోవడం, రైతాంగానికి పంట రుణాలు అందని పరిస్థితుల్లో అధిక వడ్డీలకు అప్పులు చేయడం తప్పనిసరవుతోందని, ఈ నేపథ్యంలో ఫైనాన్సియర్లు తమ ఆగడాలతో పేట్రేగిపోతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్కువ వడ్డీ సదుపాయంతో రుణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగై కాల్‌మనీ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాల్‌మనీ బాధితులు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, బాధితులకు సిపిఎం బాసటగా నిలుస్తుందని భరోసానిచ్చారు.