క్రైమ్/లీగల్
ఇద్దరు యువతుల ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
శామీర్‌పేట, మార్చి 13: జవహర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డు ప్రాంతంలో ఇద్దరు యువతులు అనుమానస్పదంగా మృతిచెందారు. కుషాయిగుడ ఏసీపీ శివ కుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు తమ భర్తలతో గొడవ పడి శామీర్‌పేట మీదుగా స్థానికంగా తెలిసిన పాస్టర్ సహాయంతో ఇక్కడికి వచ్చారు. పాస్టర్ ఆశ్రయం కల్పించినట్లు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో జవహర్‌నగర్ డంపింగ్ యార్డు గేటు ముందు సర్వే నెంబర్ 68లో ఓ చెట్టుకు ఇద్దరు యువతులు ఉరి వేసుకున్నట్లు ఫిర్యాదు వచ్చింది. ఇద్దరి యువతుల మృతదేహాల పక్కనే మరో ఆరు సంవత్సరాల చిన్నారి మృతిచెందినట్లు గుర్తించారు. మృతులను సుమతి(30), అనూష (32), చిన్నారిని ఉమామహేశ్వరిగా ప్రాథమికంగా గుర్తించారు. సెల్‌ఫోను నెంబర్ల ద్వారా కేసు దర్యాప్తు చేస్తామని ఏసీపీ తెలిపారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు తెలిపారు.