అంతర్జాతీయం

నీరవ్‌కు 29వరకు జ్యుడీషియల్ రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/లండన్, మార్చి 21: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి పరారైన ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీకి ఈ నెల 29వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్‌ను విధిస్తూ లండన్ కోర్టు తీర్పు ఇచ్చింది. నీరవ్‌మోదీని పశ్చిమ ఐరోపాలోనే అతి పెద్ద జైలు వాండ్స్‌వర్త్‌కు తరలించారు. మోదీ కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ జైలులో ఇప్పటికే దేశ ద్రోహి దావూద్ ఇబ్రహీం అనుచరులు, పాకిస్తాన్‌కు చెందిన జబీర్ మోతీ ఉన్నారు. మోతీని కూడా తమకు అప్పగించాలని అమెరికా కోరుతోంది. లండన్ సెంట్రల్ పాయింట్‌లో ఖరీదైన అపార్టుమెంట్‌లో నీరవ్ మోదీ ఉంటున్నారు. ఒక జర్నలిస్టు ఇచ్చిన సమాచారంతో, నీరవ్ మోదీ లండన్‌లో ఉంటున్నట్లు ప్రపంచానికి తెలిసింది. వాండ్స్‌వర్త్‌లోని బీ కేటగిరీ జైల్లో నీరవ్‌మోదీని ఉంచినట్లు జైలు అధికారులు తెలిపారు. ప్రత్యేక సెల్‌లో నీరవ్‌మోదీ ఈ నెల 29వరకు ఉండాలని కోర్టు ఆదేశించింది. లండన్ మెట్రో బ్యాంక్ బ్రాంచి పోలీసులు మోదీని అరెస్టు చేశారు. కొత్త బ్యాంకు అకౌంట్‌ను తెరవడానికి ఈ బ్రాంచికి వెళ్లినప్పుడు పోలీసులు వలపన్ని అరెస్టుచేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి కోట్లాది రూపాయలు రుణాలు తీసుకుని మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ నిందితులుగా ఉన్నారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం నీరవ్ మోదీ భారతీయ ఐశ్వర్యవంతుల్లో ఒకరు. ఆయన ఆస్తి 1.75 బిలియన్ డాలర్లని అంచనా వేశారు. న్యూయార్డు, లండన్, హాంకాంగ్‌లో నీరవ్‌మోదీకి వజ్రాల షాపులున్నాయి.