Others

ధోరణి మారితే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సీత నాసుత- నీ సహధర్మచారిణి2 అని జనకుడు సీతను రామునికప్పగించాడు. దశరథునితో కలసి అందరూ అయోధ్యకు చేరుకొన్నారు. శ్రీరామునికి పట్ట్భాషేకం చేయాలని దశరథుడు నిర్ణయించుకొని చేయవలసిన పనులకాదేశమిచ్చాడు. సీతారాములిద్దరు కంకణధారులై వ్రతదీక్ష చేపట్టమని రాజాజ్ఞ అయంది. వారిద్దరూ వ్రతదీక్ష పట్టారు. కాని అపుడు కైకమ్మ వరాలనుఅడిగింది. దశరథుడు ఖిన్నుడై నాడు. తండ్రి మాట విని పట్ట్భాషేకం జరుపుతానని అన్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాడో అంతే ఆనందంగా అడవులకు ప్రయాణం అవుతానని చెప్పి రాముడు సీతమ్మ దగ్గరకు వచ్చాడు. జరిగిన విషయం చెప్పాడు. తాను వనవాసం వెళ్తున్నానని నీవు మాత్రం అయోధ్యలో ఉంటూ అత్త మామల సేవ చేయమని రాముడు సీతకు చెప్పాడు. ధీరోదాత్త స్ర్తి 34మీవెంట నేనూ వస్తా- భర్త వున్నచోటే భార్యకు స్వర్గం, మీరు లేని అయోధ్య నాకు అడవితో సమానం. మీరున్న అడవి నాకు అయోధ్య వంటిది. నా సర్వస్వం మీరు, మీరు లేని కామధేనువైనా కల్పవృక్షమైనా నాకక్కరలేదు అంటుంది సీత.
ఇక్కడ సీతమ్మ వాక్కులోని అంతరార్థాన్ని గ్రహించకుంటే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉండలేము. అంటే భర్తతోడిదే జీవితం అంటే భర్త చిటికెన వేలు పట్టుకొని జీవితాంతం నడవమని కాదు. ఆయన చూపిన దారిలో నడుచుకోమని అర్థం. అట్లా నడుచుకున్నది కనుకనే సీతారాములు అనురూపులన్నారు. వారిద్దరూ ఒక్కటే శరీరాలు వేరైనా ఆత్మ ఒకటిగా జీవించారు. సీతమ్మను పరిత్యజించిన రాముడు శోక్తార్తుడయ్యాడు. సీతమ్మ రాముని స్మరణను వీడకుండా జీవన పర్యంతమూ గడిపింది. రావణుని దగ్గరా రామ స్మరణతో కాలం గడిపి అయోధ్యకు చేరినా రామరాజ్యం కనుల పండుగగా సాగుతున్నా అపుడూ సీతమ్మ వనవాసానికి చేరింది. వాల్మీకి ఆశ్రమంలో జీవితాన్ని గడపవలసి వచ్చింది. అపుడు రాముడే వనాల్లో దిగిబెట్టి రమ్మని లక్ష్మణునికి చెప్పిపంపాడు. అపుడు అక్కడ అసలు విషయం లక్ష్మణుని వల్ల సీతమ్మకు తెలిసింది. అపుడు సీతమ్మ గర్భవతి. వారసులను మోస్తున్నది.రాముని వారసులు కని, పెంచి వారికి విద్యాబుద్ధులు చెప్పించింది. వారినిమంచి పౌరులుగా తీర్చి దిద్దింది. అపుడూ రామనామస్మరణనే చేసింది. రాముడు తన్ను వదిలేసాడనోలేక రాముడు తనను అనరాని మాటలు అన్నాడనో రామునిపైన విద్వేషాన్ని తన కన్నబిడ్డలకు చెప్పలేదు. వారిని తేజో వంతులుగా తీర్చిదిద్దింది. వారిలో మంచి మానవత్వాన్నిపౌరుషాన్ని వృద్ధిచేసింది. తనకు అన్యాయం చేసినవారి గురించి మాట మాత్రంగా కూడా చెప్పలేదు. కాని వారు ఏ పరిస్థితి ఎదురైనా దాన్ని ధీటుగా ఎదుర్కోగల వారిగా తీర్చిదిద్దింది. తాను ధీరోదాత్తగానే కాదు సర్వసమర్థురాలిగా నిలిచింది. మనమూ సమర్థులమని అనిపించుకోవాలి కదా.