సబ్ ఫీచర్

శ్రేష్ఠుడు ఒక్కడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుత్రుడంటే పున్నామ నరకం నుండి రక్షించువాడని అర్థం. కొడుకు మాత్రమే వంశాన్ని ఉద్ధరిస్తాడు. పుత్రసంతతి లేకపోయినా బిడ్డ కొడుకు శ్రాద్ధకర్మలు చేయడానికి అర్హుడే. బిడ్డ కొడుకుని ‘దౌహిత్రుడు’ అంటారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది కూతుర్లు ఉన్నట్లయితే పెద్ద కూతురు కొడుకు చేత కర్మకాండలు జరిపించాలి. ఇలా కర్మకాండలు చేసినవారికి ఆస్తిలో కొంత భాగం ఇవ్వవలసి యుంటుంది. ఎవరూ లేనట్లయితే దత్తత తీసుకోవాలనుకుంటే సగోత్రికుడిని దత్తత తీసుకుంటేనే ఉత్తమం. పిల్లలు కలుగరనే ఉద్దేశ్యంతో దత్తత తీసుకున్న తర్వాత సంతానం కల్గినట్లయితే దత్తపుత్రుని బయటకు పంపివేయటానికి వీలులేదు.
ఇంకా ఒక ముఖ్య విషయమేమిటంటే సంసారిక జీవితం గడుపుతున్న పురుషుడు పనె్నండు రకాలుగా పుత్రులను పొందవచ్చును. ఇలా పొందిన పనె్నండు రకాల పుత్రులలో ఔరసుడు (వారసుడు) (్భర్యకు పుట్టినవాడు) ముఖ్యుడు. మిగిలిన 11 రకాల పద్ధతులవల్ల పుట్టినవారంతా ‘ఆపద్ధర్మ పుత్రులు’గానే భావించబడతారు. వీరంతా కూడా పుత్ర సమానులే.
- గురువులు, బంధువులు, తల్లిదండ్రుల సమక్షంలో అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యకు తనవల్ల పుట్టినవాడే ‘ఔరసపుత్రుడు’.
- అశక్తతవల్లగానీ, అసమర్థతవల్లగానీ, అనారోగ్యంవల్లగానీ తాను సంతానోత్పత్తికి అనర్హుడయితే కుటుంబ పెద్దల అంగీకారంతో తన గోత్రపు వారివల్ల తన భార్యకు సంతానం కల్గినట్లయితే తప్పుకాదు. ఈ పుత్రుడిని ‘క్షేత్రజపుత్రుడు’ని అంటారు.
- భార్యాభర్తలిద్దరూ ఇక తమకు సంతానం కలుగదని భావించి సగోత్రీకులయిన దంపతులనుండి బిడ్డను దత్తత తీసుకున్నట్లయితే ఆ బిడ్డను ‘దత్తపుత్రుడు’గా భావిస్తారు.
- ఎవరైనా ఒక బిడ్డను కని అనాథగా వదిలివెళ్తే, ఆ బిడ్డను పెంచుకునట్లయితే అతనిని ‘ఆపద్ధర్మపుత్రుడు’ అంటారు.
- పెండ్లికాకముందు తల్లిదండ్రులతో ఉంటున్నపుడు రహస్యంగా మరొకరి ద్వారా బిడ్డ కల్గినట్లయితే ‘క్షేత్రజపుత్రుడు’ అంటారు. భర్త చనిపోయిన స్ర్తికి పుట్టినవాడు కానీ, భర్త వదిలివేసిన స్ర్తికిగాని పుట్టినవాడు ‘పునర్భవపుత్రుడు’ అవుతాడు.
- ఏదయినా (ప్రమాదంవల్లగానీ, తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకోవడంవల్లగానీ వారికి దూరమయిన బిడ్డ (కొడుకు) లభించినపుడు వాడి ‘స్వయందత్తపుత్రుడు’ అంటారు.
- దారిద్య్రంవల్ల, పరదేశ ప్రయాణంవల్ల, చాలామంది సంతతి ఉండడంవల్ల ఆ బిడ్డలను సాకలేక కన్న తల్లిదండ్రులే ఆ బిడ్డను అమ్మినట్లయితే అలాంటి పుత్రుడిని ‘క్షతపుత్రుడు’ అని అంటారు.
- బాల్యంలో ఉన్నప్పుడు, మైనర్‌గా ఉన్నపుడు, అమాయకత్వంవల్ల తెలిసీ తెలియని పరిస్థితుల్లో గర్భం దాల్చి బిడ్డను కనడంవల్ల ఆ విషయం వివాహానంతరం భర్తకు తెలిస్తే అతన్ని ‘సహాఢపుత్రుడు’ అంటారు. తన భార్య తనకు తెలియకుండా ఆమె మరొకరి బలాత్కారానికి, భయభ్రాంతులకు, ఆపదలకు లోనటంవల్ల ఆమె ప్రమేయం లేకుండానే గర్భం వచ్చి కొడుకుని కన్నట్లయితే ఆయన్ని ‘గూఢోత్వాన్న పత్రుడు’ అంటారు.
- ఒక వ్యక్తి తనకు పుత్రునిగా అంగీకరించపోయినా పుత్రస్థానాన్ని భర్తీ చేస్తూ, కన్న బిడ్డలా ప్రవర్తిస్తూ, అభిమాన, ఆత్మీయతలను ప్రదర్శించేవాడిని కూడా పుత్రునిగా స్వీకరించవచ్చును. ఇలాంటివాడిని క్షత్రియపుత్రుడు అంటారు కులాలు, వర్ణాలు వేరయివుండి వారికి జన్మించిన పుత్రుడు అనివార్య కారణాలవలన తల్లిదండ్రులచే వదలివేయబడితే ఆ బిడ్డను ఎవరైనా సాకుతుంటే ఆ బిడ్డను ‘పరవశపుత్రుడు’ అంటారు.
ఈ రకంగా లభించిన పుత్రులను (12 రకాల) పుత్రులుగానే స్వీకరించవచ్చు. కానీ తన భార్యకు తనవల్ల కల్గిన పుత్రుడే ఔరసపుత్రుడు. అందర్లో ఔరసపుత్రుడే శ్రేష్ఠుడు. వీరందరికీ బాధ్యతలు, హక్కులు సమానంగా ఉంటాయి. ఎవరూ వీరిని ప్రశ్నించవీలులేదని మనుస్మృతిలో చెప్పబడినాయి.

- పి. శ్రీనివాస్