Others

ధర్మస్థాపనాచార్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనాతన ధర్మస్థాపకుడుగ, విజయనగర సామ్రాజ్య స్థాపకుడుగా సువిఖ్యాతి గాంచిన విద్యారణ్యుల జననం క్రీ.శ. 1268. వీరి పూర్వ నామం మాధవుడు. సన్యాస స్వీకారము తర్వాత మాధవులే విద్యారణ్యుడుగా ప్రసిద్ధిచెందాడు. వీరే హరిహర బుక్కరాయలకు చింతామణి మంత్ర జపం చేసి ఏడు ఘడియలు స్వర్ణవృష్టి కురిసేట్టు చేసి ఆ ధనరాసులను ఆ రాయలకిచ్చి వారి సామ్రాజ్య స్థాపనకు బాసటగా నిలిచారు.
విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగిన తర్వాత విద్యారణ్యులు, తమకు సన్యాస దీక్షనిప్పించిన శృంగేరి పీఠాధిపతులు శ్రీ విద్యాతీర్థులవారు కాలధర్మం చెందిన వార్త విని శృంగేరి వెళ్లారు. అక్కడి పండితుల ప్రార్థనతో 1380లో విద్యారణ్యులు శృంగేరి పీఠాధిపత్యం స్వీకరించారు. విద్యారణ్యులు, తమ్ముడైన సాయణులతో కలిసి వేద భాష్యమును రచించారు. శ్రుతులకు భాష్య రచనమేకాక విద్యారణ్యులు స్మృతుల ఉపదేశాలను కూడా పరాశర స్మృతి వ్యాఖ్యగా క్రోడీకరించారు. విద్యారణ్యులు మఠాధిపతులుగా దక్షిణ భారతంలో పలుచోట్ల పీఠాలు స్థాపించారు. మొదట విరూపాక్షంలో పీఠం స్థాపించి స్వయంగా దానిని అధిష్ఠించారు. ఆ తర్వాత పుష్పగిరి, కూడలి శివగంగ ఆరణి మొదలగుచోట్ల పీఠాలు స్థాపించారు. ఆదిశంకరులవలె విద్యారణ్యులు ఎన్నో దేవాలయాల పునరుద్ధరణకు కృషిచేశారు. విద్యారణ్యులకు అగ్రహారాలిప్పించారు. వేద రక్షణకు సుస్థిరమైన వ్యవస్థ ఏర్పాటుచేశారు.విద్యారణ్యులు జైమినీయ న్యాయమాల, పరాశర మాధవీయం, కాలమాధవీయం సర్వదర్శన సంగ్రహం, వేదాంత శంకర విజయ కావ్యం మొదలగు గ్రంథములెన్నిటినో రచించారు. త్రిమతాచార్యులను గౌరవించారు. 1386వ సంవత్సరమున తమ గురువర్యులైన శ్రీ విద్యాశంకర తీర్థులను ధ్యానించుచు, పంపా క్షేత్రమందే బ్రహ్మీభూతులయ్యారు. నేటికీ హంపీ విరూపాక్షేశ్వరాలయం వెనుక భాగంలో విద్యారణ్యస్వాముల వారి మందిరమున్నది.

- గాయత్రి