సబ్ ఫీచర్

ధనరక్షణకు మార్గమిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుడు తన ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉత్తముడుగా తయారుకావాలి. ధర్మాన్ని ఆచరించకుండా ఎనే్నళ్లు బతికినా అది వ్యర్థ జీవిత మే అవుతుంది. అంతేకాదు జీవితాన్ని వ్యర్థంగా గడిపితే పశువులకు మనుష్యులకు తేడాలేకుండా పోతుంది. కనీసం మనకున్న దానిలో కాస్త దానంచేయాలి. ధనం లేకపోయనా చేతనైనంత సాయం ఏదో ఒక రూపంలో చేయాలి. ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమీ తేకుండా వచ్చినవాళ్లు వెళ్లేనాడు కూడా ఏమీ తీసుకొని పోలేరు. అందుకే జననమరణాలకు మధ్య ఉన్న సమయమే మంచిచేయడానికి అనువైన సమయం అంటారు. ఎవరికీ ఏమీ చేయకుండా చివరకు వరకు గడిపినా అది వ్యర్థమే బాగా సంపాదించి తాను తినకుండా ఇతరులకు పెట్టకుండా దాచేస్తే అదీ వ్యర్థమే అవుతుందని ఓ శతకకారుడు ఇలా చెప్పాడు.
ఒక లోభి కష్టపడి కూడబెట్టిన ధనాన్ని కూడబెట్టాడు. దాన్ని భద్రంగా దాచుకోవాలని బంగారు ముద్దగా మార్చాడు. దానిని జన సంచారం లేని ప్రదేశంలో గోయి త్రవ్వి అందులో పెట్టి పూడ్చి పెట్టాడు. అప్పుడప్పుడు వెళ్లి దాని చూసిసంతోషించేవాడు. కాని ఈ విషయం ఒక దొంగ కనిపెట్టాడు. ఆ దొంగ గొయ్య తవ్వి ఆ బంగారు ముద్దను తీసుకొని వెళ్లాడు. ఆ తరువాత లోభి వచ్చి చూసుకొని లబోదిబోమని ఏడ్చాడు. అది విని ఏం జరిగిందో అని నలుగురు వచ్చారు. వారికి జరిగిన సంగతి చెప్పాడు. వారు అంతా విని , ఈ పెద్దమనిషి సంగతి తెలిసి అయనా పోయందేముంది. ఆ బంగారాన్ని నీవు ఏమీ చేయవు కదా. వూరికే చూడడానికే గదా అది పనికి వచ్చేది. ఆ కనిపించే రాయ తెచ్చి ఈ గోతిలో పెట్టుకొని నీవు అప్పుడప్పుడు వచ్చి ఇదే బంగారం అని చూస్తుండు అని చెప్పారట. ఆ మాటలతో తెలివి తెచ్చుకున్న ఆ లోభి పరమ దయాళువుగా మారిపోయాడట. ఆయన సంపాదించిన దానిలో కొంతభాగం దానం చేయడం మొదలుపెట్టాడు. ధనానికి రక్షణ దానమే అన్నారు పెద్దలు.

- మానస