అంతర్జాతీయం

అమెరికాలో మరో దారుణం..కాల్పుల్లో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలరాడో స్ప్రింగ్స్ (అమెరికా), నవంబర్ 28: తుపాకీ సంస్కృతిని నరనరానా నింపుకున్న అమెరికాలో మరో దారుణం జరిగింది. కొలరాడోలోని కుటుంబ నియంత్రణా కేంద్రం వద్ద సాయుధ ఆగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడి ముగ్గురి ప్రాణాలను బలితీసుకోవడంతోపాటు అనేకమందిని గాయపర్చాడు. అయితే ఐదు గంటల హైడ్రామా తర్వాత ఆగంతకుడు భద్రతా సిబ్బందికి లొంగిపోయాడు. మంచు దుప్పటి కప్పుకున్న కొలరాడో స్ప్రింగ్స్ ప్రాంతం శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాల్పులకు భీతిల్లిన ఆ ప్రాంత ప్రజలంతా తలుపులు మూసుకుని చాలాసేపు ఇళ్లలోనే ఉండిపోయారు. అమెరికాలో తుపాకీ సంస్కృతి అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతోందన్న విషయాన్ని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. అయితే ఆగంతకుడిని నిర్బంధించి మరింత రక్తపాతం జరగకుండా నివారించిన భద్రతా సిబ్బందిని కొలరాడో స్ప్రింగ్స్ నగర మేయర్ జాన్ సథర్స్ అభినందించారు. ఆగంతకుడి కాల్పుల్లో మృతిచెందిన వారిలో పోలీసు అధికారి ఒకరు ఉన్నారని, అలాగే క్షతగాత్రుల్లో ఐదుగురు పోలీసులు ఉన్నారని, అయితే వీరిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆయన చెప్పారు. ‘ఇది ఎంతో భయానకమైన ఘటన. ఆగంతకుడి కాల్పుల్లో మరణించిన వారికి నివాళులర్పిస్తున్నా. బాధితుల కుటుంబ సభ్యులకు, ఆప్తులకు ప్రగాఢ సానూభూతి తెలియజేస్తున్నా’ అని సథర్స్ విలేఖర్లతో అన్నారు.