డైలీ సీరియల్

ప్రహ్లాదుడు -10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రహ్లాదుని బోధ అంతా విన్న ఆ రాక్షస బాలకులు నీవు చెప్పినదంతా బాగుంది. నీవే మా రాజువి కమ్ము. నీ మాట ప్రకారం మేము నిరంతరమూ హరి భజన చేస్తూ ఈ జన్మను సార్థకం చేసుకొంటాము. నీ తో కలసి మేమూ ఆ పరంధాముని నివాసానికి చేరుకుందాం అని చెప్పారు.
ప్రహ్లాదుడు అమితమైన సంతోషంతో వారితో కలసి హరి భజన ఆనాటి నుంచి చేయసాగాడు. వారితో ఇంకా ఇలా చెప్పాడు. మీరంతా ఈ పుస్తకాలను ఇక్కడే వదలివేయండి ఏకాంతంలో కూర్చుందాం. అక్కడ మనలో ఉండే కామక్రోద మదమాత్సర్యాలను వదిలివేద్దాం.
ఇపుడు రాక్షసులుగా పుట్టినా మనుష్యులుగా పుట్టినా అసలు పక్షి, పాము వన్యమృగం ఏ పుట్టకైనా తిరిగి చావాల్సిందే. ఇలా పాపాలుచేస్తూ జననమరణ చక్రంలో ఇరుక్కోకుండా పరంధామానికి వెళ్లే సులభోపాయం కేవలం హరిభజనే అని చెప్పాడు.
ప్రహ్లాదుడి మాటలు విని ఆ రాక్షస బాలకులందరూ ఏకాంత ప్రదేశానికి వెళ్లారు. అక్కడ కూర్చుని హరి భజన చేయసాగారు. గురువులు తిరిగి వచ్చారు. అంతా నిశ్శబ్దంగా ఉన్న వాతావరణాన్ని చూశారు. మంద్రస్థాయిలో వినబడే హరి నామాన్ని విని వారూ శాంతస్వభావులై హరి భజన చేయసాగారు. కొద్దిసేపట్లోనే తెలివి తెచ్చుకున్నారు. అయ్యో ఇదేమిటి? వీళ్లంతా చేస్తున్న దేమిటి? మనమూ వీరితోకలసిపోతున్నామేమి? ఇలా చేస్తే మన రాక్షసరాజు ముందు మనం నిలబడగలమా? అని వెంటనే హిరణ్య కశిపుని దగ్గరకు పరుగెత్తి వెళ్లారు.
***
హిరణ్య కశిపుడు ముల్లోకాలమీద ఆధిపత్యం తెచ్చేసుకున్నాను. ఆ హరి నాకు భయపడి ఎక్కడో దాక్కుని ఉన్నాడు. అసలు ఉన్నాడో లేడో కూడా ఎవరికీ తెలియదు. ఇంద్రాది దేవతలు నాపేరు వింటేనే హడలిపోతున్నారు. కనుక ఇపుడు నేను చేయవలసింది ఏమీలేదు. నా వంశజులు అందరూ ఆనందచిత్తంతో ఉన్నారు అనుకొని హాయిగా ఊపిరిపీలుస్తున్నాడు. అంతలో హిరణ్యకశిపుని మదిలో నిజంగా మహావిష్ణువు తనకు భయపడ్డాడా అన్న సందేహం కలిగింది. అవును అతను చావుపుట్టుకలు లేనివాడని కదా హరిభక్తులు చెబుతూ ఉంటారు. మరి అతడు ఎక్కడ ఉన్నాడు. ఉంటే ఎక్కడో ఒక చోట నాకు కనబడేవాడు కదా. అసలే జిత్తుల మారి ఒకవేళ నా వల్ల భయపడుతున్నట్టు నటిస్తున్నాడా? లేక ఇక్కడే ఎక్కడో ఒక చోట దాక్కుని ఉంటున్నాడా.. నా వారినందరినీ చల్లగా తనవైపుకు తిప్పుకునే పనిలో ఉన్నాడా.. అతని మాటలు వింటే ఎవరైనా వశులౌతారని అంటారు కదా. అలాంటి పనులేమీ చేయడం లేదు కదా. వీరంతా నాకు విరోధులుగా మారుతారా.. లేక ఆ విష్ణువే నా ఎదురుగా నిల్చుని ఏమిరా అని హుంకరిస్తాడా.. ఏమీ అర్థం కావడం లేదు అని ఒక్క క్షణం అనుకొన్నాడు. అంతలోనే లేదు లేదు ఇదంతా నా ఊహనే. అసలు నాకు భయపడనివారు ఎవరూ లేరు. ముల్లోకాలను మూల మూలా వెదికాను. ఎక్కడా ఆ హరిజాడలనైనా నేను కనుక్కోలేకపోయాను. ఎక్కడా లేడు. ఈ భక్తులు చెప్పేవన్నీ అబద్ధాలు అయి ఉంటాయి అనుకొన్నాడు.
వీరు చెప్పేది నిజమా కాదా అని తేల్చు కోవడం ఎలా అనుకొంటున్న సమయంలో నే ‘‘రక్షించండి. రక్షించండి. మనకులంలో ముసలం పుట్టింది. మనలను ఎదిరించేవాడు, మన లను ఆక్షేపించేవాడు, కులహీనుడు, కులద్రోహి ఇక్కడే ఉన్నాడు ప్రభూ మీరే రక్షించాలి. మమ్ములను కాదు కాదు మిమ్ములును మీరే కాపాడుకోవాలి ’’అని అరుస్తూ గురువులగొంతు భువన భోంతారాళ్లు దద్దరిల్లేట్టుగా వినిపించసాగింది. ఏమిటిది? ఈ ఆర్తనాదాలేమిటి? ఎవరు కులద్రోహి వంశనాశకుడు ఇక్కడే పుట్టాడా.. వాడు ఎవరు అనిమనసులో అనుకొంటూ హిరణ్య కశిపుడు సభాభవనానికి వడివడిగా వెళ్లాడు.
గురువులు చేతులు జోడించి మహారాజా జయం జయం. ఆపద వాటిల్లబోతోంది. మీరు త్వరగా మేలుకొనుడు అన్నారు.

- ఇంకాఉంది

డా. రాయసం లక్ష్మి