డైలీ సీరియల్

కదనానికి కత్తి పడితే చాలా? ( రుక్మిణి -8)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్క ఉదుటక జరాసంధుడు శిశుపాలుని దగ్గరకు వెళ్లాడు.
‘ఇదేమి చిత్రం నీవు ఈరుక్మిణి అందలేదని పేడివానివలె ఏడుస్తూ కూర్చున్నావా.. ఒక్క సుందరి చేజారిపోతే ఇంక వేరే సుందరులే లేరా ఏమిటి? లోకం అంతా గొడ్డు పోయిందనుకొంటున్నావా ఏమిటి? ఇపుడు మనకు కాలం అనుకూలంగా లేదు. ఆ యాదవులకు కాలం అనుకూలించింది కనుక ఆ రుక్మిణి ని లాక్కెళ్లారు. బతికి ఉంటే మనం దేనినైనా సాధించవచ్చు. తిరిగి ఆ బలరామకృష్ణులపై యుద్ధాన్ని ప్రకటిద్దాం. అపుడు మన పోరాట పటిమను చూపిద్దాం. ఇపుడు కాలానికి అనుగుణంగానే మనం ప్రవర్తించాలి. శిశుపాలా! కాలం చేతిలో ఎవరైనా కీలుబొమ్మలే. ఆ విధి రాత ఎలా ఉంటే అలా జరిగితీరుతుంది. కానీ మనకిష్టమైన మొచ్చినట్లు జరగదు. ఇదంతా ఈశ్వరమాయ. నేను ఇంతకుముందు మధురపైన పదిహేడు సార్లు దండెత్తివెళ్లాను. అప్పుడంతా బలరాముని చేతిలో బంధీనైపోయాను. నా సమస్త సైన్యాలు నీరుగారిపోయాయి. కానీ మళ్లీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఉంటానుకూడా. పద్దెనిమిదోసారి వెళ్లి మధురపై విజయం సాధించాను.
శత్రువులను నిలువనీడలేకుండా తరిమి కొట్టాను. ఈ గెలుపు ఓటములనేవి ఎపుడు ఒకరి చెంతనే ఉండవు. కాలం ఎవరికి అనుకూలంగా ఉంటుందో వారిచెంత విజయలక్ష్మి ఉంటుంది. దానికి మనం ఖేదమోదాలు చెందకూడదు. ఒకసారి విజయం సాధించామంటే మరోసారి అపజయం పొందితీరుతాము. మరేంఫర్లేదు. తిరిగి మనదేశాలకు వెళ్దాం పద.. శిశుపాలా! నీకెవరు రాసి పెట్టి ఉన్నారో వారితో నీకు వివాహం జరిగితీరుతుంది. దీనికోసం దిగులు చెందనక్కర్లేదు.’అని శిశుపాలునికి ధైర్యం చెప్పారు. రుక్మి ప్రోత్సాహంతో వచ్చిన రాజులంతా మిగిలిన తమ సైన్యాలను వెనక్కు మళ్లించుకుని వారి వారి దేశాలకు వెళ్లిపోయారు. రుక్మి మాత్రం తన చెల్లెల్లి రాక్షస వివాహ పద్ధతిలో కృష్ణుడు ఎత్తుకుపోవడం జీర్ణించుకోలేకపోయాడు. అందుకే వాడియైన బాణాలను పట్టుకొని తన రథ సారథితో ముందుకుపోనిమ్ము ఆ యాదవుణ్ణి నేను అణిచివేస్తాను. నా చెల్లెల్ని ఇలా తీసుకొని పోవడం నేను సహించలేకున్నాను అన్నాడు. వెంటనే రథం బలరామకృష్ణులను వెంబడించి పోసాగింది.
పెద్దగా అరుస్తూ రుక్మి‘‘ ఓయాదవుడా ఆగుము ఆగుము.. నీకు అభిమానం లేక దొంగవలె నా చెల్లెల్ని తీసుకొని పోతున్నావు. ఇదిగో ఇపుడే నీ పొగరణుస్తాను. వెన్నదొంగా గోవులను కాచినట్లు కాదు రణరంగంఅంటే నిలువుము. నాతో పోరుము. ధైర్యముంటే నన్ను ఎదిరించుము. లేకపోతే నా వాడివేడి అయి నాబాణాగ్నిలో కాలిపొమ్ము.’’అని రౌద్రాకారుడై అరిచాడు.
నిలువకుండాముందుకు సాగిపోయే కృష్ణుని రథాన్ని చూసి రుక్మి ‘‘అరేయి నీ పుట్టుక తెలియదు. నీవు ఎక్కడ పుట్టావో ఎక్కడ పెరిగావో తెలియదు. ఏదో గార్దాబాలను, లేళ్లను, జింకను, బండ్లను తుంచివేసి నేను మొనగాడినని విర్రవీగితే కుదురదు. ఇక్కడ రుక్మి విదర్భ పుత్రుడిని ఉన్నాను. నన్ను గెలువుము. నీ శూరత్వమేదో తెలుస్తుంది ’’అని మళ్లీ ఎలుగెత్తి కృష్ణుడిని పిలిచాడు.
కృష్ణుడు వెనుతిరగాడు. రుక్మి మనసు ఏదో కీడు శంకించింది. అయినా దానిని లెక్కించలేదు. ఇక చూడు నీ పని అంటూ కృష్ణునిపై అసంఖ్యాకమైన బాణాలను వేయాలన్న ఉత్సాహంతో వింటినారిని లాగాడు. కానీ అంతలో కృష్ణుడు ఒక్క బాణం వేసి దానితో రుక్మిచాపాన్ని తుంచివేసాడు. ఆరు బాణాలతో రుక్మి శరీరాన్ని బాధించాడు. ఎనిమిది అమ్ములతో రుక్మి రథాశ్వాలను కూల్చివేశాడు. అంతలో రుక్మి మరో ధనువును ఎత్తేలోపే కృష్ణుడు దాన్ని కూల్చివేశాడు. రుక్మి తీసుకొన్న శూలం, అసి, శక్తి, డాలు. తోమరం అన్నింటినీ తునాతునకలు చేసేశాడు. ఇక కాదనుకొని రథం దిగి కత్తి పట్టుకొని కమలాక్షునిపైకి ఎగిసాడు రుక్మి.
కృష్ణుడూ బాణాన్ని పక్కకు పెట్టి కృపాణం ధరించి రుక్మి కత్తిని, అతని కవచాన్ని కూడా తునాతునకలు చేసేశాడు. ఖడ్గం ధరించి రుక్మి తలనరకడానికి కోపావేశంతో అడుగు వేయబోయే తన నాథుడిని చూసి వేగంగా రుక్మిణి ముందుకు వచ్చి రుక్మి కృష్ణుల మధ్యగా నిలబడింది. రుక్మిని రక్షించి కాపాడమని కనులతోనే వేడుకుంది. నా వివాహంతో సంతోషించే నా తల్లిదండ్రుల మోము చూసి ఇతడిని వదిలిపెట్టుము.

- డా. రాయసం లక్ష్మి. 9703344804