డైలీ సీరియల్

ఒకరి కర్తవ్యం, మరొకరి కోరిక.. ( శంకుతల -5)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రియాలు బహు శక్తివంతమైనవి కదా. విధి ప్రతికూలమైనపుడు మరింతగా ఇంద్రియాల వాటి బలాన్ని మనిషి పై చూపెడుతాయికూడా. ఎంత సంస్కారియైనా కన్ను, కాలో ఏదో ఒకటి జారుతుంది. అంతా విధిమాయ అనుకొంటూ ఎప్పటికప్పుడు మనస్సును కట్టడి చేసుకొంటూ సుఖాసనంలో కూర్చుంటున్నాడు విశ్వామిత్రుడు.
మేనకా అంతకంతకూ పట్టుదలను దృఢతరం చేసుకొంటూ తాను రాజాజ్ఞను పాటించడంలో కృతకృత్యురాలిని తప్పక అవ్వాలన్న ధృడనిశ్చయంతో ఆకోనేటి గట్టమీద నడియాడే హంసలతో , బెర్గురుపక్షులతో, కొంగలతో, అక్కడే లేలేత తృణాలను ఇష్టంగా తింటున్న జింకలతో మాటలు కలిపింది. పూవులతో, పూపొదరిండ్లతో హోయ లు పోవడం ఎక్కువ చేసింది. నెమళ్ల క్రేంకారాలకు, చిలుకల పలుకులకు బదులు చెబుతూ మరింత మరింతగా ముందుకు వచ్చి విశ్వామిత్రుని చూస్తూ ఆయన తపోదీక్షలోని పట్టుదలకు ఆశ్చర్యం ప్రకటిస్తూ ఇంత చక్కటి ప్రకృతిని ఇంతగా తిండి తిప్పలు లేకుండా కూర్చోవడమూ, ఆపై దొరికి కాయనో, పండునో తినడంలో ఎన్నికష్టాలున్నాయో భూమాతకు చెబుతూ కన్నీరు ఒలికించింది.
విశ్వామిత్రుని పొగడుతూ మరిన్ని కథలు చిలుకలకు చెప్పింది. ఆయనలోని పట్టుదల, దీక్షా, పరాక్రమం ఎంత గొప్పవో అక్కడే ఉన్న హంసలతోపంచుకుంటూ బ్రహ్మర్షి కావాలని ఎంత తపన పడుతున్నాడో చూస్తూ నాలో ఆవేదన కలుగుతోందని వగలు వోయింది.
ఇన్ని చెవిన పడుతుంటే పాపం విశ్వామిత్రుడు కండ్లు తెరవకుండా, మేనకను చూడకుండా ఉండలేకపోయాడు. తన మనస్సును అదుపు చేసుకొంటూనే ఉన్నాననే భ్రమతోనే ఒకే ఒక్క సారి మేనకను చూద్దామనుకొని కనులు విప్పాడు. దాన్ని చూసిన మేనక తన పంట పండబోతున్నదని గ్రహించింది. కథ రసకందాయంలో పడాలన్న ఆతురతో చాలా మెలకువతో తాను కూడా అప్పుడే ఆ విశ్వామిత్రుని చూసినట్లు నటిస్తూ భయంతో మెలికలు తిరుగుతూ చెంగు చెంగున దూకుతూ పారిపోయింది.
పాపం అమాయకురాలని విశ్వామిత్రుడు అనుకొన్నాడు. తనపై ఎంత అభిమానం ఉందో తనంటే ఎంత భయపడుతోందో అనుకొన్నాడు. ఆ వగలాడి వెనక్కు తిరిగి చూస్తూ వేగంగా వెళ్తున్నట్టు నటిస్తూ నిక్కి నిక్కి చూస్తూ తిరిగి ఆ తటాకంలో గబుక్కున మునిగింది. ఆ ధాటికి ఆ సరస్సులోని నీరు చివ్వున పైకి ఎగిసాయి. మన్మథుని లీలతో ఆ నీరు ఇంకాస్త ఎగిరి విశ్వామిత్రుని మేనిను తుంపరగా స్పృశించాయి. విశ్వామిత్రుడు అయ్యో ఎంతో భయంతో తటాలున చూడకుండా దూకినట్లుందే ఈ అమాయక వనిత పాపం ఏ దెబ్బ అయినా తగిలిందేమో అసలు ఏం జరిగిందో ఎక్కడ నుంచి వచ్చిందో ఒక్కసారి చూసి వద్దాం అనుకొని తన సుఖాసనాన్ని వదిలి అడుగులు ముందుకు వేశాడు.
***
ఇంద్రుని కోరిక, మేనక కర్తవ్యం ఒక్కసారిగా ఊపు అందుకున్నాయి. విశ్వామిత్రుని పనులను ఒక కంట గమనిస్తూనే తటాక తీరానికి రాబోతున్న విశ్వామిత్రుని చూసి బుడుంగు బుడుంగమని మునిగింది. ఆ భామ కోసం చూస్తున్న విశ్వామిత్రుని నీటిలోంచి పైకి వస్తున్నట్లున్న మేనక కూడా అపుడే చూసినట్లుగా కళ్లల్లో భయాన్ని నటింపచేసింది. - ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804