డైలీ సీరియల్

స్ర్తి కోరుకునేది సౌభాగ్యమే !( శకుంతల -9)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుష్యంతుడు పలువిధాలుగా చెప్పి ఆమెను ఒప్పించి వన దేవతల సాక్షిగా, ప్రకృతి పరమేశ్వరుని సాక్షిగా చేసుకొని శకుంతలను గాంధర్వవిధిన వివాహం చేసుకొన్నాడు. మరికొద్దిసేపు అక్కడే ఉండి తను కూడా శకుంతలను విడువలేక విడువలేక విడిచి తన రాజధానికి మరలాడు. శకుంతల కూడా కొత్తగా ఏర్పడిన బంధమైనా దుష్యంతుని తన ప్రాణనాథునిగా తలచింది కనుక ఆమె కన్నీరుమున్నీరు అయింది. తన తండ్రి వచ్చి ఇలా ఎందుకు చేశావని అడుగుతాడేమో అని కూడా కలవరపడింది. కానీ ఒక రాజకుమార్తె అయి ఉండీ రాచకార్యాలకు అడ్డుచెప్పకూడదన్న ఇంగిత జ్ఞానం తనకు ఉండాలనుకొంది. వెంటనే కళ్లు తుడుచుకుంటూ, మనసును దిటవు చేసుకొంటూ తనను ఎప్పటికీ మరిచిపోవద్దు, తన తండ్రి రాగానే మీరు కాలయాపన చేయకుండా రమ్మని తనను తీసుకొని వెళ్లమని ఎన్నోవిధాలుగా దుష్యంతునికి చెప్పింది.
అలా వారిద్దరూ విధివశాత్తు కలిశారు. వివాహమాడారు. విడిపోయారు. ఎవరి దోవన వారు వెళ్లిపోయినట్టుగా విడిపోయారు.
కొన్నాళ్లకు కణ్వమహర్షులు వచ్చారు. శకుంతలను చూశారు. తన థివ్యదృష్టితో జరిగిందేమిటో తెలుసుకొన్నారు. భయపడుతున్న శకుంతలతో మాట్లాడి ఆమెకు అంతా పరమేశ్వరుని ఆజ్ఞ ప్రకారమే జరిగింది దీనికి నీవు విచారించవలసిన అవసరం లేదని చెప్పారు. దుష్యంతుడు యోగ్యుడైన వరుడే . నేను ఉన్నా మీకిద్దరికీ వివాహం చేసేవాడినే. నీవు దిగులు చెందవద్దు. నీకు దేశానే్నలే కుమారుడు పుడతాడు. వానివల్ల నీకు దుష్యంతునికి ఇద్దరికీ కీర్తి లభిస్తుంది అని భయపడే కూతురుని భయం వదిలించి ఆశీర్వదించాడు. ఆ సంఘటనతో శకుంతల మనసులో ఉన్న భయాన్ని శంకను వదిలి హాయిగా ఉంది.
నాలుగురోజుల్లో తన పతిదేవుడు వచ్చి తనను తీసుకొని వెళ్తాడు.అపుడు నేను మహారాణి వైభోగాన్ని పొందుతాను అనుకొంటూ ఎంతో సంతోషంతో దుష్యంతునితో ఉండే కాలాన్ని ఊహించుకుంటూ కాలంగడుపుతోంది.
కాని నాలుగు రోజులు 40 రోజులు అయ్యాయి. నెలలు జరుగుతున్నా దుష్యంతుని జాడ లేదు. కొన్నాళ్లకు శకుంతల గర్భవతి అని కణ్వమహర్షి గుర్తించాడు. ఆమెకు ఆశ్రమంలోని ఇతర ముతె్తైదువుల చేత శ్రీమంతం లాంటి కార్యాలను చేయించాడు. శకుంతలను ఎంతో సంతోషంతో ఉండ మని చెప్పాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ శకుంతలలో దుష్యంతుని ఆలోచనలు కందిరీగల్లా మనసును తొలుస్తున్నాయి. తాను తప్పుచేశానని ఎంతో బాధపడింది. అందరి ఆడవాళ్లు వచ్చి తనను దీవిస్తున్నా తండ్రి ఎన్నో మంచి మాటలు చెబుతున్నా ఆమె మనసు మాత్రం దుష్యంతుని చుట్టూ తిరుగుతోంది.
***
కొన్నాళ్లకు శకుంతల పండంటి బిడ్డను ప్రసవించింది. శకుంతల వానిని చూసి అచ్చం దుష్యంతుని పోలి ఉన్నాడు. కానీ తండ్రిని చూసే భాగ్యాన్ని వీడు పొంది ఉన్నాడో లేదో అని బాధపడింది. ఆ బిడ్డ దినదిన ప్రవర్థమానమవసాగాడు.
కణ్వమహర్షి ఎంతో ఆనందంగా తనకే మనమడు పుట్టాడన్న సంతోషంతో ఆ బిడ్డను పెంచసాగాడు. ఆ బిడ్డను అన్నప్రాసనాది కర్మలు చేయించాడు. ఎనే్నళ్లయినా దుష్యంతుడు మాత్రం ఆశ్రమం వైపునకు రాలేదు. శకుంతల ఎదురుచూపులు నిరాశనే మిగులుస్తున్నాయ. భవిష్యత్తుపై ఆమెకు బెంగ ఎక్కువైంది
.- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804