డైలీ సీరియల్

కాలానికి నిలిచేది సత్యమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవిష్యత్తును దృష్టిని లోపెట్టుకుని ఆ బిడ్డకు కణ్వమహర్షి భరతుడు అని నామకరణం చేశాడు.
శకుంతల కొడుకు నడక నేర్చాడు. తోటి ఆశ్రమ పిల్లలతో ఆటలకు వెళ్లుతున్నాడు. వానిని చూసి శకుంతల మరింతగా కృంగిపోతోంది. కణ్వుడు ఏమి చేయాలో అని ఆలోచించసాగాడు. శకుంతల బిడ్డ నానాటికి వృద్ధి చెందుతూ అడవిలో తిరిగే పులులను, సింహాలను పట్టి బంధించి తనకు మచ్చిక చేసుకోసాగాడు. అడవి జంతువులన్నీ శకుంతల కుమారుడని స్నేహపూర్వకంగా చూసేవి. భరతుడు కూడా వాటితో స్నేహపూర్వకంగా ఉండేవాడు.
పులులతో, సింహాలతో కాస్త కూడా భయంలేకుండా ఆడుకునే ఈ భరతుడిని కణ్వుడు చూశాడు. ఇక దుష్యంతుని దగ్గరకు తన కూతురిని పంపించే సమయం వచ్చిందనుకొన్నాడు. శకుంతల దగ్గరకు వెళ్లి అమ్మా ఇక నీవు కేవలం మహారాణివే కాదు రాజమాతవి కూడా అయ్యావు. కానీ నీ పెనిమిటి ఇంకా రావడంలేదు. దానికోసం నీవు చింతించనవసరం లేదు. నీ బిడ్డను తీసుకని దుష్యంతుని కొలువుకూటానికి వెళ్లు అక్కడ నీ పరిచయాన్ని, ఈ బిడ్డను మహారాజుకు చూపించు. అతడు ఈ బిడ్డను చూడగానే తన ప్రతిరూపాన్ని చూసినట్లు భావించి నిన్ను తన భార్యగా అంగీకరిస్తాడు అని చెప్పాడు.
శకుంతల తన తండ్రి చెప్పినట్లు చేయడానికి పూనుకొంది. ఒక మంచిరోజు చూసి తన శిష్యులను తోడు ఇచ్చి దుష్యంతునితోభార్యగా, ప్రజలతో మహారాణిగా,ఒక తల్లిగా, కుమారుడిని కన్న తల్లిగా ఎలా జీవించాల్సి ఉంటుందో అన్నీ జాగ్రత్తలు తన కూతురికి చెప్పి దుష్యంతుని దగ్గరకు శకుంతలను పంపించాడు.
***
శకుంతల తన తండ్రి తోడు ఇచ్చిన శిష్యులతో, తన కుమారిడితోను కూడి దుష్యంతుని కొలువుకూటమికి చేరింది. ఆమెను చూసి కూడా దుష్యంతుడు ఆమెను గుర్తించినట్లు వ్యవహరించలేదు. దానితో శకుంతల చాలా బాధపడింది. కానీ తండ్రి చెప్పిన మాటలు గుర్తుతెచ్చుకుంది. దుష్యంతునికి తమ పరిచయాన్ని గుర్తు చేసింది. కానీ దుష్యంతుడు తనకు ఆశ్రమంలో శకుంతల పరిచయం అయినట్లు ఏ విధమైన జ్ఞాపకం రాలేదన్నాడు. శకుంతలను గుర్తెరుగనని చెప్పాడు. తన కుమారుడిని హృదయానికి హత్తుకుని తన కొడుకు అవునో కాదో తేల్చుకోమని శకుంతల చెప్పింది. మనస్సాక్షి కి మించిన సాక్షులు ఎవరూ ఉండరు. పుత్రుని పరిష్వంగంలో వచ్చే ఆనందం తండ్రికి మాత్రమే తెలుస్తుందని శకుంతల చెప్పడం విని ఆ రాజదర్బారులో ఉండే వారంతా ఆశ్చర్యంగాను, ఆసక్తిగాను దుష్యంతుని వంక చూశారు.
కానీ దుష్యంతుని లో ఏ విధమైన కదలిక లేదు. తన కుమారుడిగాను, శకుంతల తన భార్యగాను అంగీకరించలేదు.దానితో శకుంతల ఎంతో అవమాన భారంతో వెనుదిరుగుతుండగా అందరికీ వినిపించేట్లుగా, ఆకాశవాణి దివ్య వాక్కులను వినిపించింది.
‘‘ఓ దుష్యంతా! నీవు కణ్వాశ్రమంలో ప్రకృతి సాక్షిగా గాంధర్వవిధిని పెళ్లిచేసుకొన్న అమ్మాయి ప్రసిద్ధపురుషుడైన విశ్వామిత్రుని కూతురు. కణ్వుని పెంపుడు కూతురు. పైగా శకుంతల ధర్మాచరణలోను, సత్యవాక్యపరిపాలనలోను పవిత్రురాలు. ఈమెను నీవు పరిణయమాడినందువల్ల ఈమెకు భరతుడు పుట్టాడు. కనుక నీవు వీరిద్దరినీ స్వీకరించుము ’’ అని దివ్యవాణి పలుకగానే దుష్యంతుడు కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. అపుడు తన స్థానం నుంచి లేచి దిగి వచ్చి శకుంతలను దగ్గరకు తీసుకొని తన బిడ్డను ఎత్తుకుని ముద్దాడి అక్కడి సభాసదులతో ఇలా చెప్పాడు.
నేను ఈ పవిత్రురాలు, పుణ్యాత్మురాలు, విశ్వామిత్రుని పుత్రిక అయిన శకుంతలను గాంధర్వవిధిని పెళ్లిచేసుకొన్నాను. ఇతడు నా కొడుకే. ఈ శకుంతల పుత్రుని గాఢ పరిష్వంగంలో పుత్రుడు అవునో కాదో తెలుసుకోమని చెప్పింది. కానీ నాకు వీనిని చూడగానే నా హృదయం పులకరించిపోయింది. నా మనస్సు ఎంతో సంతోష తరంగాలతో ఉవ్వెత్తున ఉరుకులు వేస్తోంది. కనుక ఈ బిడ్డడు నాపుత్రుడే అని ఘంటాపథంగా చెప్పుతున్నాను. ఇందాక నేను వౌనంగా ఉండడానికి కారణం కేవలం లోకోపవాదు వస్తుందేమో అన్న శంకతోనే నేను ఊరుకున్నాను. ఇపుడు ఇక ఏ భయం లేకుండా వీరిద్దరినీ నేను స్వీకరిస్తున్నాను అని అనగానే ఆకసం పుష్పవృష్టి కురిపించింది. దేవతలంతా శకుంతలాదుష్యంతులను వేయేండ్లు చల్లగా ఉండమని దీవించారు. వారి కొడుకు భరతుని వల్లనే ఈ భూమి భారతభూమిగా ఖ్యాతి వహించింది.
శుభం

డా. రాయసం లక్ష్మి