డైలీ సీరియల్

తత్త్వం తెలిస్తే తికమకే లేదు( వృత్రాసురుడు - 4)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారినంతా చూసి వృత్రాసురుడు తన వైపు ఎవరెవరున్నారో అని ఒక్కసారి సైనికుల వైపు చూశాడునముచి, శంబరుడు, అనర్వుడు, వృషభుడు, శంకుశిరుడు, విరూపాక్షుడు, ఇల్వలుడు, దందశూకుడు, కాలనాభుడు, మహానాభుడు, సుమాలి, మాలి, భూతసంతాపనుడు, వృకుడు ఇలా అసంఖ్యాకమైన రాక్షసులు తరలి వచ్చారు.
దేవదానవు మధ్య భయంకరంగా యుద్ధం సాగుతోంది. ఇరు సైన్యాలు భీభత్సంగా బాణాలు, ఈటెలు, తవ్వుకోలలు, చిల్లకోలలు, గుదియలు, అడ్డకత్తులు, శూలాలు, చక్రాలు, రోకళ్లు, గదలు, ఖడ్గాలు మొదలైన మారణాయుధాలన్నీ ప్రయోగిస్తున్నారు. వారి మధ్య చెలరేగే ధనుష్టంకారాలు, సింహనాదాలు చెవులను నుగ్గు చేస్తున్నాయి. రక్తపుటేరులు ప్రవహిస్తున్నాయి. తెగిన శరీరభాగాలతో రణరంగం అంతా నిండిపోతున్నది. ఉభయసైన్యాల్లో గుఱ్ఱాలు, ధ్వజాలు, సారథులు, రథికులు, రథాలు అన్నీ నాశనమవుతున్నాయి. రాక్షసులు దేవతలపైన చెట్లు, కొండలు విసురుతున్నారు. దేవతలు రాక్షసుల పైన వారి చేతికి అందినవన్నీ విసురుతున్నారు.
ఇలా చాలాకాలం యుద్ధం నడుస్తునే ఉంది. కానీ ఈసారి దేవతాబలం ఎక్కువైంది. దాని ధాటికి తట్టుకోలేక రాక్షసులు తోకలు ముడిచి పారిపోతున్నారు. వారిని వృత్రాసురుడు చూశాడు. వారిని సంబోధించి తిరిగి రణానికి రమ్మని పిలిచాడు. వారు తిరిగి చూడకుండా పరుగెత్తి పారిపోవడం చూసి దేవతల వైపుతిరిగి
పుట్టిన ప్రతివారు ఏదో ఒకనాడు చావుకు దగ్గరవ్వాల్సిందే. మీకు ధైర్యముంటే నాతో మూర్కొనండి. మీరు నాల్గుకాలాలపాటు స్వర్గలోకంలో ఉండాలంటే పారిపోండి. లేదా నాతో తలపడండి. చిన్నవారిపై మీ దాష్టీకాన్ని చూపకండి. ‘ఓ దేవేంద్రా నాకు తెలిసింది. నన్ను చంపడానికి నీవు మహావిష్ణువు పాదాలకు న మస్కరించావు. దధీచీ వెన్నుముకను సంపాదించావు దానితో నన్ను సంహరించాలని ఎంతో ఉత్సాహంతో నిలిచావు. బాగుంది. ఆనాడు దొంగచాటుగా అన్యాయంగా మా అన్న విశ్వరూపుని ఎందుకు చంపావు? నీవలె వారు కూడా బతికి ఉండాలని ఆశించి ఉంటారుకదా. నీవు మా అన్నను చంపినందువల్లే నిన్ను నేడు నేను పోరుకు సిద్ధపడ్డాను. ఇన్నాళ్లు ఆ నారాయణుని దగ్గర నే ఉన్న నీవు ఆయన తత్వాన్ని ఏమి గ్రహించావు? తుదిమొదలు లేని ఆ పరమేశ్వరుని లీలావిశేషాలు గుర్తించలేని వానివి నీకు పదవీ వ్యామోహం ఎందుకు? జన్మ లభ్యమైతే సుఖాలను అనుభవిస్తే చాలా? ఇదేనా నీవు కోరుకున్నది ఎన్నాళ్లని సుఖాలను అనుభవిస్తావు.? వాటిపై నీకు విరక్తి కలుగడంలేదా?’’ అంటూ మరింత వేగం గా మహేంద్రునిపైకి దూసుకొని వెళ్లడానికి వృత్రాసురుడు ఉద్యమించాడు.
ఆ ధాటికి దేవేంద్రుడు తన తొట్రుపాటును అణచుకొంటూ ముందుకు ఉరికాడు. కానీ వృత్రాసురుని విసిరిన ఆయుధంతో దేవేంద్రుని చేతిలోని వజ్రాయుధం కిందకు జారిపోయింది. ఈ పరిణామానికి తత్తరపడి దేవేంద్రుడు వృత్రాసురుని చూస్తూ నిలబడిపోయాడు.
వృత్రాసురుడు‘‘ ఓ దేవేంద్రా! యుద్ధనియమాలను అనుసరించే నేను యుద్ధం చేస్తాను. నిరాయుధుడివైన నీపై నేను ఆయుధం వేయను. నీవు నిరభ్యంతరంగా నీ ఆయుధాన్ని తీసుకో. నన్ను చంపు.నా మనస్సును ఆ వేదవేద్యుడైన ఆ శ్రీహరి పాదాలపై లగ్నంచేశాను. కనుక నాకు ఏబాధ లేదు. నీవు చింతలేకుండా నీ ఆయుధాన్ని తీసుకొని నా మెడను తెగవేయి ’’అన్నాడు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804