డైలీ సీరియల్

ఎవరన్న ప్రశ్న..(. చిత్రకేతువు - 3)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ వింత దృశ్యం చూడగానే చిత్రకేతువు, కృతద్యుతి పట్టలేని ఆనందంతో ఆ పిల్లవానిని పట్టుకొని విచారం, సంతోషం రెండూ కలగలసి ఆ పిల్లవానిని ముద్దాడుతూ ఉన్నారు. అంతలో ఆ పిల్లవాడు ‘అయ్యా , అమ్మా ! మీరు ఎవరు ఎందుకింత దుఃఖమూ, ఆనందమూ అనుభవిస్తున్నారు. నన్నుచూసి మీ ఆనందం ఎక్కువ అవుతున్నట్లు ఉంది. మీరునాకు ఏవిధమైన సంబంధం ఉంది ? ’ అని అడిగాడు.
‘నాయనా! నీవు ఈ తల్లిదండ్రులను సంతోషింపచేయి.’అన్నాడు అంగీరసుడు.
ఆ బాలుడు అంగీరసునికి నమస్కరించి ఇట్లా మాట్లాడాడు.
‘‘మునీంద్రా! నేను గతకాలం నుంచి ఎన్నో జన్మలుపొందాను.ప్రతిజన్మలోను నాకు తల్లిదండ్రులున్నారు. పూర్వకర్మానుసారం నేను ఎన్నో జన్మలు పొందుతూ చస్తూ ఇక్కడికి వచ్చాను. మీరు ఈ తల్లిదండ్రులను సంతోషింప చేయమని చెబుతున్నారు. మరి వీరికన్నా ముందు జన్మలో ఉన్న తల్లిదండ్రులు కూడా విలపించేవారే కదా. నేను ఎవరినని, ఎవరిని సంతోషింపచేయాలి? మీరే నాకు చెప్పండి. జీవుడనేవాడు ఎవరు? అంతటా నిండి ఉన్నది పరమాత్మనే కదా. ఆయనకు బంధాలు, బాంధవ్యాలు ఏమున్నాయి. బంధాలు తెంచుకున్నపుడే కదా జీవుడు పరమాత్మలోలీనమై ఈ జన్మపరంపర నుంచి విడవడుతాడు.ననె్నందుకు తిరిగి ఈ శరీరంలోనే ఉండమని అంటున్నారు.
నేను జననమరణ చక్రం నుంచి తప్పించుకుని పరమాత్మలో లీనంకావాలని ఎదురుచూస్తున్నాను’’
‘స్వామీ ఇక నాకు సెలవు ఇప్పించండి. నేను పరంధాముని సన్నిధికి వెళ్లాల్సినవానిని ’అంటూ నమస్కారం చేసి ఆ బాలుడు తిరిగి కళ్లు మూసుకుని చనిపోయాడు.
ఈమాటలు అక్కడున్న అందరినీ ఆలోచింపచేశాయి. అపుడు చిత్రకేతువు, కృతద్యుతి ఒక్కసారిగా ఆ మాటలకు మతిపోయిన వారివలె అయిపోయి నిశే్చష్టులు అయినారు.
అపుడు అంగీరసుడు ‘చూశారా! చిత్రకేతువు దంపతుల్లారా! అందుకే నేను చెబుతున్నది వినండి. సాధారణంగా ఒక విత్తు నుంచి ఒక వృక్షం పుడుతుంది. ఒక తల్లిదండ్రుల జంట నుంచి మరొక శిశువు పుడుతుంది. ఇది ప్రకృతి సహజంగా జరిగే క్రియలు కానీ వి భగవంతుని ఇష్టాప్రకారం జరుగుతున్నవి మాత్రమే కానీ తండ్రి, కొడుకు, తల్లి కూతురు, అత్త, మామ, అమ్మమ్మ, తాత ఇట్లాంటి సంబంధాలన్నీ బుద్బుధప్రాయములే. ప్రాణం పోయిన వెంటనే ఈ సంబంధబాంధవ్యాలన్నీ ఆ క్షణంలోనే మాయమయిపోతాయి. ఎవరికి ఎవరు ఉండరు.’ అని చెప్పాడు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804