డైలీ సీరియల్

అధర్మానికి శిక్ష తప్పదు( రామకథ -2)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామునితో పాటు సీత, లక్ష్మణులు కూడా వనవాసానికి బయలుదేరి వెళ్లారు.్భరతుడు కూడా అన్న వనవాసం పూర్తి చేసుకొని వచ్చేవరకు తాను దీక్ష వహించి రామపాదుకలకు పట్ట్భాషేకం చేసి రాజ్యాన్ని రాముని బంటుగా పాలించాడు.
వనవాసం చేస్తున్న సీతారామలక్ష్మణులను గురించి లోకకంటకుడైన రావణాసురుడు తెలుసుకొన్నాడు. మారు వేషంలో వచ్చి తల్లి సీతమ్మను అపహరించుకుని వెళ్తాడు. దానితో రామలక్ష్మణులు దుఃఖం పొందుతారు. సీతానే్వషణ చేస్తూ చెట్టు పుట్టా వెతుకుతూ వెళ్లి మార్గమథ్యంలో వానరులతో స్నేహం చేస్తారు. వానర ప్రముఖులైన వాలిసుగ్రీవులను ఆంజనేయుడిని వారు కలుసుకొంటారు.
సుగ్రీవుడి భార్యావియోగాన్ని దూరం చేయడానికి, అధర్మమార్గంలో నడిచే వాలి పని పట్టడానికి రాముడు వాలిని సంహారం చేస్తాడు. ఆ తరువాత సుగ్రీవుని ఆజ్ఞతో ఆంజనేయుని నాయకునిగా చేసుకొని ప్రపంచం నలుమూలలా సీతానే్వషణకు వానరులు వెళ్తారు.
చివరకు వందయోజనాల ఉన్న సముద్రాన్ని ఆంజనేయుడు దాటి వెళ్లి లంకలో ప్రవేశించి అశోకవనంలో దుఃఖంలో కూరుకుని పోయి ఉన్న సీతమ్మ జాడ తెలుసుకొంటాడు. సీతమ్మకు రాముని క్షేమ వార్త చెప్పి త్వరలోనే రావణాసుర సంహారం రాముడు చేస్తాడని సీతమ్మకు ధైర్యం చెప్పి తిరిగి రాముని వద్దకు మారుతి చేరుకొంటాడు. విచారంలో మునిగి పోయి ఉన్న రామునికి సీతమ్మ క్షేమ వార్త చెప్పి సుగ్రీవునితో కలసి సర్వవానరులను లంకపై దాడికి సమాయత్తం చేస్తాడు. ఆ తరువాత రామ లక్ష్మణులు ఆంజనేయ, సుగ్రీవుల వంటి వానర సైన్యంతో కలసి రావణాసురునితో పోరుకు దిగారు. రావణాసురుని సోదరుడు విభీషణుడు వచ్చి రాముని శరణు కోరుతాడు. చివరకు రాముడు రావణుని సంహారం చేస్తాడు. విభీషణుడు సీతమ్మను తీసుకొచ్చి రామునికి అప్పజెప్పుతాడు. సీతారాములు లక్ష్మణుడుతో కలసి సర్వవానరులతోను, విభీషణునితోను అయోధ్యకు బయలుదేరుతారు. రామునికోసం ఎదురుచూసున్న భరతుడు వారిని అత్యంత సంతోషంగా ఆహ్వానించుతాడు. అపుడు కనుల పండుగగా రామపట్ట్భాషేకం జరిగింది. రాముడు పదకొండు వేల సంవత్సరాలు కాలక్రమంలో రామునికి లవకుశులు జన్మించారు. శుభం
ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804