డైలీ సీరియల్

భక్తాగ్రగణ్యురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్కటే పూర్వ పల్గున్యాంతులసీ కాననోద్భవామ్
పాణ్డ్య విశ్వంభరాం గోదాం వనే్ద శ్రీరంగనాయకమ్
ఈ పైశ్లోకం నిత్యం వైష్ణవ ఆలయంలో వినిపిస్తూంది. ఈ శ్లోకం ఆండాళు తల్లి ఉద్భవం గురించి సూక్ష్మంగా తెలుపుతూంది. అసలు కథకు వస్తే శ్రీమన్నారాయణుడు మార్కండేయాది మహర్షుల ప్రార్థన ప్రకారం వటపత్రశాయియై సర్వజీవులకు సేవనందించుచూ వేంచేసి వున్న దివ్య దేశమైన దక్షిణ భారతంలో శ్రీ విల్లిపుత్తూరున నందన వనమున పెరిగి యాళ్వారు తిరుత్తుళాయి (తులసిచెట్టు) పాదులను సవరించుటకు మట్టిని తవ్వుచుండగా ఆ భూమియందు శ్రీ్భదేవి అంశమున శ్రీ ఆండాళు అయోనిజయై కలియుగ నళనామ సంవత్సరమున ఆషాఢ మాసమున (శుద్ధ) చుతుర్థి మంగళవారం పుబ్బా నక్షత్రం కూడియున్న శుభ దినమునందు అవతరించగా ఆ బిడ్డను ఆళ్వారు తమ పుత్రికగా భావించి ‘గోదా’ అని తిరునామముతో అతి గారాబంగా సాకసాగిరి. తదనంతరం గోదాదేవికి విష్ణుచిత్తుడాళ్వారు పంచమ సంస్కారమలు గావించి పరమ జ్ఞానమును ఉపదేశించారు.
గోదాదేవి తన చిననాటి నుండి పెరుమాళ్ళయందే అతి భక్తితో సదా వారి మహిమలను తలచుకుంటూ పాడుతూ పెరిగి పెరియాళ్ళారు వటపత్రశాయి శ్రీరంగనాథుని చేయు పుష్ప కైంకర్యమునందు మిగుల శ్రద్ధ్భాక్తులతో ప్రావీణ్యముతో తోడ్పడుచుండిరి. అనుదినము విష్ణుచిత్తులవారు శ్రీరంగనాథునికి పెరుంకోయిలుడైన ఆయనకు సమర్పించుటకు కట్టి ఉంచిన పుష్పమాలికలను వారింటిలో లేని సమయములో గోదాదేవి ధరించుకొని పెరుమాళ్ళకు భార్యయగుటనే తగుదునా అని తన సౌందర్యమును నిలువుటద్దమునందు పదే పదే చూచుకుంటూ మురిసిపోతూ ఆనందముగా మరల ఆ పుష్పమాలికలను పెరుమాళ్ళకు సమర్పించుటకై పెట్టిన బుట్టలో పెట్టేవారట. ఆళ్వార్లు ఆ పుష్పమాలికలను పెరుమాళ్ళకు సమర్పించేవారట.
గోదాదేవి అత్యంత భక్తిరసంతో రచించిన ముప్ఫై పదాలు ముప్ఫై పాశురాలుగా తిరుప్పావైగను మరి ‘నాచ్చియారు తిరుమొళి’ అను రెండు ప్రబంధములను భక్తి సుమాలుగా గ్రుచ్చి శ్రీరంగనాథునకు సమర్పించుకొనిన దివ్య మంగళ రూపురాలైన మన ఆండాళు తల్లి వైష్ణవ ఆళ్వారులలో ఒకరుగా సముచిత స్థానం సంపాదించుకొని శ్రీరంగనాథుని పతిగా ఆయన సతిగా భక్తి సుమమాలతో వైష్ణవ భక్తులచే నిత్యం కీర్తింపబడుచున్నది.

-కొలనుపాక మురళీధరరావు.. 9247159203