డైలీ సీరియల్

శ్రీకృష్ణ రమ్య రామాయణం (రెండవ భాగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐతే, శ్రీరామ వనవాసానికి కారణమెవరంటావు ?’’
‘‘మందరా, కైకేయిలు’’
‘‘మరి వాళ్ళ మాటేమిటి ?’’
‘‘వాళ్ళకీ ఋణపడి ఉన్నాడీ హనుమ. వాళ్ళు లేక వనవాసం ఉండేదా? నాకు రామదర్శనం లభించేదా ? నా రాముడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసి ఉండేవాడా ? ఋషులకూ, మునులకూ లభించేదా ప్రశాంతత ? తిర్యగ్వర్గులకు భద్రత ఉండేదా ? ... నిజమే స్వామీ ! ప్రజలు మూర్ఖులు! నిజానికి, మందరనీ, కైకేయినీ కీర్తించాలి మనం. రాముని కీర్తిప్రతిష్ఠలు, వందల వేలరెట్లు కావడానికి కారణం వాళ్ళేకదా ?’’ అంటూ చేతులు జోడించి, సవినయంగా మనవి చేసుకున్నాడు హనుమ. ‘‘వింటున్నారా’’ అంటూ తన భార్యలవంకా, భక్తుల వంకా చూశాడు కృష్ణుడు !
‘‘మరి వాళ్ళ కథ మాటేమిటి ? తప్పకుండా చెప్తాను స్వామీ ! కానీ మధ్యలో ననె్నవరూ ఆటంకపరచకూడదు’’.
‘‘అమ్మో ! అదెలా సాధ్యం ! ... ఇంతమంది కోతుల్నీ, అందులో పిల్లకోతుల్నీ ఎలా నియంత్రించేది ?’’
హనుమ కాసేపు యోచించాడు.
‘‘స్వామీ ! ... ఒక ఉపాయం !’’
‘‘చెప్పు నాయనా !’’
‘‘నేను సీతామాతను అనే్వషించినప్పుడు లంకలో తిరిగి తిరిగి, చివరికి ఒక ఉదయ సంధ్యావేళ అశోకవనంలో ఒక అశోకవృక్షం క్రింద శోకమూర్తి వలెనున్న సీతమ్మను చూశాను’’.
‘‘ఐతే ?’’
‘‘అప్పుడు చుట్టూరా రాక్షసస్ర్తీలు. మధ్యలో సీతమ్మ. నేనప్పుడు పిల్లకోతిగా మారి, శింశుపా వృక్ష శాఖల్లోకి దూరి, రామకథా గానం చేశాను. అమ్మ విన్నది. నాకోసం నలుదిక్కులా చూచింది. నేనప్పుడు నిజ స్వరూపంతో అమ్మ ఎదుట ప్రత్యక్షమయ్యాను.
‘‘అవునా ?’’
‘‘అవును స్వామీ ! ... మళ్ళీ అప్పటివలెనే హ్రస్వరూపంలో, చెట్టు కొమ్మల్లో ఒదిగి, రామకథాగానం చేస్తాను మీరనుమతిస్తే’’ అంటూ చేతులు జోడ్చాడు హనుమ.
‘‘మంచిది నాయనా !’’ అంగీకరించాడు ప్రభువు.
‘‘అలాగే ! హ్రస్వరూపధారియై, మళ్ళీ చెట్టెక్కాడు హనుమ. ఎవరికీ కనిపించకుండా కొమ్మల్లో, రెమ్మల్లో ఒదిగిపోయి, రామకదని వినిపించసాగాడు.
అప్పుడు, కళ్ళు చించుకున్నా, చెట్టు తప్ప హనుమ కనిపించలేదు ఎవ్వరికీ. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంది.

ఇంకా ఉంది

- గన్ను కృష్ణమూర్తి, 9247227087