డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--91

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడిచే పసిపాపను సముదాయించే మాతృమూర్తి ఐనదామె. అతని తలను ఒడిలోకి లాక్కొని, ఫాలభాగాన్ని నిమిరి, రొమ్ములకు హత్తుకొని ఊరడించింది. ఒక్క మాట కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నారిద్దరూ.
ఐతే మాట్లాడినట్లయితే, ఆ మాటలకు ఒక పరిధి ఉండేది. కాని, ఈ చేతలే, మాటలకు లొంగని, మాటల్లో ఇమడని మహత్తర భావాలను, శక్తివంతమైన అర్థాలను తెలియజెప్పినవి.
ఉభయులూ తమను తాము సంభాళించుకోగలిగారు.
‘‘ఏంటనీ!’’ అన్నదామె. ‘‘ఇంత పిచ్చివాడివైపోతావనుకోలేదు.. నేను అర్థం చేసకున్నాను- నీకు మతిస్థిమితం లేక నన్ను ములుకుల్లాంటి పలుకుల్తో బాధించావే కాని, నిజంగా నన్ను గాయపరుద్దామని కాదని.. ఔనా?’’
‘‘రాణీ! నేనేం చెప్పాలో నాకే తెలియటంలేదు. మాటలు రాని పసిపాప ఏం చెప్పదలుచుకున్నాడో, వాడి హృదయంలోని భావాలేమిటో, తల్లికి మాత్రమే గ్రాహ్యవౌతుంది. అదేవిధంగా ఈ సమయంలో నా తలపులేమిటో నీవే సరిగ్గా గ్రహించగలవు.. ప్రియా! నేనంత మూర్ఖుణ్ణి! క్షణంలో ఆకాశ హర్మ్యం నుంచి నేలమీద దుమ్ములోకి పడ్డాను. ఐనప్పటికీ పతనమైన నన్ను, నీవు ఉద్ధరించావు. ఎన్ని జన్మలకు ఈ ఋణం తీరుతుందో తెలియదు’’ అన్నాడతను.
‘‘నేను నీకేదో వొరగబెట్టానని నేను ఎన్నడూ అనుకోవటం లేదు స్వామీ! అన్నదామె; తిరిగి ఆమె కంఠస్వరంలో కోయిలలు పలుకుతూన్నవి. ప్రణయ మాధుర్యం పలుకుతూన్నది. ‘‘పూవుకూ, తుమ్మెదకూ వున్న సహజమైన బంధంలాటిదే మనను కలిపింది. ఒకరు ఎక్కువైందీ, మరొకరు తక్కువైనదేమీ లేదు. ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉన్నాం.. అంతే!’’
క్లియోపాత్రా ప్రణయం అమరమని ఏంటనీ నమ్మాడు. తన ప్రణయం అంత బలవత్తరం కానందుకు సిగ్గుపడ్డాడు కూడాను. ఇకముందన్నా నిజమైన ప్రేమ మాధుర్యాన్ని చవిచూసే సదవకాశం ఉండగలదనుకున్నాడు.
‘‘రాణీ! నన్ను చీకటిలోంచి వెలుగులోకి తీసుకొచ్చావు. పశ్చాత్తాపంతో దగ్ధమైన నేనిప్పుడు నా మాలిన్యాన్ని వదిలించుకున్నాను. నా జీవిత కోణాలన్నింటా నీవే! నా హృదయంలో నీకు తప్ప వేరెవ్వరికీ- చివరికి ఆ భగవానుడిక్కూడా తావు లేదు. నీ మాటలే నాకు శిలాక్షరాలు. నిన్ను ఆరాధించటమే నేను తరించటం!’’ అన్నాడతను.
వారి ఈ ప్రేమ భాషణలు పూర్వంవలె రంగులు దిద్దుకొని, స్వాభావింకన్నా కృత్రిమమే ఎక్కువనిపించేవిగా లేవు. కేవలం నగ్నమైన సత్యంవలె, పిడుగువలె శక్తివంతమై, లోతైన భావాలతో, పరిపక్వమైన స్థితిలో ఉన్నవి. ఒక కీడు ఎంత మేలు చేయగలదో, తమను ఎంత ఎత్తుకు తరముకొనిపోగలదో వారిద్దరికీ అర్థమైపోయింది.
ఆగర్భశత్రువులవలె ప్రవర్తించినవారల్లా, ఒకరిలో మరొకరు లీనమైపోయి, జన్మజన్మాల స్నేహబంధనకు లోబడి ఉన్నట్లే అనురాగ సుముద్రంలో మునిగిపొయ్యారు. పాతబడిపోయిందనుకున్నవారి ప్రణయానికో కొత్త శక్తి వచ్చింది! అది మహావృక్షమై, ఊడలు దించుకున్నది. ఒకసారి వీరిని విడదీయటం బ్రహ్మతరం కూడా కాదనిపించింది.
తెల్లవారు జామువరకూ వారు తమ స్థితిని తెలుసుకోలేకపొయ్యారు. చివరకు అలసిపోయి, ఒకర్ని చూసి మరొకరు నవ్వుకున్నారు. మన్మథుడు ఉభయుల్నీ కలిపివేశాడు. ఒకరు మరొకరికి లొంగిపోయినందుకు, చిత్రమైన రుూ సంఘటనకు వారు ఆశ్చర్యపడ్డారు.
‘‘ప్రియా! మన రుూ ప్రేమ అమర ప్రేమ! దేవతలే ఈర్ష్యాళువులవుతారుక!’’ అన్నాడు ఏంటనీ.
‘‘ఈ పంచభూతాలే అందుకు సాక్షి!’’ అన్నదామె.
తెల్లవారుతున్నదనే జ్ఞానం స్వాప్నవిక జగత్తునించి వారిని నిజ జీవితానికి తోసిపారేసింది. ఇక జరగవలసినందంతా నిర్ణయించవలసింది క్లియోపాత్రాయే! లీలగా ఉంటూన్న తన వ్యక్తిత్వం, ఇపుడు పూర్తిగా మరుగునబడిపోయి, తాను కేవలం క్లియోపాత్రా నీడలోనే ఇమిడిపొయ్యానని ఏంటనీ తెలుసుకున్నాడు.
‘‘ననే్నం చేయమని ఆజ్ఞ రాణీ!?’’ అన్నాడు ఏంటనీ.
‘‘ఏంటనీ! ఈ యుద్ధంలో విజయం మనదే కాగలదనే ధైర్యం నాకు లేదు. ఇప్పుడు శత్రువును దెబ్బతీయటం కాదు! ఆ దెబ్బ కాచుకోవడం పెద్ద సమస్య. అందునా ఇది నౌకాయుద్ధమైంది. మన సేనాధిపతి ద్రోహం చేశాడు. అపశకునాలనేకం నన్ను కుంగదీస్తూన్నవి. ఇక యుద్ధం తప్పదు కనుక ఎదుర్కోవలసిందే! ఐతే, ఈజిప్టు పతాకాలున్న నౌకలు యుద్ధ రంగంలోకి రావు. ఎందుకంటే, ఈ యుద్ధం ముందుగా ఆక్టోవియన్ మధ్యా, నీ మధ్యా జరగాలి. ఆ తరువాతనే ఈజిప్టు కల్పించుకోగలుగుతుంది’’ అన్నదామె.
ఏంటనీకి చిరుచెమట్లు పోస్తూన్నవి.
‘‘రాణీ! అంటే, రుూ యుద్ధంలో నాకు నీ సహాయం ఉండదా?’’ అన్నాడు.
‘‘ఉంటుంది. ఇదంతా నాకోసం కాదా? కాని, బైటికి మాత్రం నేను దూరంగా ఉంటేనే బాగుంటుంది.. ఇది ఊరుగాని ఊరు. ఒకవేళ యుద్ధంలో అపజయమే సంభవిస్తే- ఎందుకంటే కీడెంచి మేలెంచడం మంచిది కనుక- మనం ప్రాణాలను దక్కించుకొని ఈజిప్టుకు పారిపొయ్యేందుక్కూడా వీలు లేకుండా, ఈజిప్టు నౌకల్ని ఈ యుద్ధంలో బలిపెట్టటం మనకు ప్రమాదవౌతుంది. కనుక ఈజిప్టు మధ్యవర్తిగా మాత్రం నటించినట్లయితే మనం పారిపొయ్యేందుకు ఎలాంటి ఆటంకమూ ఉండదు కదా!’’ అన్నదామె.
ఏంటనీ ఆమె తెలివికి ఆశ్చర్యపడ్డాడు. తన బుర్రకు తట్టని అనకే విషయాలలో ఆమె ఎంతెంత లోతులకు వెళ్లి ఆలోచించగలుగుతున్నదో, ఎంత జాగ్రత్తల మనిషో, ఎంత అనుభవం ఆమె మాటల్లో దాగివున్నదో అతనికి అర్థవౌతున్నది. ఇంకా కొద్ది అనుమానాలు అతన్ని పీడిస్తున్నవి.
‘‘రాణీ! ఒకవేళ మనం పారిపోవటమే జరుగుతే, ఇక్కడున్న సైన్యల గతేమిటి? వీటిని వదిలి వెళ్తే, అవి ఆక్టోవియన్‌కు లొంగిపోవా?’’ అన్నాడు.
‘‘ఏంటనీ! ఆక్టోవియన్ ఈ సైన్యాలను పోషించలేడు. అతని దగ్గర బంగారం లేదు. వున్న బంగారమేదో, మనం మన దేశానికి తీసుకొని వెళదాం. ధనం వుండాలే కాని, మానవ ప్రాణాలు కారుచౌకగా దొరుకతవి. వీలుంటే తరువాత ఈ సైన్యాలను అక్కడికి జేర్చుకోవచ్చు లేదా అక్కడే కొత్త సైన్యలను సమీకరించుకోవచ్చు’’ అన్నదామె.
సైనిక శిక్షణ, యుద్ధ రంగ కౌశలం, రాజకీయ పరిజ్ఞత, జీవితానుభవం మొదలైనవి క్లియోపాత్ర రక్తంలోనే కలిసిపోయిన లక్షణాలే ననిపిచినవి. తాను కొనే్నళ్ళపాటు ఆలోచించినా, ఈ సమస్యలు ఇంత తేలిగ్గా పరిష్కరించబడేవి కావు కదా!
‘‘రాణీ! నీవు చెప్పిందే సరైనది’’ అనక తప్పలేదతనికి.
‘‘యుద్ధం సాగించు ఏంటనీ. యుద్ధం కూడా జరగకుండా మనం పారిపోతే రోమన్‌లు ఓడలు తరిమి తరిమి మనను నట్టనడి సముద్రంలో ముంచివేస్తవి. కనుక, నేను దూరం నుంచి ఈజిప్షియన్ నౌకలమీది నంచి అంతా చూస్తూ వుంటాను. నాకు యుద్ధంలో అపజయం సంభవిస్తుందనే అనుమానం కలిగిన మరుక్షణంలో ఈజిప్షియన్ ఓడల తెరచాపలు గాలిలోకి లేస్తవి. అదే గుర్తు- నీవు వెంటనే వెనక్కు వచ్చి, నా ఓడ ఎక్కు. అక్కడ మన మిగతా నౌకలు యుద్ధాని సాగిస్తూ, శత్రువులను కదలకుండా చూస్తూంటవి.
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు