డైలీ సీరియల్

యాజ్ఞసేని-52

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర దిక్కును జయించి ధనరాశులను తెచ్చినందులకు అర్జునుడు ధనంజుయుడు అనే పేరును పొందాడు.
భీమసేనుడు
తూర్పు దిక్కునకు బయలుదేరి వెళ్లిన భీమసేనుడు కుమార దేశపు రాజైన శ్రేణిమంతుడిని, కోసల రాజైన బృహద్భలుని, అయోధ్యానగర ప్రభువైన దీర్ఘయజ్ఞుని (దీర్ఘప్రజ్ఞుని) జయించాడు. పిదప గోపాలకక్షుని, ఉత్తర కోసల రాజును, మల్లరాజ్యాధిపతి అయిన పార్థివుని, జలోద్భవరాజ్యాన్ని (హిమాలయ పర్వత సమీపానగల) భల్లాట సమీప దేశాలను, శుక్తిమంతం అనే పర్వతాన్నీ జయించి కాశీ రాజైన సుబాహుని లొంగదీసుకొని, సుపార్శ్య దేశ సమీపానగల రాజు క్రథుని ఓడించాడు.
మత్స్యదేశాన్ని, మలద ప్రదేశాలను, అనఘ, అభయ ప్రదేశాలను, పశుపతినాథ సమీపాన గల (నేటి నేపాల్) ప్రదేశాలను, మదధారమనే పర్వతాన్నీ, సోమధేయ నివాసులను, వత్సభూమిని స్వాధీనపరచుకున్నాడు. భర్గదేశ రాజులను, నిషాధపతిని, మణిమంతుడు అనే రాజును దక్షణమల్ల భోగవంతం అనే పర్వత ప్రాంతాన్ని, శర్మక, వర్మకులను వశపరచుకొని విదేహ రాజు జనకుని మొదలగు వారిని శ్రమ లేకనే తనవారిగా చేసికొన్నారు.
శకులను, బర్బరులను జయించాడు. ఇంద్ర పర్వత ప్రాంతానగల ఏడుగురు కిరాత రాజులను జయించి, తదుపరి సుహ్మ, ప్రసుహ్మ దేశ రాజులను, మగధ దేశం వైపు మార్గంలో గల దండుని, దండదారుని జయించి గిరివజ్రపురం చేరి జరాసంధుని కుమారుడైన సహదేవుని అనునయించి కప్పం వసూలు చేశాడు. శత్రుఘాతి అయిన కర్నునితో తలపడి అతనిని వశపరచుకొని కప్పం కట్టించాడు. మోదగిరి రాజును చంపివేశాడు. పుండ్రాధిపతి పౌండ్రవాసుదేవుని, కౌశికీనదీ తీరంలోని మహాజనుని జయించాడు. సముద్రసేనుని, చంద్రసేనుని, తామ్రలిప్తి దేశ రాజును, కర్వాటాధిపతిని, లౌహిత్య దేశ రాజును, మ్లేచ్ఛరాజును జయించి కప్పాలను వసూలు చేశాడు. అనేక రత్నరాశులను, ఆభరణాలను, చందనం, అగరు, మణులు, వెండి, బంగారు, పగడాలు, ముత్యాలు, వస్త్రాలు, పట్టుబట్టలు, కంబళ్ళు మొదలగు లెక్కకుమించిన కానుకలను గ్రహించి ఇంద్రప్రస్థానికి తిరిగివచ్చాడు. తెచ్చిన ధనరాశులను, కానుకలను ధర్మరాజుకు సమర్పించాడు.
సహదేవుడు
దక్షిణ దిక్కుకు జైత్రయాత్రకు బయలుదేరిన సహదేవుడు, శూరసేన దేశ వాసులను ఓడించి, మత్స్య దేశ రాజైన విరాటుని తన ఆధీనంలోనికి తెచ్చుకున్నాడు. దంతవక్త్రుని, సుకుమారుని, సుమిత్రుని వశపరచుకొని, అపర మత్స్యాన్ని, పటచ్చరులను జయించి, నిషాద దేశం, పర్వతశ్రేష్ఠం, గోశృంగములను వశపరచురకొని ధనరాశులను కప్పంగా వసూలు చేశాడు.
కుంతిభోజుడు ప్రసన్నతతో సహదేవుని ఆజ్ఞను స్వీకరించాడు. చర్మణ్వతీనదీ తీరంలోని జంభకుని సుతుని అణిచివేసి, అపరసేక, సేక రాజులపై విజయం సాధించి, నర్మదా నదీ తీరానగల విదానువిందులను ఓడించి వారి నుండి రత్నరాశులను గ్రహించాడు. భీష్మకుని జయించి వేణానదీ తీరానగల నేతలను, కాంతారక నాటకేయ హేరంభకులను, వాతాధిపతిని, పుళిందులను, పాండ్యరాజును ఓడించాడు. కిష్కంధ గుహను చేరి అక్కడ మైందద్విదుల వద్దనుండి రత్నకానుకలను స్వీకరించాడు.
మహిష్మితి నగరానికి చేరి అక్కడ నీలుడు అనే రాజుతో పోరు సల్పాడు. అగ్నిదేవుని కృపతో నీలుని వశపరచుకొని అతడి నుండి సత్కారాలను, పూజలను అందుకొని కప్పాన్ని గ్రహించాడు.
త్రిపురేశుడైన అమితౌజిని, సురాప్ప్రానగరాధిపతి కౌశికాచార్యుని అదుపులోనికి తీసుకొని, భోజ కటకవాసి రుక్మి, విశాలరాజు భీష్మకుడు సహదేవునికి కానుకలను ఇచ్చారు. శూర్పారక, తారాకట దేశాలను, కాలముఖులను, కాలిగిరి, సురభీపపత్తనం, తామ్రద్వీపం, రామకపర్వతం, తిమింగల రాజులను జయించాడు. పాండ్య, ద్రవిడ, ఉండ్ర, కేరళ, ఆంధ్ర, తాళవన, కళింగ, ఉష్త్రకర్ణిక, అటవీపురి, యమనగరం అనే ప్రదేశాలనుండి కప్పాలను వసూలు చేశాడు.
అన్న భీమసేనుని కుమారుడైన ఘటోత్కచుని లంక దేశానికి పంపాడు. లంకాధిపతి అయిన విభీషణుడికి తన రాకను తెలిపరచగా, అతడి అనుమతితో ఘటోత్కచుని భటులు రాజుముందు ప్రవేశపెడతారు.

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము