డైలీ సీరియల్

యాజ్ఞసేని-68

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హే గోవిందా! హే ద్వారకావాసా! హే కృష్ణా! గోపీజనప్రియా! కేశవా! రమానాథా! వ్రజనాథా! ఆర్తినాశనా! ఈ కౌరవసాగరంలో మునిగిపోతున్న నన్ను ఉద్దరించవా! గోవింద! కృష్ణా! మహా యోగా! విశ్వాత్మా! విశ్వభావనా! గోవిందా! కౌరవుల మధ్య కలతపుడూ నిన్ను శరణు కోరిన నన్ను రక్షించుము! రక్షించుము! రక్షించుము! రక్షించుము! రక్షించుము!
హే కృష్ణ! గోవింద! గోపాల!
ఈ విధంగా త్రిభువనేశ్వరుడూ, హరి అయిన శ్రీకృష్ణుని మనసారా స్మరించి తన రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని బాధతో రోదింప సాగింది. అప్పుడు యాజ్ఞసేని పిలుపు విన్న శ్రీకృష్ణుడు శయ్యనూ, ఆసనాన్ని విడిచి దయాళుడై పరువెత్తి వచ్చాడు.
యాజ్ఞసేని రక్షణకై కృష్ణా! కృష్ణా! నారాయణా! హరే! పురుషోత్తమా! అని ఆక్రోశిస్తోంది. ధర్మస్వరూపుడైన శ్రీకృష్ణ్భగవానుడు అదృశ్యుడై వివిధ సుందర వస్త్రాలతో ద్రౌపదీదేవిని ఆచ్చాదించాడు.
దుశ్శానుడు ద్రౌపది వస్త్రాలను లాగుతుంటే శ్రీకృష్ణుని ప్రభావంతో, ద్రౌపది శరీరం పైనున్నటువంటివే మరెన్నో వస్త్రాలు కనిపించి రాసాగాయి. అనేక వర్ణాలుగల వస్త్రాలు గూడా రాసాగాయి. అప్పుడు సభలో భయంకరమైన కోలాహలం చెలరేగింది.
లోకంలో అద్భుతమైన దృశ్యాన్ని చూచి రాజులందరూ ద్రౌపదిని అభినందిస్తూ దుశ్శాసనుని నిందింపసాగారు.
సభా మధ్యంలో వస్తర్రాశులు ప్రోగుపడగానే దుశ్శాసనుడు అలసిపోయి సిగ్గుతో కూర్చున్నాడు. సభికులు, రాజులు, ద్రౌపది ప్రశ్నకు సరియైన సమాధానం చెప్పనందుకు ధృతరాష్ట్రుడిని, దుశ్శాసనుని నిందించసాగారు.
అప్పుడు భీమసేనుడు కోపంతో పెదవులదురుచుండగా, పళ్లు కొరుకుతూ, చేతులు పిసుక్కొంటూ రాజుల సమక్షంలో
‘‘కురువంశ వృద్ధులు, గురువులు, వృద్ధులు, బంధువులు పెక్కుమంది చూస్తుండగా పొగరెక్కి చెలరేగి ద్రౌపదిని ఈ విధంగా చేసిన ఈ దుశ్శాసనుని ‘రాజు’ (దుర్యోధనుడు) చూస్తుండగానే యుద్ధములో లోకభీకరమైన రీతిలో వధించి, అతని విశాలవక్షస్థలమనే పర్వతంలోని రక్తప్రవాహమనే సెలయేటిని భయంకరాకారం ధరించి త్రాగుతాను.
ఇంతకు ముందెవ్వరూ ఇటువంటి మాటలు అనలేదు. ఇక ముందెవ్వరూ ఇటువంటి మాటలు అనరు. రాజులారా! ఈ దుశ్శాసనుడు, పాపాత్ముడు, దుర్మతి. భరత వంశానికి అపకీర్తి తెస్తున్నవాడు. యుద్ధంలో ఇతని గుండెను చీల్చి నెత్తురు త్రాగుతాను. ఈ మాటను ఆచరించి చూపకపోతే నాకు నా పూర్వీకులు పొందిన ఉత్తమగతులుండవు’’ అని భీకర ప్రతిజ్ఞ చేశాడు.
సభా మధ్యంలో వస్తర్రాశి ప్రోగుపడగానే దుశ్శాసనుడు అలసిపోయి సిగ్గుతో కూర్చున్నాడు.
పాండవుల దుస్థితిని చూచిన రాజులు, సభికులు దుశ్శాసనుని నిందిస్తూ ధిక్కార స్వరాలు చేశారు. ధృతరాష్ట్రుని నిందించసాగారు.
అప్పుడు విదురుడు చేతులు పైకెత్తి అందరూ మాట్లాడకుండగా ఆపి
‘‘బుద్ధిమంతులంతా ద్రౌపది అడిగిన ప్రశ్నకు సమాధానం స్పష్టమయ్యేటట్లు ఆలోచించండి. ప్రశ్నకు సమాధానమివ్వనివారు అసత్యఫలంలోని అర్ధ భాగాన్ని అనుభవింపవలసి వస్తుంది. సభలో నిలిచి ప్రశ్నకు తప్పుడు సమాధానం చెబితే అసత్య ఫలితాన్ని పూర్తిగా తప్పక అనుభవిస్తాడు’’ అని అన్నాడు.
***
మ!! కురువృద్దుల్ గురువృద్ద బాంధవు లనేకుల్ సూచుచుండన్ మదో
ద్దురుడై ద్రౌపది నిట్లు సేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ
కర లీలన్ వధియించితద్విపుల వక్షశ్శైల రక్తౌఘ ని
ర్ఘర ముర్వీపతి సూచుచుండ నని నాస్వాందింతు నుగ్రాకృతిన్!!
(నన్నయ భారతం సభాపర్వం ద్వి. అశ్వా. పద్యం 233)
***

..........................ఇంకా వుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము