డైలీ సీరియల్

యాజ్ఞసేని -- 78

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తదుపరి శ్రీకృష్ణుడు ద్యూత సమయమున తాను రాకపోవుటకు గల కారణములను పాండవులకు వివరించి చెప్పాడు. అటు తరువాత పాండవుల అనుమతితో ద్వారకకు పయనమై వెళ్లిపోయాడు.
39
శ్రీకృష్ణుడు వెళ్ళిన తరువాత ధర్మరాజు బ్రాహ్మణులకు బంగారు నాణాలను, వస్త్రాలను దానం చేశాడు. యుధిస్ఠిరుడు, భీమార్జున నకుల సహదేవులు, ద్రౌపది, పురోహితుడైన ధౌమ్యుడు బ్రాహ్మణులతో కలిసి గుఱ్ఱాలను పూన్చిన రథాలనెక్కి మరొకవనమైన ద్వైత వనానికి బయలుదేరారు. హస్తిన నుండి పాండవులు మొదట వన వాసానికి పయనమై ఒక వనం నుండి మరొక వనానికి వెళ్ళారు. తదుపరి
పాండవులు కష్టతరమైన వనవాసం చేయటానికి గంగాతీరం నుండి కురుక్షేత్రానికి వెళ్ళారు. తదనంతరం దృషద్వతీ, యమునా నదులను సేవించి ఒక వనం నుండి మరొక వనంలో ప్రవేశిస్తూ పశ్చిమ దిక్కులకు వెళ్ళారు. అనంతరం సరస్వతీనదీ తీరంలో మరుభూములను, వన్యప్రదేశాల నుంచి వెళ్ళుచూ కామ్యకవనం చేరి అందున్నారు. యతులను, మునులను, బ్రాహ్మణముఖ్యులందరినీ యుధిష్ఠిరుడు కందమూల ఫలాలతో సంతృప్తిపరచాడు. ధౌమ్యుడు పాండవుల చేత సంబంధించిన యజ్ఞాలను, పితృ సంబంధ క్రియలను చేయించాడు. కామ్యకవనంలో ఉన్నపుడే శ్రీకృష్ణాదులు పాండవులను దర్శించవచ్చారు.
కామ్యకవనంలో ఉన్న పాండవులు తదుపరి ఫలపుష్ప భరితంబైన ద్వైతవనానికి చేరారు. తమాల, తామ్ర, ఆమ్ర, మధూక, పీప, కదంబ, సాల, అర్జున, కర్ణికార వృక్షాలతో, పూలు పూచే అనేక వృక్షాలతో కూడిన ఆ మహావనాన్ని ధర్మరాజు చూచాడు. నెమళ్ళు, చకోరాలు, చాతకాలు, కోకిలలు మొదలగు పక్షుల సమూహాలు కలకలా రావాలు చేస్తూ నివసిస్తున్నాయి.
ద్వైతవనం చేరి అక్కడ చిన్న కుటీరాలను ఏర్పాటుచేసికొని ఉండనారంభించారు.
ద్రౌపది సూర్యభగవానుని అనుగ్రహంతో సంపాదించిన అక్షయపాత్ర యందు ఫలమూలాలను వండి అతిథులకు, బ్రాహ్మణులకు పెట్టి వారు భుజించిన తరువాత పాండవులకు వడ్డించేది. పాండవుల భుక్తశేషాన్ని తాను భుజించేది. ఇది దిన చర్య.
అలా వనవానం చేస్తున్న పాండవులవద్దకు ‘‘మార్కండేయ మహర్షి’ అతిథిగా వచ్చాడు. కురుశ్రేష్ఠుడైన ధర్మరాజు సోదరులతో మహర్షికి అర్ఘ్యపాద్యాలనిచ్చి పూజించాడు. అప్పుడు మహర్షి అందరి మధ్యలోనున్న ద్రౌపదిని, ధర్మరాజును, భీమార్జున నకులసహదేవులను చూశాడు.
మనసులో శ్రీరామచంద్రుని స్మరించి చిరునవ్వు నవ్వాడు. మహర్షి అలా నవ్వడం చూచి ధర్మరాజు వినయంతో
‘‘మునివరా! ఇక్కడ తపస్సులంతా నా అవస్థను చూచి జాలిపడుతున్నాడు. కానీ వీరందరూ చూస్తుండగా నన్నుచూసి తమరు ఆనందంతో నవ్వుతున్నారు. ఎందువలన? అని అడిగాడు. అందుకు మహర్షి
‘‘రాజా! నేను ఆనందించటం లేదు. నవ్వటమూ లేదు. ఇప్పుడు నీకు కలిగిన కష్టాన్ని చూసి సత్యవ్రతుడు, దశరథ తనయుడు అయిన శ్రీరామని స్మరించాను. పూర్వం శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి వనంలో నివసిస్తూ ఋష్యమూక పర్వత సానువులందరు తిరుగుతున్నపుడు చూశాను. నరేంద్రా! సమస్త ప్రాణులు బ్రహ్మయొక్క విధానం ప్రకారం తమతమ పుట్టుకలకు అనుగుణంగా విహితకర్మలను ఆచరిస్తున్నారు. అందువల్ల బలవంతుణ్ణి కదా అని అధర్మం చేయగూడదు. కుంతీనందనా! నీవు సద్గుణములచేత ప్రాణులకంటే ఉన్నతంతా ఉన్నావు
మహానుభావా! పార్థివా! నీవు ప్రతిజ్ఞ చేసిన విధంగా కష్టమైన ఈ వనవాసాన్ని గడిపి, అనంతరం నీ పరాక్రమంతో ప్రకాశిస్తున్న రాజ్యలక్ష్మిని కౌరవుల నుండి పొందుతావు.’’ అని చెప్పి ఉత్తర దిక్కుకు పయనమై పోయాడు
ఆ మహారణ్యం బ్రాహ్మణులతో నిండిపోయింది. వేద ఘోషతో, సరోవరాలతో కూడియున్న అద్వైతవనం అని వైపులా బ్రహ్మలోక సమానంగా పవిత్రమై విరాజిల్లుచున్నది. అక్కడ అంతటా ఋగ్యజస్సామవేదాల ఘోషతో వినిపిస్తున్నది.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము