డైలీ సీరియల్

యాజ్ఞసేని-83

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారితో ‘‘ భీముడు తనకు కావలసిన పుష్పాలన్నింటినీ తీసుకొనుగాక. ద్రౌపది కోరిక మేరకే అతడు వచ్చాడు. అది నాకు తెలుసును’’ అని అన్నాడు.
భీమసేనుడు పుష్పాలను తీసికొని బయలుదేరాడు.
ఇక్కడ దర్మరాజు భీమసేనుని కానక కలత చెంది ద్రౌపదితో ‘‘పాంచాలపుత్రీ! భీముడు ఎక్కడ? ఏ పని చేస్తున్నాడు? సాహసశీలి ఏదైనా సాహస కార్యాన్ని ఆచరించాడా?’’ అని ప్రశ్నించగా ద్రౌపది నవ్వుతూ-
‘‘నేడు సౌగంధిక పుష్పం ఒకటి గాలివాటున ఎగిరివచ్చి మా ముందు పడింది. నేను దానిని అతనికి ఇచ్చి ఇలాంటి పుష్పాలను మరిన్ని నీవు చూచి వుంటే వాటిని తెచ్చి ఇమ్ము’’ అని అన్నాను. మహాబాహువులుగల అతడు నా ప్రియంగోరి వాటికొరకై ఈశాన్య దిక్కుగా బయలుదేరి వెళ్ళాడు అని అన్నది. అప్పుడు ధర్మరాజు-
‘‘మనమందరం భీముడు పోయినదారిలో తొందరగా వెళదాం’’ అని కవలలతో అన్నాడు. ఘటోత్కచా! నీ పరిచారకులు అలసి, కృశించిన బ్రాహ్మణులను మోయుగాక. నీవు గూడా ద్రౌపదీ మాతను ఎక్కించుకొనుము’’ అని ఆన్నాడు.
అన్ని ప్రదేశాలు, కుబేరుని సరోవరం తెలిసినవారు కావడం చేత అతడి పరిచారకులు పాండవులను, బ్రాహ్మణులను, లో(రో)మశ, ధౌమ్యులను వీపులపై ఎక్కించుకొని ఆనందంతో బయలుదేరి, వేగంగా పయనించి సుందర వనస్థలంలో సౌగంధికా సరస్సు వద్ద దిగారు. అక్కడ వున్న భీమసేనుని వీక్షించారు.
అంత ఆ ఉద్యానవన పాలకులు ప్రత్యక్షమై ధర్మరాజుకు, లో(రో)మశ ధౌమ్య మహర్షులకు నకుల సహదేవులకు, బ్రాహ్మణులకు, శిరస్సులు వంచి వినయంతో నమస్కరించారు. పాండవులు కొంతకాలం కుబేరుని ఆధీనంలో గడిపారు. తరువాత ధర్మరాజు సోదరులతో, ద్రౌపదితో మరలా నర నారాయణ మహర్షుల బదరీవనానికి, అక్కడినుండి ద్వైతవనానికి, ఆపై కామ్యకవనానికి చేరాడు.
42
శ్రీకృష్ణాగమనము
పాండవులు ద్వైతవనంలో ఉండగా సర్వప్రాణులకూ సుఖప్రదమైన గ్రీష్మాన్ని అంతరింపజేసి వానాకాలం వచ్చింది. కారుమబ్బులు ఉరుములతో ఆకాశాన్ని, దిక్కులనూ కప్పివేస్తూ రేబవళ్ళు నిరంతరాయంగా వర్షించాయి. నేలంతా గడ్డి మొలచింది. నీట తడిసిన భూమి ప్రశాంతంగా సర్వ మనోరంజకంగా వున్నది. మదించిన చాతకపక్షులు, నెమళ్ళు, మగ కోయిలలు సమూహాలతో సహా ఎగరిపడుతున్నాయి. అలా వర్షర్తువు శుభప్రదమై గడిచిపోయింది.
ఆపై ఆనందహేతువైన ‘శరదృతువు’ సంక్రమించింది. క్రౌంచ పక్షులు, హంసలు అంతటా సంచరింపసాగాయి. ఆకాశం నిర్మలమై నక్షత్రాలు కాంతివంతమయ్యాయి. రాత్రులు ధూళి లేకుండా నిర్మలంగా ఉన్నాయి. గ్రహ నక్షత్ర సమూహాలతో చంద్రునితో వెలుగొందసాగాయి. చెరువులు కలువలతో, తామరలతో అలంకరింపబడియుండగా నిర్మల జలంతో నిండుగాయున్న ‘సరస్వతి నది’ని చూచి ఆనందించారు. కార్తీకమాసంలోని కృష్ణపక్షం ప్రారంభం కాగానే పాండవులు ధౌమ్యునితోనూ, పురోహితులతో కలిసి కామ్యకవనానికి చేరారు.
కామ్యకవనం చేరిన పాండవులు ద్రౌపదితో నివశిస్తున్నారు.
అప్పుడు చాలామంది బ్రాహ్మణులు వారి చుట్టూ చేరారు. అందులోని ఒక బ్రాహ్మణశ్రేష్ఠుడు శ్రీకృష్ణవాసుదేవుడు వస్తున్నట్లుగా చెప్పాడు.
‘‘కురుశ్రేష్ఠులారా! మీరు ఇక్కడకు వచ్చినట్లుగా శ్రీకృష్ణునికి తెలుసు. మహాతపస్వి, చిరంజీవి అయిన ‘మార్కండేయ మహర్షి’ కూడా త్వరలో వచ్చి మిమ్ములను కలుస్తాడు’’ అని అంటుండగా-
శ్రీకృష్ణవాసుదేవుడు రథంమీద సత్యభామా సమేతుడై వచ్చాడు. శ్రీకృష్ణుడు రథాన్ని దిగి వచ్చి ధర్మరాజుకు, భీమసేనునికి నమస్కరించి, ధౌమ్యుని అర్చించాడు.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము