డైలీ సీరియల్

యాజ్ఞసేని-127

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నాయనా! కౌంతేయుడు మహాజ్ఞాని. అర్జునుడు రణభూమిలో బ్రహ్మశిరోస్త్రాన్ని రోషంతో కానీ, నిన్ను నాశనం చేయాలని గానీ ప్రయోగింపలేదు. కేవలం నీవు ప్రయోగించిన అస్త్రాన్ని శాంతింపజేయటానికి మాత్రమే ప్రయోగించాడు. మరలా ఉపసంహరించాడు. నీ తండ్రి ఉపదేశంతో ఈ అస్త్రాన్ని పొంది గూడా అర్జునుడు క్షత్ర ధర్మంనుండి తొలిగిపోలేదు. అతడు ధృతిమంతుడు. సాధువు, సర్వాస్తవ్రేత్త. సజ్జనుడు. అటువంటి వానిని నీవు సోదరులతో, బంధువులతో చంపాలని యెందుకు భావించావు? నీవు పాండవులనూ, నిన్నూ, రాజ్యాన్నిగూడా యెల్లప్పుడూ రక్షించాలి. ఈ దివ్యాస్త్రాన్ని ఉపసంహరించు. నీకోసం శాంతించాలి. ఇప్పుడు నీ తలపైనున్న ఆ మణిని యిచ్చివేయుము. అది తీసికొని పాండవులు బదులుగా నీకు ప్రాణాలను యిస్తారు.’’అని అనగా అశ్వత్థామ.
‘‘మహర్షీ! పాండవులు పొందిన రత్నాలకంటే, కౌరవులు సాధించిన ధనంకంటే ఈ మణి అతి విశిష్టమైనది. ఈ మణిని ధరిస్తే ఆయుధాలవలన గానీ, వ్యాధులవలన గానీ, ఆకలి దప్పికల వలన గానీ, దేవదానవుల వలన గానీ, నాగుల వలన గానీ, మరే యితర రీతిగానూ భయముండదు. అట్టి ఈ మణిని నేను విడువను. కానీ పూజ్యులైన తమ ఆదేశాన్ని పాటించి తీరాలి. ఇదిగో నా శిరోమణి. ఇదిగో నేను. అయితే ఆ గడ్డిపరక మాత్రం పాండవేయుల గర్భాలలోని శిశువులపై పడుతుంది. ఈ దివ్యాస్త్రం వ్యర్థం కాగూడదు. మహర్షీ! ప్రయోగించిన అస్త్రాన్ని ఉపసంహరించే శక్తి నాకులేదు. అందువలన రుూ అస్త్రాన్ని పాండవుల గర్భాలమీదనే ప్రయోగిస్తున్నాను’’అని అన్నాడు. అందుకు మహర్షి
‘‘అనఘా! అలానే చేయుము. మరొక రీతిగా ఆలోచించవద్దు. ఈ అస్త్రాన్ని పాండవేయుల గర్భాలపై విడిచి శాంతించుము’’అని పలుకగా అశ్వత్థామ ముని మాటను గౌరవించి రణభూమిలో ప్రయోగించిన ఆ అస్త్రాన్ని పాండవేయుల గర్భాలపైకి మరలించాడు.
అప్పుడు పాపకర్ముడైన అశ్వత్థామ ప్రయోగించిన ఆ అస్త్రాన్ని తెలిసికొన్న శ్రీకృష్ణుడు ప్రసన్నుడై అశ్వత్థామతో
‘‘గతంలో అర్జునుని కోడలు ఉత్తర ఉపప్లావ్యంలో వుండగా ప్రతి శీలయైన ఒక బ్రాహ్మణుడు ఆమెను చూచి ‘‘కురువంశం నశించిపోయేటప్పుడు నీకు ఒక కొడుకు పుడతాడు. పరిక్షీణ సమయంలో పుట్టినందున అతని పేరు ‘‘పరిక్షిత్తు’’కాగలదు. ఆ సజ్జనుని మాట సత్యవౌతుంది. ఆమెకు మరలా వంశాన్ని నిలుపగల కొడుకు పరిక్షిత్తు పుడతాడు’’అని అన్నాడు. అందుకు కోపించిన శ్రీకృష్ణుడు
‘‘ఆ అస్త్రం అమోఘమైనదే. ఉత్తర గర్భంపై పడుతుంది. ఆ శిశువు మరణించియే బయటపడతాడు. కానీ దీర్ఘాయువును పొందుతాడు.
అశ్వత్థామా! నీవు చెడ్డవాడివి. పాపకర్ముడవనీ, పదే పదే పాపకర్మలు చేసేవాడివనీ, బాలకుని చంపిన వాడివనీ మనుషులందరికినీ తెలుసు. కాబట్టి నీవు ఈ పాపకర్మకు తగిన ఫలితాన్ని అనుభవింపుము. ఎప్పుడూ, యెక్కడా, యెవ్వరితోనూ యేమాట పలికే అవకాశముండదు. అసహాయుడవై నిర్జన ప్రదేశాలలో తిరుగుతుంటావు. నీకు జన సముదాయంతో వునికి వుండదు. నెత్తుటి దుర్గంధంతో, సర్వవ్యాధులతో కూడి దుర్గమారణ్యాలను ఆశ్రయించి తిరుగుతుంటావు.
పరిక్షిత్తు దీర్ఘాయువై, వేదాధ్యయనం చేసి, శరద్వతుడైన కృపాచార్యుని ద్వారా అస్తవ్రిద్యలను పొందగలడు. క్షత్ర ధర్మంలో నిలిచి అతడు అరవై సంవత్సరాలు రాజ్యమేలగలడు. దుర్భుద్దీ! నీవు చూస్తుండగానే పరీక్షన్మహారాజే కురురాజు కాగలడు. నరధమా! నీవు ప్రయోగించిన అస్త్రంలోని అగ్నితేజస్సు దహించిన శిశువును నేను బ్రతికిస్తాను. నా శక్తిని చూడుము’’ అని నిందిస్తూ అన్నాడు. అప్పుడు వ్యాసమహర్షి అశ్వత్థామను చూచి
‘‘అశ్వత్థామా! నీవు మమ్ములను తిరస్కరించి ఈ దారుణ కృత్యానికి పాల్పడ్డావు. బ్రాహ్మణుడవై యుండి కూడా ‘క్షత్రియ ధర్మాన్ని ఆశ్రయించావు. అందువలన కృష్ణుడు మంచిమాటే చెప్పాడు. నీ విషయంలో అలాగే జరుగుతుంది’’అని అనగా అశ్వత్థామ.
‘‘మహర్షీ! నీవు మనుషులలో వుందువుగాక’’అని ప్రతిశాపం యిచ్చి నేను మనుష్యులలోనే కేశలము నీ దగ్గరనే వుంటాను. భగవంతుడైన ఈ పురుషోత్తముని మాట సత్యమవుతుంది’’ అని అన్నాడు.
అట్లా పలికిన అశ్వత్థామ మహాత్ములైన పాండవులకు తన శిరోమణిని యిచ్చి వారందరూ చూస్తుండగానే కలుషిత హృదయుడై అరణ్యానికి వెళ్ళాడు.
తదుపరి పాండవులు వ్యాసమహర్షికీ, నారద మహర్షికీ నమస్కరించి, మణిని తీసికొని శ్రీకృష్ణుని ముందుంచుకొని త్వరత్వరగా ప్రయోపవేశం చేయనున్న ద్రౌపదివద్దకు వచ్చారు. దీనంగావున్న ద్రౌపదిని చూశారు. దుఃఖ శోకాలకులోనై, ఆనందానికి దూరమైవున్న ద్రౌపదిని చుట్టూ కృష్ణునితోసహా పాండవులు నిలిచారు.

..........................ఇంకా వుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము