Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీని అర్థాన్ని పట్టిక రూపంలో తెలుసుకుందాం
విష్ణుపురాణంలోని కాలగణనం ప్రకారం ఒక దివ్య సంవత్సరం- అంటే 360 మానవ సంవత్సరాలు- అనగా 12000న360 = 43,20,000 మానవ వత్సరాలు. ఇది ఒక చతుర్యుగము, చతుర్యుగి లేదా మహాయుగము.
ఈ లెక్క కూడా ఊహాగానంగా ఏర్పడింది కాదు. ఈ సృష్టిలో 4,32,000 సంవత్సరాలకొకసారి సౌర కుటుంబంలోని ఏడు గ్రహాలూ ఒకే రాశిలోకి వస్తాయి. ఈ అంకెలకు మరో విశేషం కూడా వుంది. దీన్ని ............. =4,32,0000. దీన్ని కలియుగానికి కొలతగా తీసుకున్నారు. రెండు కలియుగాల నిడివి ఒక ద్వాపరయుగం. మూడు కలియుగాల నిడివి ఒక త్రేతాయుగం. నాలుగు కలియుగాల నిడివి ఒక కృతయుగం. కాగా ఒక చతుర్యుగిలో 1+2+3+4=10 కలియుగాల నిడివి వుంది. అంటే అవి 43 లక్షల 20 వేల సంవత్సరాలు. ఇలాంటి చతుర్యుగాలు వేయి కలిస్తే సృష్టికర్తకు ఒక పగలు లేక కల్పం అవుతుంది. కనుక కల్పం అంటే 432 కోట్ల సంవత్సరాలు.
ఈ కల్పాన్ని మన్వంతరాలుగానూ, మన్వంతర సంధికాలాలుగానూ విభజించే విధానం మరొకటి వుంది. ఒక్కొక్క కల్పానికీ 14 మన్వంతరాలు వుంటాయి. ఒక మన్వంతరంలో 71 మహాయుగాలు వుంటాయి. ఈ లెక్కలను బట్టి ఇప్పటి ఈ సృష్టిలో జరిగిన కాలమెంతో లెక్కించవచ్చు. ఎలాగంటే-
ఈ విశ్వంయొక్క మొత్తం ఆయుస్సు 14 మన్వంతర కాలాలు, సంధికాలాలు.
ఒక మనువు = 71 చతుర్యుగాలు = 71న43,20,000 = 1,84,03,20,000మానవ వత్సరాలు.
ప్రస్తుతం 7వ మన్వంతరంలో 28వ మహాయుగంలోని కలియుగ ప్రథమ పాదంలో ఉన్నాం. ఈ లెక్క కలపాలి. దానికి మన్వంతర సంధికాలాలు కలపాలి. ఈ లెక్కలన్నీ వేసుకుంటే ఇప్పటికి (అంటే క్రీ.శ.2009 ఏప్రిల్ నాటికి) ఈ విశ్వం వయస్సు =195 కోట్ల 58 లక్షల 85 వేల 110 మానవ సంవత్సరాలు అని మన మహర్షులు తేల్చారు. ఆధునిక విజ్ఞానం దగ్గరికి వస్తే, జియాలిస్టులు రేడియో ఆక్టివ్ క్లాక్ మెథడ్ అనే పద్ధతి ద్వారా భూమి పొరలలోని వివిధ శిలలను పరీక్ష చేశారు. దాని ప్రకారం యురేనైట్ అనే అతి ప్రాచీన శిల వయస్సు సుమారుగా రెండు బిలియన్ (రెండు వందల కోట్ల) సంవత్సరాలు.
కొందరు సముద్ర జలం మీద, కొందరు రోదసిలోని నక్షత్రాల పాలపుంతలమీద, ప్రయోగాలు చేసి అంచనాలు వేశారు. వీరి అంచనాలన్నీ రెండు బిలియన్ల నుంచి అయిదు బిలియన్ల సంవత్సరాల మధ్య వున్నాయి.
ఈ అంచనాల విషయంలో వైజ్ఞానికుల మధ్య వాదోపవాదాలు ఇంకా సాగుతూనే వున్నాయి. అదీగాక, రుూ అంచనాలన్నీ కోట్ల సంఖ్యలలో ఉజ్జాయింపులేనని మనం మరచిపోరాదు. మన మహర్షులు మాత్రం నిక్కచ్చిగా లెక్కలు తేల్చి చెపుతున్నారు. అధునాతన వైజ్ఞానికులు ఈ నిక్కచ్చి సంఖ్యలకు త్వరలో చేరుకుంటారని ఆశిద్దాం.
కాంతివేగం
పాశ్చాత్య శాస్తజ్ఞ్రులు న్యూటన్ దాకా కాంతి అంతులేని వేగంతో పయనిస్తుందని భావించేవారు. క్రీ.శ.1676లో ఓలాస్ రుమాన్ అనే ఖగోళ శాస్తవ్రేత్త కాంతి వేగాన్ని ప్రప్రథమంగా లెక్కకట్టాడు. అటు తర్వాత క్రీ.శ.1887లో మైకెలసన్, మోర్లీ అనే శాస్తజ్ఞ్రులు కాంతివేగాన్ని సెకండుకు 1,86,300 మైళ్ళుగా నిర్ణయించారు.
కానీ ఈ లెక్క వేదాలలోనే నిక్షిప్తమై వున్నదంటే ఆశ్చర్యం వేస్తుంది. ఋగ్వేద సంహిత ప్రథమ మండలం సూక్తం నాలుగవ మంత్రం ఇలా వుంది.
తరణిర్ విశ్వ దర్శనో జ్యోతిష్ కృదసి సూర్య
విశ్వమాఖాసి రోచనమ్
ఓ సూర్యా! అందరికీ దర్శనం ఇచ్చే నువ్వు వేగంలో అందరినీ మించిపోయావు.
(తరణిః= తరతి నభః ఇతి తరణిః ఆకాశమును దాటువాడు) జ్యోతిని కల్గించేది నువ్వే. నీవే అంతా వ్యాపించి విశ్వాన్ని వెలుగుతో నింపుతావు.
దీనికి సాయణాచార్యులవారు (క్రీ.శ.1315 నండి 1387) రచించిన వ్యాఖ్యాభాష్యంలో ఇలా వుంది.
తథా చ స్మర్యతే
యోజనానాం సహస్రే ద్వే ద్వే శతే ద్వే చ యోజనే
ఏకేన నిమిషార్థేన క్రమమాణ నమోస్తుతే
స్మృతులలో ఇలా వుంది. అర్థ నిమిషంలో 2,202 యోజనాలు ప్రయాణం చేసేవాడా! నీకు నమస్కారాలు) మూల మంత్రాన్ని కణ్వ మహర్షి కుమారుడు చెప్పినట్లుగా వుంది. సూర్యేష్టిలోను, చాతుర్మాస్యయాగంలోను దీన్ని వినియోగిస్తారు

--ఇంకావుంది...

--కుప్పా వేంకట కృష్ణమూర్తి