డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాలాంతర గతే భానౌ యత్సూక్ష్మం దృశ్యతే రజః
ప్రథమం తత్ప్రమాణానాం త్రసరేణుం ప్రవక్షతే॥
(చీకటి గదిలో కిటికీ గుండా వచ్చే సూర్య కిరణాలలో కనిపించే చిన్న కణాలవంటి ప్రమాణం కలది త్రసరేణువు)
దీనితో మొదలైన బరువు, రెండువేల రెట్లకు పైగా బరువుండే ‘‘తుల’’ అనే కొలతతో ముగుస్తుంది.
ఆ మనుస్మృతిలో తూనిక రాళ్ల వ్యవస్థను గురించిన ప్రస్తావన కూడా వుంది.
తులామానం ప్రతీమానం సర్వం చ స్యాయత్సులక్షితం
షట్సు షట్సు చ మాసేషు పునరేవ పరీక్షయేత్‌॥
(రాజు తన రాజ్యంలోని తక్కెడలను, వాటిలో ఉపయోగించే కొలమానాలనూ, ఆరునెలల కొకసారి పరీక్షించి అవి సరిగ్గా వుండేటట్లు, చూసుకోవాలి- మనుస్మృతి)
దీనినిబట్టి తక్కెడ, తూనిక రాళ్ళ వ్యవస్థ, మనదేశంలో కృతయుగం నాటికే వుండేదని సుస్పష్టంగా తెలుస్తోంది.
క్రీ.పూ.3వ శతాబ్ది నాటి కౌటిల్యుని అర్థశాస్త్రంలో కూడా కొలమానాల ప్రస్తావన వుంది. దానిలో బంగారం తూచే కొలమానాలూ, వెండి తూచేందుకూ, మణులు తూచేందుకూ కొలమానాలు వేరువేరుగా వున్నాయి.
పొడుగుల కొలత
వైశేషిక దర్శనంలో పొడుగు కొలతలో వాడే అత్యల్పమైన కొలత ‘పరమాణువు’అని తెలుపబడింది.
జాలాంతరగతే భానౌ యత్ సూక్ష్మం దృశ్యతే రజః
తస్య షష్టితమో భాగః పరమాణుః ప్రకీర్తితః॥
(గదిలో ప్రవేశించే సూర్య కిరణాలలో కనిపించే ధూళిలో అరవయ్యోవంతు పొడుగును ‘పరమాణువు’ అంటారు.)
దీన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో టైండల్ ఎఫెక్టులో ప్రస్తావించిన చిన్ని కణంగా చెప్పవచ్చు.
దీని కొలత సుమారు 1/10 -7 సెం.మీ. దాకా వుంటుందనీ, దానిలో అరవయ్యో వంతు అంటే ఈ నాడు వైజ్ఞానిడులు చెపుతున్న పరమాణువు కొలతకు దగ్గరగా వస్తుందనీ ఒక అంచనా!
ఈ అత్యల్ప ‘పరమాణు’ దైర్ఘ్యంతో ప్రారంభమైన పొడుగుల కొలత పదకొండు అంతరాలుగా, దాదాపు మూడువేల పైన రెట్లుగల ‘యోజన’ ప్రమాణం దాకా పెరిగింది. (దైర్ఘ్యం అంటే పొడుగు)
ఇంత సూక్ష్మాతిసూక్ష్మమైన కొలతలను, ఇంత పొడుగాటి కొలతలనూ కూడా వాళ్లు చెప్పారంటే, వాటన్నిటినీ వినియోగించుకొనే విజ్ఞానవికాసం వారికి ఉండేదని మనం అర్థం చేసుకోవచ్చు.
దీనికి తగ్గట్టుగానే సూర్యసిద్ధాంతాది ఖగోళ శాస్త్ర గ్రంథాలలో, భూమి వ్యాసార్థాలను వర్ణించే సందర్భాలలో ఇలాటి కొలమానాల వినియోం మనకు స్పష్టంగా కనిపిస్తోంది.
అణు విజ్ఞానం
ఈనాటి ప్రపంచంలో అణు విజ్ఞానానికి ఉన్న స్థానం అసామాన్యమైనది. పాశ్చాత్య విజ్ఞాన చరిత్రలో పరమాణువుల గురించి ప్రథమంగా ప్రతిపాదించినవాడు 19వ శతాబ్దికి చెందిన డాల్టన్. అటు తరువాతే, ఆటమ్, మాలెక్కూర్, అటామిక్ బాండేజ్ వంటి ఆలోచనలు వారికి పొడచూపాయి. కానీ, అణువు, పరమాణువు అనే భావనలు వేదాలలోనే కనిపిస్తున్నాయి. ఈనాటి ఆటమ్ - మాలెక్యూల్ వంటి సంక్లిష్టమైన అణు సంయోగ రచన 3000 బి.సి ప్రాంతానికి చెందిన వైశేషిక శాస్త్రంలోనే కనిపిస్తుంది. కిటికీలోంచి గదిలోకి ప్రవేశించిన ఎండ పొడలో తేలియాడే ధూలి అణువులలో అతి చిన్నదానిని ‘త్రసరేణువు’ అంటారనీ, దాన్ని ఇంకా ముక్కలు చేసుకుంటూ పోతే కంటికి కనిపించని ‘అణువు’ వస్తుందని, అది ఇక ముక్కలు కాదనీ కణాదుడు చెప్పాడు. ఈ అణువులు రెండు కలిస్తే ద్వ్యణుకము, అవి మూడు కలిస్తే త్య్రణుకము, ఇలా అణుగుచ్ఛాలు పెరిగి పెరిగి, కంటికి కనిపించే త్రసరేణువు దగ్గరనుంచీ మహా పర్వతాల దాకా వుండే స్థూల పదార్థాలు ఏర్పడుతాయనీ, ఉష్ణం వంటి బయటి శక్తుల ప్రభావంవల్ల ఈ అణువులు దూరంగా జరిగిపోయే వీలుందనీ-కణాదుడు ప్రతిపాదించాడు. ఈనాటి మాలెక్యులార్ సిద్ధాంతాలకు ఇది సమాంతరంగానే వుంది. కణాదుడికి దగ్గరి కాలంలోనే వృద్ధి పొందిన న్యాయశాస్త్రం (లాజిక్)లో మైక్రోస్కోపుల ప్రసక్తి స్పష్టంగా ఉంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఎ.డి. 18వ శతాబ్దికిగానీ వాటి ప్రసక్తే లేదు. కొందరు ఆధునికులు కణాదుడి కాలం బి.సి 6వ శతాబ్ది అని భావిస్తున్నారు.
ఇ=ఎసి స్కైర్
ఈ అణు విజ్ఞానం బాగా పెరిగినాక, 20వ శతాబ్ది ప్రారంభంలో ఐన్‌స్టీన్ మహాశయుడు శక్తి పదార్థంగానూ, పదార్థం శక్తింగానూ, పరివర్తన చెందే వీలుందని నిరూపించి, దానికి సంబంధించి ఇ=ఎంసి స్కైర్ అనే సూత్రం కనిపెట్టి, ఆధునిక వైజ్ఞానిక రంగంలో ఒక నూతన విప్లవానికి తెరతీశాడు. కానీ ఆశ్చర్యకరంగా, ఈ సంక్లిష్ట వైజ్ఞానిక సత్యం మన వేదాలలో రూపాంతరంలో దర్శనమిస్తోంది. ఈ ప్రపంచమంతా పరాశక్తిలోంచి జన్మించి పరాశక్తిలోనే లయిస్తోంది అని మన ఉపనిషత్తులు ప్రతిపాదించాయి. అంటే, శక్తి, జడపదార్థము, అనేవి ఒకదానికొటిగా ప రస్పరం మార్పు చెందే పదార్థాలని అవి సూచిస్తున్నాయి. ఇంకావుంది...

కుప్పా వేంకట కృష్ణమూర్తి