డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందువల్ల వ్యవసాయ పద్ధతులు, దానికి సంబంధించి శాస్త్రం అధికాధికంగా అల్లుకుపోయి అభివృద్ధి చెందవలసిన అవసరం ఏర్పడింది.
వ్యవసాయ సాధనాల వర్ణన ఇందులోని ఒక ప్రధానాంశం. వివిధ వ్యవసాయ పనిముట్లు, వాటిలోని భాగాలు, వాటి కొలతలు వర్ణించబడ్డాయి. ప్రత్యేకించి ఇందులో వర్ణించిన నాగలి! ఈనాటికీ అదే వర్ణన సరిపోలుతుంది. చెప్పుకొని వున్నాం కదా.
తర్వాత చెప్పుకోవలసిన అంశం వర్షపాతం గురించిన జ్యోస్యం! ఈనాటికీ భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో, చదవటం వ్రాయటం కూడా రాని రైతులు ఆకాశంలో నక్షత్రాలు, కార్తెలు, వగైరాలు గమనించి వర్షపాతాన్ని జ్యోస్యం చెప్పగలుగుతున్నారంటే- దానికి మూలం పరాశరుడు, వరాహమిహిరుడు వంటి ప్రాచీన పరిశోధకులే.
వాతావరణ శాస్త్రం:
వ్యవసాయ రంగానికి ముఖ్యంగా వాతావరణం అనుకూలంగా వుండాలి. అనగా వర్షపాతం, అతివృష్టి, అనావృష్టి మొదలైన వాటిని గురించి వ్యవసాయదారుడికి ముందుగానే తెలియాలి.
ఆధునిక సైన్సు ఎంతో అభివృద్ధి చెందిన ఈరోజులలో మెటిరియాలజిస్టులు వాతావరణం గురించి, వానల గురించి సుమారు నెల రోజులకంటే ముందుగా చెప్పలేకపోతున్నారు.
కానీ మన ప్రాచీనులు, వ్యవసాయ శాస్త్రానికి అనుబంధంగా వర్షపాతం వివరాలను దాదాపు ఏడాది ముందుగానే చెప్పే శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు.
ఈ విషయంలో మనకు చాలా విస్తృతమైన సాహిత్యం వుంది. ఇప్పటికీ మన పంచాంగకర్తలు కొన్ని పంచాంగాలలో రాబోయే సంవత్సరపు వర్షపాత వివరాలనూ, తుఫానులు, ఎండలు మొదలగు వివరాలను ఇస్తూ వుంటారు. ఈ నిర్ణయాలకోసం జ్యోతిషశాస్త్రంలో ‘‘జలనాడులు’’ ‘‘వాతనాడులు’’ ‘‘అగ్నినాడులు’’అని నక్షత్రాలనూ, కార్తెలనూ మొదలైన వాటిని విభాగంచేసి సంక్లిష్టమైన గణిత ప్రక్రియల ద్వారా ఏయే ప్రాంతాలకు, ఏయే సమయాలలో, ఏయే వాతావరణ సన్నివేశాలు సంభవిస్తాయో ముందుగా చెప్పే ప్రయత్నాలు జరిగాయి. ఇందుకోసం కేవలం గ్రహయోగాలను మాత్రమేకాక వాతావరణంలోనూ వృక్ష జంతుజాతుల ప్రవృత్తులలో వచ్చే మార్పులను నిశితంగా పరిశీలించే విధానాలను మన పూర్వికులు అభివృద్ధిచేశారు. అయితే దురదృష్టవశాత్తు, అలాటి గ్రంథ సంపద చాలావరకు లోపించి పోయింది. ఇప్పుడు లభిస్తున్న గ్రంథాలలో ఆంధ్ర, కన్నడ ప్రాంతాలకు చెందిన రెట్టమత శాస్తమ్రు, శివతత్త్వ రత్నాకరము, అద్భుతసాగరము, మేఘపటలి మొదలైనవి ప్రముఖమైనవి. అయితే ఈ గ్రంథపరంపరలో బృహత్ సంహితకు వున్న ప్రాచుర్యం ఇతర గ్రంథాలకు రాలేదు.
వరాహమిహిరుడి బృహత్ సంహితలోని ప్రవర్షణ అధ్యాయంలో అనేక వివరాలున్నాయి.
వర్షం వచ్చే ఏడు ఎప్పుడు పడుతుందో చెప్పటమేకాక, ఎక్కడ పడుతుందో, ఎంత పడుతుందో కూడా ఏడాదిముందే జ్యోస్యం చెప్పి తద్వారా వ్యవసాయదారులకు ఎంతో ప్రయోజనం కలిగించాలన్న ప్రాచీనుల సదాశయం ఆదర్శప్రాయమైంది.
మేఘాల ‘‘గర్భధారణ’’కు (అనగా సమూహాలుగా ఏర్పడి నీటిని పీల్చుకుని వర్షం కురవటానికి తగిన రూపం దాల్చటానికి), గర్భప్రసవానికి (అనగా వాయువు వగైరాల కారణంగా ఆయా దేశాలకు ప్రయాణించి మేఘాలు వర్షం కురవటానికి) సుమారుగా 195 రోజులు పడుతుందని జ్యోతిశ్శాస్తజ్ఞ్రుల లెక్క.
పుష్యమాసం కృష్ణపక్షంలో గర్భాన్ని ధరించిన మేఘాలు శ్రావణమాసం శుక్లపక్షంలో వర్షిస్తాయనీ, మాఘమాసం కృష్ణపక్షంలో గర్భాన్ని ధరించిన మేఘాలు భాద్రపద శుక్లపక్షంలో వర్షిస్తాయనీ శాస్త్రంలో వుంది.
అయితే ఆయా నక్షత్రాలనుబట్టి కూడా వర్షపాతం మారుతూ వుంటుంది. వివరాలన్నీ బృహత్ సంహిత వంటి గ్రంథాలలో వున్నాయి.
రోహిణీ యోగం, స్వాతీయోగం వగైరా యోగాలు సంభవించిననాడు వాతావరణం గాలి వాలు మొదలైన వాటిని పరిశీలించి వర్షం ఏ నెలలో ఎంతెంత కురుస్తుందో చెప్పే విధానం బృహత్ సంహితలో వుంది.
పడిన వర్షపాతాన్ని ‘‘ఆఢకాలు’’అనే కొలమానంతో కొలుస్తారు. యాభై పలాలు ఒక ఆఢకం. నిర్దిష్ట కొలతలుగల గుండ్రని పాత్రను, వానలో వుంచుతారు. అది పూర్తిగా నిండితే యాభై పలాల (ఒక ఆఢకం) వాన పడినట్లుగా లెక్కవేస్తారు.
ఆంధ్ర ప్రాంతంలో ఈ కొలతలను దుక్కులూ, తూములు మొదలైన మానాలతో కొలుస్తారు. దీనికోసం పూర్వకాలంలో ప్రత్యేకంగా వర్షమాన గణనం చేసే వ్యవస్థ ఉండేది.
ఇటీవలి కాలంలో మన గ్రంథ సంపద తగ్గిపోవటంవల్ల వాతావరణ చిహ్నాలను గుర్తింపజేసే శిక్షణ విధానాలు తగ్గిపోవటంవల్ల జ్యోతిష శాస్త్రంలోనూ, వాతానాడ్యాదుల గణన ప్రక్రియ సంక్షిప్తంగా వుండడంవల్ల మన అధునాతన పంచాంగాలు వాతావరణ జ్యోస్యంలో కొన్ని వైఫల్యాలను ఎదుర్కొంటున్నాయన్న, విమర్శ ఉన్నప్పటికీ మనం సరియైన పరిశోధన చేసి మన అవగాహన సామర్థ్యాన్ని పెంచుకుంటే మన పురాతన వాతావరణ విజ్ఞానం ఈనాటి నవీన విజ్ఞానంకన్నా మెరుగైన జ్యోస్యాలను అందించగలదనటంలో సందేహం లేదు. ఇంకావుంది...

‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.

ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర.
0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి