డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంత లోతైన పరిశీలన, పరిశోధన వున్నాయి గనుకనే, సుశ్రుతాచార్యుడు ప్రపంచంలోని మొట్టమొదటి శస్తచ్రికిత్సాచార్యుడుగా, ప్లాస్టిక్ సర్జరీ, శస్తచ్రికిత్సా సృష్టికర్తగా, మనిషి కపాలానికి కూడా శస్త్ర చికిత్స జరిపిన ప్రజ్ఞానిధిగా ఆధునికుల చేత కూడా కీర్తింపబడుతున్నాడు. ఆ మహనీయుడి ప్రజ్ఞాపాటవాలెలాంటివో తెలిపేందుకు ఒక చిన్న మచ్చు తునకగా, ఆయన చెప్పిన శల్య చికిత్సా (ఎముకల శస్తచ్రికిత్స) విధానాలను పరిశీలిద్దాం-
శల్య చికిత్స-
కీళ్ల దగ్గిర ఎముకలు తొలగినప్పుడు, ఆ జాయింట్ల దగ్గిర ఎముకలను సరిగ్గా అమర్చి కట్టుకట్టాలని చెప్పాడు.
జాయింట్లలో కదిలే జాయింట్లు కదలని జాయింట్లు ఉన్నాయని కూడా తెలిపి వాటిని కూర్చే విధానాన్నికూడా సూచించారు. ముసలమనే శస్త్ర పరికరంతో, తొలగిన భుజపు ఎముకను యథాస్థానంలో కూర్చుండబెట్టి, ‘‘స్వస్తిక’’ విధానంగా కట్టుకట్టాలి అన్నాడు.
కీళ్ల ఎముకలు కిందకు తొలగటం, పైకి లేవటం, ప్రక్కకు తొలగటం వగైరా రకాలుగా తొలగిపోతాయి. వాటిని జాగ్రత్తగా యథాస్థానంలో అమర్చాలి అన్నాడు.
విరిగిన ఎముకలను- కర్కాటకము, అశ్వకరము, చూర్ణితము, పిచ్ఛితము, అస్తిచ్ఛల్లితము, కాండ భగ్నము, మజ్జానుగతము, అతి పాటితము, వక్రము, ఛిన్నము, పాటితము, స్ఫుటితము అని ఇలా పనె్నండు రకాలుగా వర్గీకరించి, వాటికి చికిత్సచేస్తే బాల్యంలో ఒక నెలలో అతుక్కుంటాయనీ, మధ్యవయస్సులో రెండు నెలలు పడుతుందనీ, ఆ తర్వాత మూడు నెలలనీ చెప్పాడు.
వేదాలలో వైజ్ఞానిక విశేషాలు
ఉత్తరార్ధము
మనం ఇప్పటివరకు వేదాధారితమైన విజ్ఞానశాఖలో కొన్నిటిని సంక్షిప్తంగా పరిచయం చేసుకున్నాం. అయితే మన మహర్షులు తమ విజ్ఞానాన్ని, వైజ్ఞానికాంశాల గ్రంథాలకూ, పరిశోధన శాలలకూ మాత్రమే పరిమితం చేయకుండా, సామాన్య మానవులు తమ నిత్య జీవితంలో ఆచరణలో అమలు పరచుకుని, వైజ్ఞానిక ప్రయోజనాలను పొందే ప్రక్రియల గురించి లోతుగా అధ్యయనంచేశారు. ఇందుకోసమే వారు అనేకరకాల ఆచారాలను, పండుగలను, క్రతువులను, ఉపాసనలను ఇంకా అనేక ప్రక్రియలను రూపొందించారు. అయితే కాలక్రమంలో విదేశీ సంస్కృతుల వెల్లువలో మన ఆచారాదులలోగల వైజ్ఞానికాంశాలు మరుగునపడి కేవలం సంప్రదాయాలు మాత్రమే కొంతవరకు మిగిలి ఉన్నాయి. అందువలన వీటికి మూఢ విశ్వాసాలు అనే అపప్రద ఏర్పడింది. కనుక మన సాంప్రదాయిక అనుష్ఠానాదులలో వైజ్ఞానిక అంశాలు సమ్మిళితమై ఉండటమేకాక, ప్రధాన ప్రాతిపదికలుగా ఎలా నిలబడి ఉన్నాయో సంగ్రహంగానైనా అధ్యయనం చేయవలసి ఉన్నది. ఇక ఈ ఉత్తరార్థంలో మనం పరిశీలనను ప్రారంభిద్దాం.
1. పురాణ గాథలు- సంకేతార్థాలు
మన పురాణాలలో చెప్పిన కథలు నిజంగా జరిగినవా లేక కేవలం సంకేత రూపమైన కథలా?
కొందరు ప్రతి పురాణ కథకూ ఏవేవో అంతారార్థాలూ, సంకేతాలూ చెప్పి సమన్వయాలు చూపిస్తూ వుంటారు. ఇలాటి సంకేతార్థాలు బాగా విన్నప్పుడు మన పురాణ కథలు కల్పిత కథలే అనీ, ‘్గ్ఘ్ఘౄ ఘశజూ జఒ్దశ్ఘ శళ్పళూ ళనజఒఆళజూ’’= అనీ, కొంతమందికి అనిపిస్తుంది. అందువల్ల పురాణ కథలకు అంతరార్థాలే చెప్పగూడదని కొంతమంది గట్టిగా వాదిస్తుంటారు. ఈ రెండురకాల వారూ మరిచిపోతున్న ప్రధాన విషయం ఒకటుంది.! ఇంగ్లీషులో ‘‘ఒ ఘఇ్య్పళ ఒ్య ఇళ్యతీ’’ అనే సామెత వుంది. ఇది భారతీయ సిద్ధాంతానికి అనుకూలమే!. భారతీయ సిద్ధాంతం ప్రకారం భూలోకంలోని సంఘటనలన్నీ ఖగోళంలో గ్రహసంచారాల ప్రభావాలవల్ల ఏర్పడతాయి.
గ్రహగోళాలు మట్టిముద్దలో, రాతి ముక్కలో కావు. వాటికి అధిష్ఠాన దేవతలు వుంటారు. వారు నివసించే లోకం వేరుగా వుంటుంది- ఇల్లువేరు, ఆఫీసు వేరు- అన్నట్లు! ఆ దేవతాలోకాల్లో సంఘటనలు, వారి వెనుకటి జన్మల పుణ్యపాపాల మీద ఆధారపడి వుంటాయి. ఆ సంఘటనలవల్ల గ్రహగోళ గతులు మారుతూ వుంటాయి. ఆ గతులు భూమిమీద ప్రభావం చూపిస్తూ వుంటాయి.
అందుచేత సృష్టియొక్క పరిస్థితి ఏమిటంటే- మానవ లోకమూ, గ్రహ లోకమూ, దేవతాలోకమూ- అనేవి మూడూ ఒకదానికొకటి ప్రతి బింబరూపంగా గిరగిరా తిరుగుతూ వుండే ప్రతిబింబ చక్రాలు. ఇది కొంచెం సంక్లిష్టమైన సృష్టిరహస్యం!
గత కల్పంలో కొందరు జీవులు ఉత్తమ సాధన చేసి దేవలోకాలకు వెళ్లారు. ఆ విధంగా ఇప్పటి దేవలోకం ఒకప్పటి మానవ లోకానికి ప్రతిబింబం! ఇప్పటి దేవతలు గ్రహగోళాలకు అధిపతులై వాటిని నియంత్రిస్తున్నారు. ఆ విధంగా గ్రహగోళ లోకం, దేవతా లోకానికి ప్రతిబింబం!
గ్రహగోళ గతులు మానవ జీవితాలను కొంతమేరకు నియంత్రణ చేస్తున్నాయి. మిగిలినమేర వారివారి మనశ్శక్తి మీద (విల్ పవర్ మీద) ఆధారపడి వుంటుంది.

--ఇంకావుంది...

--కుప్పా వేంకట కృష్ణమూర్తి