డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదాహరణకు- చెర్నోబిల్ అణువిస్ఫోట దుర్ఘటన తరువాత కొంతమంది శాస్తవ్రేత్తలు యుగోస్లేవియాలో హోమ ప్రభావాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించి, హోమ పరిసర ప్రాంతాలలో రేడియో ధార్మిక వికిరణ ప్రభావం తగ్గిందని నిర్ధారించారు. అలాగే భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ రసాయనిక ఫ్యాక్టరీ గాస్ లీకేజ్ జరిగినప్పుడు కూడా హోమంవల్ల రక్షణ జరిగింది.
డి) సోవియట్ యూనియన్‌లో ప్రజలు వారి గుడిసెలను ఆవుపేడతో సీల్ చేయడం వలన రేడియో ధార్మిక వికిరణాన్ని తగ్గించుకోగలిగారు.
ఇ) నాసావారు ఆవుపేడను పలుచని పొరగా స్పేస్ క్యాప్సుల్స్‌పై పూతగా పూయడం వలన రేడియో ధార్మిక వికిరణ ప్రభావం వాటిపై లేకుండా చేశారు.
ఆవు నెయ్యి
నెయ్యికి విషతుల్యమైన చెడు కలిగించే పదార్థాలను తొలగించు స్వభావం వుంది.
నెయ్యి (హుతం) దహనమయ్యే ప్రక్రియలో మొక్కల పెరుగుదలకు అవసరమైన రసాయనాలే కాకుండా, విష పదార్థాలను కరిగించుకొనే రసాయన సమ్మేళనాలు విడుదలవుతాయి.
హోమ ప్రభావమువలన మొక్కలలో ఉండే స్థూపాకార నాళికల సరాసరి వ్యాసం పెరుగుతుంది. దానివలన మొక్కలకు కావలసిన పోషక పదార్థాలు త్వరగా అన్ని భాగాలకు చేరి పెరుగుదలను వృద్ధిచేస్తాయి.
హోమ ప్రభావము వలన కిరణజన్య సంయోగక్రియ వృద్ధి చెంది, దానివలన ఆక్సిజన్ సైకిల్ కూడా వృద్ధిఅగును. హోమ ధూమము పత్రహరిత ఉత్పత్తికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.
ఈ ప్రక్రియను న్గిజని ఫొటోగ్రఫీ ద్వారా నిరూపించవచ్చు.
వరి మొక్కలపై హోమ ప్రభావము:
హోమ ప్రభావాన్ని వరి మొలకెత్తడంలో ప్రయోగాత్మకంగా పరిశీలించి నిర్ధారించారు. వరి విత్తనాలను నాలుగు గదులలో (KIRLIAN )లో ఉంచారు.
1) ఒక గదిని సామాన్య పరిస్థితులలో ఉంచారు.
2) రెండవ గదిలో సూర్యోదయ, సూర్యాస్తమయాలలో మంత్రోచ్ఛారణ జరిపారు.
3) మూడవ గదిలో సూర్యోదయ, సూర్యాస్తమయాలలో మంత్రోచ్ఛారణ జరిపారు.
4) సూర్యోదయ, సూర్యాస్తమయాలలో నాలుగవ గదిలో సాంప్రదాయిక మంత్రసహిత అగ్నిహోత్రాన్ని జరిపారు. మూడు కాలాలలో (వేసవి, వర్ష, చలి) 15రోజులపాటు ప్రయోగాన్ని జరిపారు.
కాండం పెరుగుదల, వేరు పెరుగుదలను మరియు వాటి ఫ్రెష్‌డ్రై భారాలను కొలిచారు.
పరిశీలనల తరువాత వేరు పెరుగుదలలోను మొక్క పెరుగుదలలోను, వాటి ఫ్రెష్ వెయిట్‌లోను నాలుగవ గదిలోని వరి విత్తనాలు మిగతా 3 గదులలో వాటికన్నా ఎక్కువగా వచ్చాయి.
From: Vivekananda Yoga Research Foundation, Bangalore.

త్రేతాగ్నులు:
సనాతన కాలంలో అగ్నిహోత్ర విధులన్నింటిలో మూలమైన విధానం పేరు ‘‘త్రేతాగ్నులు’’.
‘‘త్రేతాగ్నులు’’అనేది మూడు అగ్నికుండాల సమష్టి వ్యవస్థ. వాటి ఆకారం ఈ విధంగా వుంటుంది.
గార్హపత్యం: అనేది వర్తులాకార అగ్నికుండం. ఆహవనీయం అనేది సమ చతురస్ర అగ్నికుండం. దక్షిణాగ్ని అర్ధవృత్త అగ్నికుండం- ఈ మూడిటా వైశాల్యాలూ సమంగా వుండాలని శాస్త్ర నిర్ణయం. ఈ నిర్మాణం సాధ్యంకావాలంటే, రేఖాగణిత విజ్ఞానం విస్తారంగా వుండాలి. ఈ విజ్ఞానం మనకు సమృద్ధిగా వుండేది. ఇలాంటి విషయాలను బోధించే గ్రంథాలను ‘‘శుల్బసూత్రా’’లంటారు. వాటిలో ఏమివుందో రేఖామాత్రంగా తెలుసుకుందాం.
పైథాగరస్ థీరం
ఆపస్తంబ శుల్బ సూత్రం అనే గ్రంథం వుంది. దీన్ని ఎంత క్రిందకు గుంజినా, 3000 (బిసి)కి తగ్గదు. పైథాగరస్ 580 (బిసి) వాడు.
శుల్బం= దారం,
దారం, స్కేల్, కేవలం వీటితో జామెట్రిని చెప్పే శాస్త్రం పేరు శుల్బ సూత్రం. ఒకచోట లంబకోణ త్రిభుజాకార అగ్నికుండ నిర్మాణం చెప్పవలసి వచ్చింది. కోణం లంబకోణమని నిర్ణయించడమెలా? దానికి ఆపస్తంబుడు చెప్పిన ఉపాయమిది.
12 అంగుళాల పొడవున్న దారం తీసుకో- దానిమీద- 3 అంగుళం వద్ద ఒక గీటు పెట్టు- మళ్లీ 4 అంగుళం వద్ద గీటు పెట్టు. దారం మొదట ఒక మేకుకు కట్టు. మొదటి మార్కుదాకా గట్టిగా లాగి- అక్కడ మేకు పాతు. రెండో మార్కు దగ్గర పట్టుకుని ఆ దారాన్ని బిగుతుగా వచ్చేట్లు గుంజు. అక్కడ మేకు పాతు. నీకు లంబత్రిభుజం వస్తుంది- అన్నాడు. ఇంకావుంది...

‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.

ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర.
0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి