డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీసపాటి వెంకట గోపాలకృష్ణమూర్తిగారు డూజష్ద్ఘర్ఘీ జశళ్ఘూ ఘఔఔ్యనజ్ఘౄఆజ్యశ ఆ్య శ్యశజశళ్ఘూ గళ్ఘజఆక అనే గ్రంథం వ్రాశారు.
పై రేషియో:
పై విలువను- ఆర్యభటుడు (11వ శతాబ్ది) 3.1416024గా చెప్పాడు. చైనావారు- 3.1415926 అన్నారు.
గుంటూరుకు చెందిన శ్రీ వి.వి.రావుగారు శ్రీ చక్రదర్శనం అనే గ్రంథంలో, శ్రీ విద్యాసూత్రాల నుంచి పై విలువను సాధించి చూపించారు.
హైదరాబాదుకు చెందిన డా.జి.ఎస్.మూర్తిగారు డూజ ళ్ద్ఘర్ఘీౄ నిఆఒ దిళ్యౄళఆక ఘశజూ ళఆ్ఘఔ్దకఒజషఒ అనే గ్రంథంలో శ్రీచక్రంలో గల రేఖా గణితానికి, దేవతా తత్త్వాలకూ గల సంబంధాలను వైజ్ఞానికంగా నిరూపించారు.
శ్రీ చక్రంలో వున్న దేవత యొక్క ఆకారం:
ప్రొఫెసర్ పీసపాటి వెంకట గోపాలకృష్ణమూర్తిగారు శ్రీ చక్రంలో గల రేఖలకు ఎనర్జీ వాల్యూస్ ఇచ్చి కంప్యూటర్‌కి ఫీడ్ చేయగా శ్రీచక్రంలోని నవావరణాలకూ రూపాలు మారుతూ వచ్చి, చివరికి మొత్తం శ్రీ చక్రం యొక్క ఆకారం వచ్చింది.
ఈ ఆకారాన్నిబట్టి ఈ చక్రంలో ఆరాధింపబడే దేవత యొక్క రూపాన్ని మహర్షులు ఎలా దర్శించారో తెలుసుకొని ఆనందిద్దాం-
శ్లో॥ అరుణాం కరుణాతరంగితాక్షీం
ధృత పాశాంకుశ పుష్పబాణ చాపామ్‌
అణిమాదిభిరావృత్తతం మయూఖైః
అహమిత్యేవ విభావయే భవానీమ్‌॥
(ఆ దేవి లేత ఎరుపు రంగులో ఉన్నది. ఆమె కనులలో నుంచి కరుణ తరంగాల వలె వ్రవహిస్తోంది. ఆమె తన నాలుగు చేతులతో పాశము, అంకుశము, పుష్ప బాణము, ధనుస్సు అనే వాటిని ధరించి వుంది. అణిమాది శక్తులు ఆమె చుట్టూ కిరణాలై ఆవరించి వున్నాయి. అట్టి ఆ దేవిని నేనే అని భావన చేస్తున్నారు.)
శ్రీచక్రం- పిరమిడ్:
పిరమిడ్ నిర్మాణంలో అనేక విచిత్ర శక్తులున్నాయని ఈనాడు చాలామందికి తెలుసు. మినీ పిర

మిడ్స్‌తో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈజిప్టులోని గిజా అనే ప్రాంతంలో గ్రేట్ పిరమిడ్ వుంది. పిరమిడ్ అంటే-
-క్ఘూ= అగ్ని= శక్తి; జజూ= మధ్య= గరిమనాభి స్థానం. ఇది ళ్యఒౄజష ళశళూక ని ఆకర్షింఛి తన గర్భంలో నిలబెట్టుకుంటుంది. కనుక దీనికీ పేరు పెట్టారు. పిరమిడ్ అనేది సమత్రికోణ త్రిభుజం. దీని శీర్షకోణం 76 డిగ్రీల 16 ని.లు. దీని భూ కోణాలు 52 డిగ్రీల 52 ని.లు. శ్రీచక్రంలో చిన్న త్రిభుజాలను వదిలేసి, ప్రధానమైన 4 శివ త్రిభుజాలను, 5 శక్తి త్రిభుజాలను, పరిశీలిస్తే వాటి శీర్షకోణం - 76 డిగ్రీ., భూకోణం 52 డిగ్రీ॥ వుంటాయని శ్రీ శివల సుబ్రహ్మణ్యంగారుల చెబుతున్నారు. ఇలా డిగ్రీల పరంగా పిరమిడ్‌కీ, శ్రీచక్రానికీ సామ్యం వుంది. ఇది గాక శ్రీ చక్రంలో ఇంకా ఎన్నో విశేషాలున్నాయి. కనుక - ఇది కాస్మిక్ ఎనర్జీని పూర్తిగా ఆకర్షింపగలదని గ్రహిద్దాం.
***
శ్రీ చక్ర ప్రసక్తి వచ్చింది గనుక, అర్చనలోని వైజ్ఞానిక అంతరార్థాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం.
సందేహం: పూజ ఎందుకు చేయాలి?
ప్రయోగశాలలో ప్రయోగాలు చేసే వైజ్ఞానికుడు అనేక రసాయనాలను మిశ్రమం చేస్తూ వుంటాడు. దూరంనుంచి చూసేవాడికి అది పిల్లలాటలాగ కనిపించవచ్చు. వినోదం లాగ అనిపించవచ్చు. కాని వైజ్ఞానికుడు ఇష్టం వచ్చినట్లుగా రసాయనాలను మేళనం చేయటం లేదు. అతని మనస్సులో సూత్రాలు వున్నాయి. సిద్ధాంతాలు వున్నాయి. వాటి ఆధారంగా అతడు ప్రయోగాలు చేస్తూ వున్నాడు. అలాగే మనస్సనే ప్రయోగశాలలో; ఏకాగ్రతనే ఫలితం రావటంకోసం అనేక రకాల ప్రయోగాలు చేయవలసి వుంటుంది. కొన్ని ప్రయోగాలలో ఫలితాలు త్వరితంగా వస్తాయి. మరికొన్ని ప్రక్రియా ప్రయోగాలలో ఫలితాలు కొంచెం ఆలస్యమైనా స్థిరంగా వుంటాయి. ఇలాంటి ప్రయోగమే ‘పూజ’.
మనస్సు నిలవాలి. ఇది కోరిక. చాలామందికి వుంటుంది. కాని ఇది చాలా మందికి తీరదు. ఎందువల్ల? కారణాలు అనేకమున్నాయి. ఫలితాంశం మాత్రం ఏకాగ్రత కుదరదు. విద్యార్థులకు, వ్యాపారులకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, అందరకు యిదే సమస్య. ఏకాగ్రత లేనిదే ఏ రంగంలోనూ, ఏ విజయమూ లభించదు. ఇది అందరికీ తెలుసు. ఏకాగ్రతను సాధించటానికి ముఖ్యమైనది క్రమశిక్షణ. ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రలేవండి. ఇలా మీ పనులన్నీ సమయం తప్పకుండా, వరుస తప్పకుండా 40 రోజులు పాటించి చూడండి. మీ ఏకాగ్రత పెరుగుతోందో లేదో నాకు చెప్పండి!
ఇంకావుంది...

‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.

ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర.
0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి