డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంటే అత్యాధునికమైన హాకింగ్ సిద్ధాంతం ప్రకారం సృష్టి, సృష్టి వెనుక లయం, దాని వెనుక సృష్టి రుూ చక్రం నిరంతరంగా సాగుతూనే వుంటుందన్నమాట. ఇదే గదా! మన పురాణాలు చెప్పింది. మరో చిత్రమేమంటే హాకింగ్‌గారి సిద్ధాంతం ఋగ్వేదములోని నాసదీయ సూక్తంలో చేసిన ప్రళయ వర్ణనలను దాదాపు పోలివున్నది.
నటరాజు: ఈ విధంగా చూసినప్పుడు సృష్టిలోని ఖాళీ ప్రదేశం అంటూ లేదు. మొత్తం అంతా శక్తిపూర్ణమే. అందుకనే అమెరికా వైజ్ఞానికుడు జాన్‌ఎఫ్ వీలర్, ‘‘మనం శూన్యప్రదేశం అనుకున్నదంతా అత్యంత భయంకరమైన భౌతికశాస్త్రానికి నిలయం’’అన్నాడు. నిజమే మరి. ప్రపంచంలో ప్రతి మూల, ప్రతి అణువులోనూ, నిరంతరమైన మార్పు జరుగుతోంది. చైతన్యం స్పందిస్తోంది. నర్తిస్తోంది. ఫ్రిట్జ్‌ఆఫ్ కాప్ర అనే వైజ్ఞానికుడు, ‘‘పురాణాలు వర్ణించిన నటరాజ నృత్యం యిదే’’అన్నాడు. ఆయన చేసిన సంకేత వర్ణన అద్భుతంగా వున్నది. నటరాజు కుడి చేతిలో డమరుకం వున్నది. ఇది నూతన అణువుల సృష్టికి సంకేతం. ఆయన ఎడమ చేతిలో అగ్నిశిఖ వున్నది. ఇది పాత అణువుల ప్రళయానికి సంకేతం. మరొక కుడి చేతిలో ఆయన మనకు అభయముద్ర చూపిస్తున్నాడు. మరొక ఎడమ చేతిలో వరముద్ర అనే నెపంతో తన పాదాల నాశ్రయింపమని సూచిస్తున్నాడు. ఇది ఫ్రిట్జ్ చేసిన వర్ణన. ఆయన వ్రాసిన ‘‘ది టావో ఆఫ్ ఫిజిక్స్’’అనే పుస్తకంయొక్క మొదటి ముద్రణకు ముఖ చిత్రంగా ఆయన నటరాజ శివుడినే స్వీకరించాడు. ఈ గ్రంథం ప్రపంచంలో కోటి ఇరవై లక్షల ప్రతులు అమ్ముడుపోయిందట. మన పురాణాలలోని వర్ణనలు పాశ్చాత్య శాస్తజ్ఞ్రులకు నూతన కిటుకులను అందిస్తూ వుంటే మనం వాటిని పుక్కిటి పురాణాలుగా కొట్టివేస్తున్నాం. ఏమి తెలివి?
చైతన్య స్వరూపం: చైతన్యమూ, భౌతిక పదార్థామూ ముడిపడి వున్నాయని మనం చాలా చర్చించుకున్నాం. అయితే ఈ చైతన్యంయొక్క స్వరూపం ఏమిటి? దాని యొక్క స్థానం ఏమిటి? అన్నవి చర్చించుకుంటేగాని మన చర్చ పరిసమాప్తం కాదు.
చైతన్యవంతులంతా పనులు చేస్తున్నారు. ఈ పనులు ఎలా జరుగుతున్నాయి? ఆయా జీవులయొక్క సంకల్పంవల్ల, బుద్ధివల్ల పనులు జరుగుతున్నాయని, వైజ్ఞానికులంతా అంగీకరిస్తున్నారు. సంకల్పంవల్లా, బుద్ధివల్లా పనులు జరిగేటట్లైతే మీరు గాఢంగా నిద్రిస్తున్నప్పుడు- అంటే కలలు లేని గాఢ సుషుప్తిలో వున్నప్పుడు మీ రక్తనాళాలలో, నెత్తురును పరుగులు దీయిస్తున్నదెవరు? వేల వేల నరాలను నడిపిస్తున్నదెవరు?
ష్రోడింగర్ పరిశోధించి, చివరకు ఉపనిషత్తులే తనకు పరిష్కారం చూపించాయని ప్రకటించాడు. ఒకే అవిభాజ్యకమైన విశ్వవ్యాప్తి చైతన్యం ఈ ప్రపంచంలోని అన్ని వస్తువులలోనూ, అన్ని జీవులలోనూ పనిచేస్తూ ఉన్నదని ఉపనిషత్తుల ఆధారంగా ఆయన నిర్ణయించాడు. అంతేగాకుండా ప్రస్తుతం అధునాతన విజ్ఞాన శాస్త్రంలో వున్న సమస్యలకు జీవాత్మ= పరబ్రహ్మ అన్న ఈక్వేషన్ పరిష్కారమని, ష్రోడింగర్ సైన్సు పరిశోధనల ఆధారంగా అంగీకరించాడు కూడా.
పెద్ద చింత చెట్టు వుందనుకోండి. దానిలోని ప్రతి ఆకుకి జీవమూ, చైతన్యమూ వున్నాయనీ, ప్రతి ఆకూ బయటినుంచి వచ్చే ప్రచోదనలకు ప్రతిస్పందిస్తుందని సర్ జె.సి.బోస్ నిరూపించాడు. అలాగని ఆ చెట్టులో వేలవేల విభిన్న చైతన్యాలున్నాయని చెబుదామా? లేక చెట్టు మొత్తం వ్యాపించివున్న అఖండ చైతన్యం ఆయా ఆకుల ద్వారా వ్యక్తమవుతోందని అందామా? ఏది బాగుంటుంది? మీరే ఆలోచించండి. వైజ్ఞానికుడు ష్రోడింగర్ మాత్రం ‘‘సంఖ్యాపరంగా చైతన్యం ఒకటే. చైతన్యంలో కనిపిస్తున్న బహుత్వం మాయ’’ అని ప్రకటించాడు.
చైతన్యం ఎక్కడ వుంది?:
మానవ శరీరంలో చైతన్యానికి స్థానం ఏది? అనే ప్రశ్న న్యూరో ఫిజియోలాజిష్టులను ఎంతోకాలంగా వేధిస్తున్నది. ఈ ప్రశ్నపై 20 సంవత్సరాలు పరిశోధన చేసిన ‘‘వైల్‌డర్ పెన్‌ఫీల్డ్’’ చైతన్యమనేది మానవ మస్తిష్కంలో వుండే పదార్థంకాదని నిర్ణయించాడు. ఆయన మనస్సు, మస్తిష్కము ఒకటి అనుకోవడం పొరపాటని కూడా నిరూపించాడు. నోబుల్ బహుమతి విజేత అయిన జంతు శాస్తవ్రేత్త జార్జివాల్డ్ పై సిద్ధాంతాలను పూర్తిగా బలపరచడమే కాకుండా, ప్రాచ్య వేదాంతమే తనకు మార్గం చూపించిందనీ చైతన్యం మానవ మస్తిష్కంలోకాక సర్వత్రా వ్యాపించి వుండటమే సత్యమని ప్రకటించాడు. న్యూరోబయాలజిష్టు జాన్‌యస్‌సెల్స్ పై మార్గాననే యింకా పరిశోధనలుచేసి, చైతన్యం మానవ మస్తిష్కానికి అతీతమైన అంశంగావుంటూ మానవ మస్తిష్కం ద్వారా పనిచేస్తూ వుంటుందనీ నిరూపించాడు.
చైతన్యం విశ్వవ్యాప్తి అని, చీమ దగ్గరనుంచి బ్రహ్మవరకూ అందరి జీవులలోనూ ఒకే చైతన్యం వ్యాపించి వుందని చెబుతున్న ఉపనిషత్ సిద్ధాంతానికి యింతకన్నా యెక్కువ వైజ్ఞానిక నిరూపణ కావాలా మనకు?
ముగింపు: సత్యాన్ని విభిన్న మార్గాలలో అనే్వషణ చేసిన విజ్ఞాన శాస్తమ్రూ, వేదాంత శాస్తమ్రూ పర్యవసానంలో ఎలా ఏకీభవిస్తూ వచ్చాయో మనం రుూ వ్యాసంలో అడుగడుగునా గమనించుకుంటూ వచ్చాము. ఇప్పటికి వందేళ్ళకు వెనుక విజ్ఞానశాస్త్రం యిలాంటి సత్యాల గురించి కలలైనా కనుక ముందు శ్రీ వివేకానందస్వామి సైన్సు రుూ దశలోనే పురోగమిస్తుందని జోస్యం చెప్పారు.
‘ప్రాచీన మహర్షులు తమ అంతరాత్మల లోనికి తవ్వుకుంటూ పోయిపోయి ఏ సత్యాలను దర్శించారో అవే సత్యాలను ఈనాటి భౌతిక శాస్తవ్రేత్తలు తమ బహిరంగ ప్రపంచాన్ని త్రవ్వుకుంటూ పోయిపోయి అందుకుంటారు’’అని శ్రీ వివేకానందులు ఆనాడే ప్రవచించారు. అది సత్యమని, సత్యానే్వషణ చిత్తశుద్ధితో చేస్తే ఎవరినైనాసరే ఒకే గమ్యానికి తీసుకువెళుతుందని రుూనాటి భౌతిక విజ్ఞానశాస్త్రం మనకు నిరూపిస్తోంది. ****
--ఇంకావుంది...

--కుప్పా వేంకట కృష్ణమూర్తి