డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ తల్లి నాగమాత కద్రువ సర్పాలకు ఇచ్చిన శాపం గురించి తెలిపింది. వారిని కాపాడుమని ఆదేశించింది.
ఆస్తీకుడు అలాగే చేస్తానని తల్లికి చెప్పి వాసుకితో ఇలా అన్నాడు. ‘‘నాగరాజా! మీరు నిశ్చింతగా ఉండండి. భయం వలదు. జనమేజయుని దగ్గరకు వెళ్ళి మంచి మాటలతో అతన్ని సంతోషపెట్టి యజ్ఞాన్ని నివారిస్తాను’’. ఈ విధంగా అతను వాసుకి మొదలైన నాగశ్రేష్ఠుల భయాన్ని పోగొట్టి జనమేజయుని యజ్ఞశాలకు వెళ్లాడు.
అక్కడ అతను అనేకవిధాలుగా జనమేజయుని స్తుతించాడు.
అతని వాక్కులు విన్న రాజు యాగశాలలోని తక్కినవారితో ఇలా అన్నాడు. ‘‘ఓ విప్రులారా! ఇతను బాలకుడు అయినా పెద్దవారి లాగా మాట్లాడుతున్నాడు. కనుక ఇతడు వృద్ధుడే అని భావిస్తున్నాను. ఇతనికి వరం ఇవ్వాలని అనుకుంటున్నాను. మీరు మీ అంగీకారాన్ని తెలుపండి’’. దానికి వారంతా ఇతడు బాలుడైనప్పటికీ జ్ఞానంలో పెద్దవాడే. కనుక మీ చేత సత్కరింపబడవచ్చు’’ అని ఏకకంఠంతో పలికారు.
అప్పుడు జనమేజయుడు ఆస్తీకుని వరం కోరుకొమ్మనగా అతడు అడిగేలోపల యజ్ఞం చేస్తున్న హోత ఇలా అన్నాడు ‘‘ఈ క్రతువులో మంత్రాలతో తక్షకుని పిలిచాము కాని అతను ఇంతవరకు ఇక్కడికి రాలేదు’’.
అప్పుడు జనమేజయుడు ఇలా ఆదేశించాడు.
‘‘ముందు తక్షకుని అగ్నిలో ఆహుతి చేయండి. అప్పుడే ఈ యాగం సమాప్తవౌతుంది. తక్షకుడే నాకు అసలు శత్రువు. అతని కోసమే ఈ యాగం చేస్తున్నది’’.
అప్పుడు ఋత్వికులు ఇలా అన్నాడు ‘‘ఈ మంత్రాలకు భయపడి తక్షకుడు ఇంద్రుని భవనంలో దాక్కున్నాడు’’.
సూతపుత్రుడు పురాణవేత్త అయిన లోహితాక్షుడు ‘‘ఈ యజ్ఞం సమాప్తి కాదు’’ అని అన్నాడు.
రాజు లోహితాక్షుని ఈ విషయం గురించి అడిగితే అతను బ్రాహ్మణులతో తాను చెప్పినది సత్యమేనని, ఇంద్రుడు తక్షకునికి రక్షణ కల్పించాడని’ తెలిపాడు.
ఇది విన్న రాజు కలవరపడ్డాడు. ఇంద్రునితో సహా తక్షకుడు అక్కడికి రప్పించడానికి మంత్రాలను చదువమని ఆజ్ఞాపించాడు. వారు ఆవిధంగా చేసి ఇంద్రునితో ఉన్న తక్షకుని సహేంద్రతక్షకాయ స్వాహా అని ఆహ్వానించారు. వెంటనే ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. అతని వెనుక తక్షకుడు కూడా వస్తూ ఉన్నాడు. అతను భయంతో ఇంద్రుని ఉత్తరీయంలో దాగుకొని వచ్చాడు. రాజు బ్రాహ్మణులతో ఇలా పలికాడు.
‘‘విప్రోత్తములారా! ఒకవేళ ఇంద్రుడు తక్షకునికి రక్షణ కల్పిస్తే, ఇంద్రునితో సహా తక్షకుని అగ్నిలో ఆహుతి ఇవ్వండి’’.
ఇది విన్న ఇంద్రుడు కలతచెంది తక్షకుని అక్కడే విడిచిపెట్టి వెనక్కి వెళ్లిపోయాడు. మంత్రాధీనుడైన తక్షకుడు వణికిపోతూ అక్కడికి వచ్చాడు. అప్పుడు రాజు యజ్ఞం ఫలించిందన్న ఆనందంతో వారికి దక్షిణ ఇవ్వదలచి ముందుగా ఆస్తీకుని పిలిచి ‘‘ఓ విప్రకుమారుడా! నీ పాండిత్యం అమోఘం. నీ మనస్సులోని కోరిక కోరుతో. అది ఏమైనా సరే తీరుస్తాను’’ అని అన్నాడు.
దానికి ఆస్తీకుడు ‘‘మహారాజా! నాకు మీరు వరం ఇవ్వదలచుకుంటే ఈ సర్పయాగాన్ని వెంటనే ఆపివేయండి. ఇక సర్పాలు అగ్నిలో పడకూడదు’’.
ఈ కోరిక విన్న రాజు విచారంతో ఆస్తీకునితో ఇలా అన్నాడు ‘‘విప్రుడా! ఈ వరం కాక ఇంకేదైనా కోరుకో. ఈ యజ్ఞాన్ని ఆపడానికి ఇష్టపడను’’.
దానికి ఆస్తీకుడు ‘‘నాకు బంగారంతో, ధనంతో పనిలేదు. ఈ సర్పయాగాన్ని ఆపివేయి. నీవు అలా చేస్తే నా మాతృవంశానికి శుభం కలుగును.’’
జనమేజయుడు ఆస్తీకునికి ఎన్నో విధాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. అతను ఒప్పుకోలేదు. తనకు ఆ వరమే కావాలని కోరాడు. అప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ రాజుతో ఆ విప్రబాలకుడు కోరిన వరాన్ని ఇవ్వమని ప్రార్థించారు.
జనమేజయుడు వారి మాటలు విని ఆస్తీకునికి ఇచ్చిన వరం ప్రకారం సర్పయాగాన్ని నిలిపి వేశాడు. సర్పముల ప్రాణరక్షణ పొందారు. రాజు ఆస్తీకుని తాను చేయబోయే అశ్వమేధ యాగానికి సదస్యునిగా ఆహ్వానించాడు. ఆస్తీకుడు సంతోషంతో యజ్ఞంలో పాల్గొనడానికి వస్తానని మాట ఇచ్చి ఇంటికి వెళ్ళి తల్లితో, మేనమామతో యజ్ఞసభలో జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పాడు.
యాగంలో రక్షింపబడిన నాగులందరు అతన్ని కలిసి ఇలా అన్నారు ‘‘నాయనా! నీవు గొప్ప విద్వాంపుడవు. మమ్మల్ని కష్టాల నుండి గట్టెంకించినావు. నీ కోరిక ఏదైనా తప్పక తీరుస్తాము’’.
ఇలా వారు పలుమార్లు కోరగా అతను వారితో ‘‘ఈ లోకంలో ఎవరైనా సరే నా ఈ కథ చదువుతారో వారికి మీ వలన ఎలాంటి భయము ఉండకూడదు. ఇదే నేను కోరేది’’.
దానికి వారు సంతోషంతో ‘‘నీ కోరిక తప్పక తీరుస్తాము. ఎవరైనా, ఏ సమయంలోనైనా జరత్కార ఋషివలన జరత్కారువు అనే నాగకన్యకు జన్మించిన ఆస్తికుని నేను స్మరిస్తున్నాను. ఓ నాగులారా! నన్ను హింసించకండి’’ అని అంటే ఏ సర్పం అయినా తొలగకపోతే దాని శిరస్సు నూరు ముక్కలు అవుతుంది’’ అని పలికారు.
ఈ విధంగా సర్పయాగంలో పన్నగాలను రక్షించి (సర్పయాగాన్ని ఆపించి) తన తల్లివైపు వారిని కాపాడాడు. అదేవిధంగా జరత్కారునికి పుత్రునిగా జన్మించి తండ్రివైపు పితరులకు ఉత్తమ లోకాలను కల్గించాడు. ఇలా మాతృపితృ వంశాలని ఉద్ధరించి తన ధర్మాన్ని నిర్వర్తించాడు. అతని కద ఆస్తీకోపాఖ్యానంగా ప్రసిద్ధి చెందినది. (ఇంకావుంది)