డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-51

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భయపడుతూ వస్తున్న ద్రౌపదిని చూసి కీచకుడు ఆనందంతో పొంగిపోయాడు. అతను ఆమె దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు. ‘‘స్వాగతం నీకు! నీ కోసం ఆభరణాలు అన్నీ సిద్ధం చేశాను. నా రాణివై సుఖపడు. దివ్యమైన శయ్యను అమర్చాను. దానిపై కూర్చుని మదిర ఆస్వాదించు’’.
ద్రౌపది ఇలా అంది. ‘‘నన్ను కోరి దుర్గతి పొందకు. రాణి సుధేష్ణ నన్ను మదిర తెమ్మని నీ ఇంటికి పంపింది. మదిర ఇస్తే వెళ్లిపోతాను’’.
కీచకుడు ‘‘మదిర వేరే దాసీలు తీసుకొనిపోతారు’’ ఇలా అని అతను ద్రౌపది చేయి పట్టుకున్నాడు.
ద్రౌపది చేయి విదిల్చుకొని కోపంతో ఇలా అంది. ‘‘పాపీ! నేను నా పతులకు విరుద్ధంగా మనసులోనైనా ప్రవర్తించని దానినైతే నీవు నశిస్తావు’’. ఇలా అని ఆమె అతణ్ణి త్రోసివేసింది.
కీచకుడు ఆమె కొంగు పట్టుకున్నాడు. ఆమెను తన వశం చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె అతన్ని గట్టిగా త్రోయగా అతడు క్రింద పడ్డాడు. ఆమె భయంతో పరుగెత్తి యుధిష్ఠిరుడు ఉన్న భవనంలోకి వెళ్లింది. కీచకుడు ఆమెను జుట్టు పట్టుకొని రాజు చూస్తుండగా ఆమెను తన్నాడు.
ఇంతలో ఆమె ప్రార్థన విని సూర్యభగవానుడు ఆమె రక్షణకు నియమించిన రాక్షసుడు అదృశ్యంగా కీచకుని పట్టుకొని దూరంగా విసరివేశాడు. అతను మొదలు నరికిన చెట్టులా క్రింద పడ్డాడు.
ఈ సంఘటనని సభలో ఉన్న రాజు, మంత్రులూ, బ్రాహ్మణులూ అందరూ చూస్తూనే ఉన్నారు. ద్రౌపది ముఖం నుంచి రక్తం కారుతున్నది. సభికులంతా ఆమెను ఆ స్థితిలో చూసి హాహాకారాలు చేశారు.
‘‘ఓరీ పాపాత్ముడా! ఆమెను ఎందుకు ఇలా బాధిస్తున్నావు?’’ అని అడిగారు. ఆ సమయంలో అక్కడ యుధిష్ఠిరుడు, భీముడు ఉన్నారు. వారు ద్రౌపదికి కీచకుడు చేసిన అవమానాన్ని కళ్లారా చూశారు. భీముడు ఆగ్రహంతో కీచకుని వధించాలని కోపంతో లేవబోయాడు. తమ రహస్యం వెల్లడి అయిపోతుందని ధర్మరాజు అతని చేతిని నొక్కి అతనిని శాంతపరిచాడు. భీముడు ఆగ్రహంతో ఒక చెట్టువైపు చూడడం చూసి యుధిష్ఠిరుడు అతన్ని ఇలా వారించాడు. ‘‘వలలా! వంట కట్టెల కోసం చెట్టువైపు చూస్తున్నావా? వంట కోసం ఎండుకట్టెలు కావాలి. ఈ చెట్టు పనికిరాదు. దీనిని ఆశ్రయించుకొని ఎన్నో పక్షులు దాక్కున్నాయి.’’
‘‘ఆశ్రయం ఇచ్చినవారికి హాని చేయకూడదు’’ అని అన్నగారి సంకేతం అర్థం చేసుకొని భీముడు ఏమీ చేయక ఊరుకున్నాడు. భీముని కోపాన్ని ధర్మరాజు శాంతపరచడంతో ద్రౌపదికి ఆగ్రహం దుఃఖం రెండూ కలిగి అవమానంతో ఏడ్చింది.
ఆమె రాజు దగ్గర దీనస్వరంతో ఇలా అంది. ‘‘రాజ్యంలోని ప్రజలందరినీ రక్షించాలనుకొని సత్య ధర్మాలను పాటించే రాజు ప్రజలకు తన కన్నబిడ్డలకు ఎలాంటి భేదం చూపడు. ధర్మాసనం మీద కూర్చునేరాజు వివాదాలు చెలరేగినపుడు అందరినీ సమభావంతో చూసి న్యాయం చెప్తాడు. మహారాజా! మీరు ధర్మాసనం మీద కూర్చుని ఉన్నారు. నేను ఏ తప్పు చేయకపోయినా కీచకుడు నన్ను బానిసను తన్నినట్లు తన్నాడు. ప్రజలను తన సంతానంలా పాలించే మీరు మోహంతో అధర్మకార్యం చేస్తున్న ఆ నీచుడిని శిక్షించండి. రాజులు తమ కర్తవ్యాన్ని సరిగా చేయకపోతే నరకానికి పోతారు’’.
ద్రౌపది విలపిస్తూ చెప్పినటప్పటికీ మత్స్యరాజు మదోన్మత్తుడైన కీచకుని ఏమీ చేయలేకపోయాడు. అది చూసి ఆమె మరల ఇలా అంది. ‘‘నా భర్తలు వైరం పూని ఐదు దేశాలు దాటి ఆరవదేశంలో ఉన్నా నేను ఎన్నడూ భయపడలేదు. అటువంటి వారికి భార్యను అయిన నన్ను ఈ రోజు ఈ సూతపుత్రుడు తన్ని అవమానించాడు. ఎవరి ధనుష్ఠంకారంతో లోకం గజగజలాడుతుందో వారి భార్యను నన్ను ఒక సూతపుత్రుడు కాలితో తన్నాడు. నా భర్తలు ఈ లోకాన్నంతటినీ భస్మం చేయగలరు. కాని వారు ధర్మానికి కట్టుబడినవారు. వారి భార్యను అయిన నన్ను ఒక సూతపుత్రుడు కాలితో తన్నాడు. బలవంతులు తేజస్వులు అయిన వారు తమ పత్నిని ఒక సూతపుత్రుడు తన్నుతూ ఉంటే నపుంసకులలాగా ఎలా సహించగలుగుతున్నారు? తన ఎదుటే ఒక అబలను హింసిస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్న ఈ రాజు కూడా ధర్మదూషకుడే. ఈ అధర్మం ఈ సభకు శోభనివ్వదు. ఈ కీచకునికి ధర్మజ్ఞానం లేదు. ఈ రాజుకు ఏ విధమైన ధర్మం తెలియదు. ఈ సభలో ఉన్నవారికి ధర్మజ్ఞానం లేదు’’.
అప్పుడు విరాటుడు ఇలా అన్నాడు. ‘‘సైరంధ్రీ! మా పరోక్షంలో మీ ఇద్దరి మధ్యా ఏం జరిగిందో నాకు తెలియదు. అది తెలియకుండా నేను న్యాయం ఎలా చేస్తాను?’’
తర్వాత సభికులంతా విషయం తెలిసికొని కీచకుని దూషించి సైరంధ్రిని ప్రశంసించారు.
సభికులంతా ఆమెను గురించి ఇలా అన్నారు. ‘‘ఈమె దేవకాంతలాగా ఉన్నది. సమస్త శుభలక్షణాలు కలిగి తాపసి వలె ఉన్న ఈమె కీచకుని చేత తన్నులు తినడానికి అర్హురాలు కాదు’’.
అప్పుడు ధర్మరాజు ద్రౌపదితో ఇలా అన్నాడు. ‘‘సైరంధ్రీ! ఇక ఇక్కడ నీవు ఉండకు. సుధేష్ణ భవనానికి వెళ్లిపో. వీరపత్నులు ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తారు. నీ పతుల కోపాన్ని రుచి చూడడానికి కీచకునికి ఇంకా సమయం రాలేదు. కనుక వారు నీ దగ్గరికి రావడం లేదు. సైరంధ్రీ! ఇంకా ధర్మసంబంధమైన మాటలు విను. వారికి యజ్ఞాలు లేవు. దీక్షలు లేవు. భర్తకు సేవ చేయడం వల్లనే వారికి స్వర్గప్రాప్తి ఉంటుంది. స్తన్రి బాల్యం నుండి తండ్రి, వనంలో భర్త, వార్ధక్యంలో పుత్రడు రక్షిస్తూ ఉంటారు. స్తక్రి ఎప్పుడూ స్వాతంత్య్రం ఉండకూడదు. ఎన్ని అవమానాలు కలిగినా స్తల్రు తమ భర్తలను దూషించరాదు. నీ పతులు కనుక కోపిస్తే ఇంద్రుడు కూడా వారిని ఎదిరించలేడు. క్షమయే ఉత్తమమైన ధర్మం. అదియే సత్యం. అదియే దానం. అదియే తపస్సు. దానివల్ల ఈ లోకం పరలోకం లభిస్తాయి’’.
ఇంతలాగ ధర్మరాజు బోధించినా ద్రౌపది అక్కడే నిలబడింది. అప్పుడు ధర్మరాజు మరల ఇలా అన్నాడు. ‘‘సైరంధ్రీ! నీవు సమయాన్ని గుర్తించడం లేదు. కనుకనే రాజసభలో నటిలాగ ఏడుస్తున్నావు. మహారాజు ద్యూతక్రీడకు భంగం కలిగిస్తున్నావు. వెళ్లు, నీ భర్తలైన గంధర్వులు నీకు ప్రీతిని కలిగిస్తారు. నీకు హానిని చేసిన వానిని చంపి నీ దుఃఖాన్ని దూరం చేస్తారు’’.
అప్పుడు ద్రౌపది ఆగ్రహంతో ఇలా అన్నది. ‘‘ఆ గంధర్వులలో పెద్దన్నగారు ఎప్పుడూ ద్యూతక్రీడలో మునిగి ఉంటాడు. నేను నా భర్తల పట్ల ఎప్పుడూ ధర్మప్రకారంగానే ప్రవర్తించాను. నన్ను అవమానించినవానిని వారిలో ఎవరైనా చంపవచ్చును’’ ఇలా అని ద్రౌపది సుధేష్ణ భవనానికి వెళ్లిపోయింది.
ద్రౌపది అలా ఏడుస్తూ వెళ్తున్నా పాండవులెవరూ నోరు విప్పలేదు. వారు అజ్ఞాతవాస సమయాన్ని అతిక్రమించలేదు.
ఆమెను చూసి సుధేష్ణ ఇలా అడిగింది. ‘‘సైరంధ్రీ! నినె్నవరు అవమానించారు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరి సుఖం ఈ రోజుతో ముగిసింది?’’
ద్రౌపది దీనంగా ఇలా అంది. ‘‘నీకు అంతా తెలిసి మళ్లీ ననె్నందుకు అడుగుతావు? నీవే స్వయంగా నీ తమ్ముడింటికి నన్ను పంపి ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతావు? నేను నీ కోసం మదిర తేవడానికి కీచకుని ఇంటికి వెళ్లాను. అతను నన్ను స్తన్రని కూడా చూడక రాజసభలో తన్నాడు. కామంతో ఉన్మత్తుడైన అతను చేసిన అవమానానికి నీవు అంగీకరిస్తే చంపిస్తాను. వాడు తప్పక యమలోకానికి పోతాడు’’.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి