డైలీ సీరియల్

షోడశరాజుల చరిత్ర 63

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

3.పౌరవుని వృత్తాంతము
పౌరవుడు పదిలక్షల తెల్ల గుర్రాలను దానం చేసినవాడు. అతను అశ్వమేదయాగం చేస్తూ ఉంటే దేశదేశాల నుండి ఎంతోమంద్రి విప్రులు వచ్చేవారు. వారిలో ఆయా దేశాల శిక్షా శాస్త్రాన్ని, ఆయా దేశ విప్రులని తెలిసిన వారుండేవారు. వేదవిద్యాధ్యయన విద్యలలో స్నాతకులయి, చక్కగా కన్పించే విద్వాంసు లకు ఆయన శ్రేష్ఠమైన ఆహారం, వస్త్రాలు, గృహాలను, శయ్యలను, ఆసనాలను సమకూర్చే వాడు. ఆ పౌరవరాజు చేసే ప్రతీ యజ్ఞంలోను సమయానికి, సందర్భానికి తగినట్లు దక్షిణలు ఇచ్చేవాడు. మత్త్భాలు, రథాలు, అశ్వాలు, కన్యలను, గోవులను దక్షిణగా ఇచ్చేవాడు. ఆయన చేసిన అన్ని యజ్ఞాలు స్వధర్మానుసారం జరిగేవి. అవి సర్వకామసిద్ధిప్రదాలు. అంతటి గొప్పదాత పౌరవుడు.
4. మాంధాత చరిత్ర
మాంధాత యవనాశ్వుని పుత్రుడు. ఆ రాజు అసురులు, మానవులు, దేవతలు కల ముల్లోకాలను జయించాడు. పూర్వం అశ్వనీ దేవతలు అతన్ని పితృగర్భం నుండి తీశారు. పూర్వకాలంలో యవనాశ్వ మహారాజు వేటకు వెళ్లగా ఆయనకు దాహం వేసింది. ఆయన గుర్రం కూడా అలసిపోయింది. అతనికి ఒక చోట పొగ కన్పించింది. అతను అక్కడికి వెళ్లగా అక్కడ ఒక పాత్రలో నేతితో కలిపిన జలం కనిపించింది. అతను మంత్రపూరితమైన ఆ జలాన్ని త్రాగాడు.
ఆ జలం యవనాశ్వని కడుపులో శిశువుగా మారటం చూసి దేవవైద్యులైన అశ్వనీదేవతలు రాజు గర్భం నుంచి ఆ బాలుని పైకి తీశారు. ఆ బాలుని చూసి దేవతలు ‘‘ఈ బాలునికి ఎవరు పాలు ఇస్తారు?’’ అని అడిగారు.
‘‘ఇతడు మొదట నా దగ్గర పాలు త్రాగుతాడు’’ అని ఇంద్రుడు అన్నాడు. అపుడు అతని చేతి వ్రేళ్లనుండి అమృతమైన క్షీరం వచ్చింది. దయతో ఇంద్రుడు ‘‘నా వద్ద పాలు తాగుతాడని’’ చెప్పడంతో ఆ బాలునికి మాంధాత అన్న పేరు వచ్చింది. ఇంద్రుని చేతి నుండి ప్రవహించే క్షీరధారలు త్రాగి అతను దినదినమూ పెరుగ సాగాడు. పనె్నండు రోజుల్లో పనె్నండేండ్ల బాలుడయ్యాడు. తరువాత ఆ మాంధాత ఈ భూమండలం అంతా ఒక్క రోజులో జయించాడు.
మాంధాత ధర్మాత్ముడు, ధీరుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు. సూర్యుడు ఉదయించే చోట నుంచీ అస్తమించే చోటు వరకు ఉండే సమస్త భూమిని మాంధాత క్షేత్రం అంటారు.
మాంధాత నూరు అశ్వమేథాలను, నూరు రాజసూయయాగాలను చేశాడు. నూరు యోజనాలు కల భూమిని బంగారు గనులతో కలిపి బ్రాహ్మణులకు దానమిచ్చాడు. ఆయన వండించిన అన్న పర్వతాలను ఎంతో మంది బ్రాహ్మణులు భుజించారు. ఆ అన్నపర్వతాలచుట్టూ తేనె, పాల నదులూ ఉన్నాయి. వాటికి నాలుగువైపులా నేతి సరస్సులు, పప్పుబావులు ఉన్నాయి. అక్కడ నదులలో నీటికి బదులు బెల్లం పానకం, నురుగుకు బదులు పెరుగు ప్రవహించాయి. అతను చేసే యజ్ఞాలకు దేవతలు, అసురులు, ఉరగులు, యక్షులు అందరూ వచ్చేవారు. మాంధాత సర్వసంపదలతో సముద్రమే హద్దుగా గల భూమిని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. అతను ఇన్ని దానాలు చేసి సూర్యుని లాగ అస్తమించాడు.
5. రంతిదేవుని చరిత్ర
సంకృతి కుమారుడు రంతిదేవుడు. దానగుణానికి ప్రసిద్ధి చెందాడు. అతని వంటశాలలో రెండు లక్షల మంది వంటవాళ్లు ఎప్పుడూ ఉండేవారు. వారు రేయింబవళ్లు ఇంటికి వచ్చిన అతిథులకు భోజనం వండి వడ్డించేవారు. రాజు న్యాయంగా ధనం సంపాదించి బ్రాహ్మణులకు దానం చేసేవాడు. అతను వేదాధ్యయనం చేశాడు. రాజధర్మం ప్రకారం శత్రువులను వశం చేసుకున్నాడు. అతను నిత్యం బంగారు నాణాలను బ్రాహ్మణులకు ఇచ్చేవాడు. ఒక వేయి బంగారు వృషభాలు, ఒక్కో వృషభం వెంట నూరు గోవులను నూట ఎనిమిది బంగారు నాణాలు గల ధనాన్ని నిష్కం అంటారు. రంతిదేవుడు ప్రతి దినం కోట్లకొలది నిష్కాలను ఇచ్చేవాడు. వాటితోపాటు అగ్నిహోత్ర సాధనాలు, మహర్షులకు కమండలాలు, కడవలు, పాత్రలు, గృహాలు ఇచ్చాడు.
లోకులు రంతిదేవుని ధనాగారం లాంటిది ఇంకొకటి లేదనేవారు. అతని ఇంట్లో ఒకరోజు ఉన్న అతిథికి ఇరవై ఒక్క వేల గోవులు లభించేవి. అతని వంటవారు పెద్దగా కేకలు పెడ్తూ ఇలా చెప్పేవారు. ‘‘మీరంతా కడుపునిండా పప్పు పెరుగుతో కూడిన వంటకాలను భోజనం చేయండి’’. ప్రతీరోజు రంతిదేవుడు సకాలంలో ఇచ్చే హవిస్సులు దేవతలు, కవ్యాలను పితృదేవతలు, బ్రాహ్మణులు కోరిన ఆహారాన్ని గ్రహించేవారు. స్వయంగా యమధర్మరాజే మారురూపంతో వచ్చి అతని దానగుణాన్ని స్వయంగా పరీక్షించి సంతృప్తి చెంది అతన్ని ప్రశంసించాడు. ఇదీ రంతిదేవుని గొప్పతనం.
6. పృథు చరిత్ర
పృథుడు వేనుడి కుమారుడు. అతని కంటె ముందు ఇద్దరు పుట్టారు. వారు సూతుడు, మాగధుడు అనువారు. పృథువు సూతుడికి అనూపదేశము, మాగధునికి మగధ దేశము ఇచ్చాడు. అతడు భూమి మీద సమత్వం ఏర్పరిచాడు. అంతకు మునుపు భూమి ఎగుడు దిగుడుగా ఉండేది. పృథువు తన వింటి కొప్పుతో రాళ్ల సముదాయాలని పైకెత్తగా పర్వతాలు ఏర్పడినాయి. దేవతలు, మహర్షులు పృథువుకు రాజ్యాభిషేకము చేశారు. భూదేవి స్వయంగా రత్నాలు ఇచ్చి అతన్ని సేవించింది. సముద్రుడు, హిమవంతుడు అతనికి అనంతమైన సంపద ఇచ్చారు. యక్ష రాక్షసులకు ప్రభువు అయిన కుబేరుడు ధర్మార్థకామాలు నిర్వహించడానికి కావలసినంత ధనమిచ్చాడు.
పృథువు తలువగానే వేలకొద్దీ రథాలు, గుర్రాలు, ఏనుగులు, భటులూ వచ్చి చేరేవి. ఆ రాజు రక్షణ వల్ల దేశంలో ఎవరికీ వృద్ధాప్యం లేదు, కరువు లేదు, వ్యాధులు లేవు, దొంగలవల్ల భయం లేదు. సముద్రంలోకి వెళ్లే నీరు కూడా ఆగిపోయి సస్యాలకు ప్రవహించేది. పర్వతాలు మార్గం ఇచ్చేవి. భూమి పృథువుకు పదిహేడు రకాల పంటలు ఇచ్చేది. అతను ప్రజలను రంజింపజేశాడు. కనుక రాజు అన్న పేరు అతనికి తగినది. బ్రాహ్మణులను క్షతముల నుండి (బాధల నుండి) త్రాణం (రక్షణ) చేశాడు. కనుక క్షత్రియ శబ్దం అతని పట్ల సార్థమైంది.
అతను శత్రువులందరినీ ఓడించి తన ప్రయత్నంతో ప్రసిద్ధుడైనాడు. మహర్షులు అతను ప్రథితుడవుతాడు అని అనటం వలన అతను పృథువు అయినాడు.
*
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి