డైలీ సీరియల్

సావిత్రి ఉపాఖ్యానం-69

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక శుభదినాన అశ్వపతి వృద్ధులను, బ్రాహ్మణులను, మంత్రులను, పురోహితులను కుమార్తెను తీసుకొని ద్యుమత్సేనుని ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ అంధుడైన ద్యుమత్సేనుడు ఒక విశాలవృక్షం క్రింద కూర్చుని ఉండగా చూశాడు. రాజు తన పరిచయం చెప్పగా ద్యుమత్సేనుడు అతన్ని తగిన రీతిగా సత్కరించి అతని రాకకు కారణం అడిగాడు. అప్పుడు అశ్వపతి అతనికి విషయాన్ని వివరించి ఇలా అన్నాడు. ‘‘రాజర్షీ! ఈ అమ్మాయి నా పుత్రిక సావిత్రి. ఈమె మీ కుమారుడైన సత్యవంతుని భర్తగా వరించింది. కనుక నీవు ఆమెను కోడలిగా స్వీకరించాలి’’.
ద్యుమత్సేనుడు ఇలా అన్నాడు ‘‘మేము రాజ్యం పోగొట్టుకుని వనవాసం చేస్తున్నాము. నీ కుమార్తెకు ఈ కష్టాలు తగవు’’.
అశ్వపతి ఇలా సమాధానం చెప్పాడు. ‘‘రాజా! సుఖదుఃఖాలు వస్తాయి పోతాయి. అవి శాశ్వతం కావు. ఈ విషయం నా కుమార్తెకు తెలుసు. నాకు ఆశాభంగం కలిగించకు’’.
అతని మాటలకు ద్యుమత్సేనుడు సంతోషించి తన అంగీకారం తెలిపాడు. అప్పుడు ఆ రాజులిద్దరూ ఆశ్రమవాసులందరి సమక్షంలో సావిత్రీ సత్యవంతుల వివాహం జరిపించారు. అశ్వపతి కన్యాదానం చేసిన పిదప కుమార్తెను ఆశ్రమంలో వదిలి తన నగరానికి చేరుకున్నాడు. సత్యవంతుడు సావిత్రి సౌందర్యం చూసి సంతోషించాడు. సావిత్రి ఆశ్రమవాసులలాగా నారచీరలు ధరించి తన సేవలతో అందరికి ఆనందాన్ని కలిగించింది. ఇలా జీవిస్తూ కొంతకాలం గడిచింది. సావిత్రికి మాత్రం దిగులుగా ఉంది. రోజులు గడుస్తూ ఉంటే సావిత్రికి నారదుని మాటలు భయం కలిగిస్తున్నాయి. ఆమె ప్రతిరోజు లెక్కపెడుతూనే ఉంది. చివరకు సత్యవంతుడు మరణించే రోజు వచ్చింది. ఇక నాలుగు రోజుల్లో అతను మరణిస్తాడు అనగా సావిత్రి త్రిరాత్రవ్రతాన్ని ఉపవాసదీక్షతో ప్రారంభించి ఆ వ్రతదీక్షలోనే ఉన్నది. ఆమె దీక్ష గురించి విని ద్యుమత్సేనుడు బాధపడి ఆమెతో వ్రతదీక్ష విరమించుమని కోరాడు. కాని ఆమె దీక్షను ఆపలేదు. మరునాడే భర్త మరణించే రోజని ఆమెకు తెలుసు. మరుసటిదినం ఆమె సూర్యుడు ఉదయించకముందే అన్ని పనులు చేసుకొని అగ్నిలో ఆహుతులు అర్పించి బ్రాహ్మణులకు, వృద్ధులకు, అత్తమామలకు నమస్కరించింది. వారంతా ఆమెను ‘‘దీర్ఘ సుమంగళీభవ’’ అని దీవించారు. ఆమె నారదుని మాటలు గుర్తుంచుకొని తీవ్రవేదనకు గురైంది.
అనంతరం సావిత్రి భర్తతో కలిసి వనంలోకి వెళ్లడానికి అత్తమామల అనుమతి కోరింది. వారు ఆమెను అరణ్యంలోకి వెళ్ళవద్దని, ఉపవాసదీక్ష వలన ఆమె చాలా బలహీనంగా ఉంది కనుక భుజింపుమని కోరారు. అప్పుడు ఆమె సూర్యాస్తమయం తరువాతే తను ఆహారం తీసుకుంటానని చెప్పి భర్తతో ఇలా అంది. ‘‘ఈ రోజు నీవు ఒంటరిగా పోవద్దు. నేను కూడా నీతో వస్తాను. నిన్ను వదలి ఉండను’’.
సత్యవంతుడు ఆమెకు నచ్చ చెప్ప ప్రయత్నించాడు. ‘‘నీవు ఎప్పుడూ అరణ్యంలోకి వెళ్లలేదు. పైగా ఉపవాసదీక్షలో చిక్కిపోయావు. ఎలా నడువగలవు?’’ కాని ఆమె అతనితో రావాలన్న కోర్కెను తీర్చుమని వేడగా సత్యవంతుడు ఒప్పుకొని ఆమెను తీసుకొని అరణ్యంలోకి వెళ్లడానికి తన తల్లిదండ్రుల అనుమతి తీసుకోమన్నాడు. మరల ఆమె వారిద్దరికీ మ్రొక్కి ఇలా అడిగింది. ‘‘నా భర్తతోపాటు వనంలోకి వెళ్లడానికి అనుమతించండి. మీ కుమారుడు పెద్దల కోసం, అగ్నిహోత్రం కోసం అడవికి వెళ్తున్నాడు. కనుక అతన్ని అడ్డగించకండి. దాదాపు సంవత్సరమైంది. నేనెప్పుడూ ఆశ్రమం విడిచి వెళ్లలేదు. కనుక నాకు అనుమతి ఇవ్వండి’’.
ద్యుమత్సేనుడు ఇలా అన్నాడు. ‘‘సావిత్రీ! నీవు ఇక్కడికి వచ్చిన నాటినుండి ఏమీ అడుగలేదు. కనుక ఈ రోజు నీ కోరిక తీర్చాలి. సత్యవంతునితో వెళ్లు. అతనితో కలిసి ఆ అరణ్య అందాలను దర్శించు’’. ఆమె భర్త వెంట అరణ్యంలోకి బయలుదేరింది.
అరణ్యంలో భర్త ఆమెకు అనేకమైన సుందర జలపాతాలను, నదులను, పూలతో నిండిన వృక్షాలను చూపించాడు. సావిత్రి పైకి ఆనందాన్ని కనబరుస్తూ, రాబోయే మృత్యువు కోసం దిగులుగా మనసులో నిరీక్షిస్తోంది.
సత్యవంతుడు పండ్లను ఏరి పాత్రలో ఉంచి కట్టెలు కొట్టసాగాడు. అప్పుడతనికి విపరీతంగా తల నొప్పి వచ్చి శరీరమంతా చెమటలు పట్టాయి. అతను భార్య దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. ‘‘కల్యాణీ! నాకు శిరోవేదన, ఒళ్లంతా సూదులు గ్రుచ్చుతున్నట్లుగా ఉంది. కొంతసేపు నిదురపోతాను’’.
సావిత్రి భర్త తలను తన ఒడిలోనికి తీసుకొని ఆ నేలపై కూర్చుని ఉంది. అప్పుడు ఒక దివ్యపురుషుడు ఎర్రటి వస్త్రాలు, నల్లటి దేహం, ఎర్రని కళ్ళు, చేతిలో పాశం ధరించి ఆమె ముందు ప్రత్యక్షం అయ్యాడు. అతన్ని చూసి వణికిపోతూ, భర్త తల ప్రక్కనపెట్టి నిలుచుని అతనికి నమస్కరించింది. దీన స్వరంతో ఆమె అతనితో ఇలా అంది. ‘‘మహాత్మా! మీరు దేవతలాగా కన్పిస్తున్నారు. మీరు ఎవరో దయచేసి నాకు చెప్పండి’’.
అప్పుడు ఆ దివ్యపురుషుడు సావిత్రితో ఇలా అన్నాడు. ‘‘సావిత్రీ! నీవు పతివ్రతవు కనుక నీతో మాట్లాడుతున్నాను. నీ భర్త ఆయుష్షు ముగిసింది. కనుక అతన్ని తీసుకొని పోవడానికి వచ్చిన యముడనని గ్రహించు’’.
సావిత్రి ‘‘స్వామీ! సాధారణంగా మానవుల ప్రాణాలు తీసుకొని వెళ్లడానికి మీ దూతలు వస్తారని అంటారు. మరి మీరు స్వయంగా ఎందుకు వచ్చారు?’’
యముడు ‘‘నీ భర్త సత్యవంతుడు ధర్మాత్ముడు. గుణవంతుడు. కనుక అతన్ని తీసుకొని వెళ్లడానికి నా దూతలు అర్హులు కారు. అందుకే నేనే స్వయంగా వచ్చాను’’.
తర్వాత యముడు పాశంతో సత్యవంతుని శరీరం నుండి బొటనవ్రేలంత జీవుని బయటకు లాగి దక్షిణాభిముఖంగా బయలుదేరాడు. సావిత్రి కూడా రోదిస్తూ అతని వెంట నడిచింది. ఆమె పతివ్రత, వ్రతసిద్ధిని పొందింది కాబట్టి ఆమె అతని వెంట వెళ్లగలిగింది. కొంతదూరం వెళ్లిన తర్వాత ఆమెతో యముడు ఇలా అన్నాడు. ‘‘సావిత్రీ! చాలా దూరం వచ్చావు. ఇక వెనుదిరిగి వెళ్ళి ఇతనికి ఉత్తరక్రియలు జరిపించు. మీ ఇద్దరికీ ఋణం తీరిపోయింది’’.
సావిత్రి ఇలా జవాబు ఇచ్చింది ‘‘నా భర్త ఎక్కడకు వెళ్ళినా లేక కొనిపోబడినా నేను కూడా అక్కడికి వెళ్తాను. ఇదే నా ధర్మం. తపస్సు వల్లా, గురుభక్తి చేత, భర్తృ ప్రేమ వలన నీ అనుగ్రహం వలనా నా దారి అడ్డగింపబడదు. పండితులు ఏడడుగులు నడిస్తే మైత్రి కలుగుతుందని అంటారు.
ఇంకావుంది...