డైలీ సీరియల్

లేమిని దూరంచేసుకొనే సాధనం భక్తి (కుచేలోపాఖ్యానం - 2)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ స్నేహితుడైన శ్రీకృష్ణుడు సర్వులనూ ఆనందపరుస్తాడని ఆపన్నులను ఆదుకుంటాడని నేను విన్నాను. ఆ యశోదానందనుడిని. రుక్మిణీ పతిని,. సత్యభామా ప్రియుడిని, మీరు ఒకసారి కలుసుకొని మన స్థితి గతులను చెప్పితే ఆ కృష్ణుడు మనకు మంచి దారి చూపిస్తాడేమో కదా. ఇంతకు మించి మనకు మరో దారి లేదు. మీరు ఎలాగైనా ఒకసారి కృష్ణ దర్శనానికి వెళ్లిరండి’ అని వేడుకుంది.
భార్య చెప్పిన మాటలను విని,నిజమే! అటు పుణ్యమూ, ఇటు పురుషార్థమూ రెండూ కలుగుతాయి. కనుక ఇహపరసాధనకు కృష్ణుడిని ఆరాధించడం కన్నా మరోసులభమైన ఉపాయం ఏముంటుంది. ఈవంకనైనా నేను ఆ కృష్ణుని దర్శించుకుని వస్తాను అని దృఢ నిర్ణయం తీసుకొన్నాడు.
అంతలోనే ‘సుశీలా! నాకు ఆ దివ్యధామనివాసుడైన ఆ శ్రీహరిని, చక్రిని, ఆ పీతాంబరధారిని, అచ్యుతుడిని చూడాలి అని ఉంది. కాకపోతే పెద్దవారి దగ్గరకు వెళుతూ ఏదైనా తీసుకొని వెళ్లి సమర్పించాలి కదా. మరి మనదగ్గరేమున్నది’ అని అన్నాడు.
కుచేలుని ధర్మపత్ని బాగా ఆలోచించి మరేంఫర్వాలేదు. భక్తితో పత్రమైన, ఫలమైనా, జలమైనా ఇస్తే ఆ పరమాత్మ ఎంతో సంతోషించి స్వీకరిస్తాడు కదా. దీనికోసం ఎందుకు ఆలోచించడం. ఆయనకెంతో ఇష్టమైన అటుకులు మనింట్లో ఉన్నాయి. వాటిని ఇస్తాను అని కుచేలుడు ధరించి ఉన్న చినిగిన అంగవస్త్రంలో పోసి మూట కట్టి ఇచ్చింది. వీటిని ఇవ్వండి అని చెప్పి అఖిలలోకాలకు నాథుడైన కృష్ణుని దగ్గరకు తన నిజనాథుడిని పంపించాదా మహాఇల్లాలు.
కృష్ణ దర్శనోత్సాహంతో కుచేలుడు బయలుదేరాడు. మార్గమధ్యంలో కృష్ణుని చిన్నప్పటి చేతలను గుర్తు తెచ్చుకుంటూ ఆ ఊహల్లో తేలియాడుతూ కృష్ణ నగరానికి బయలుదేరాడు.
కొంతదూరం నడిచి అలసిపోయి తిరిగి నడక సాగించి చివరకు కృష్ణుడున్న మందిరానికి వచ్చాడు. వేలకొలది అంగనలతో ప్రకాశిస్తూ ఉన్న సుందర సమున్నత మణిమయ స్వర్ణ సౌధాలను చూసి కుచేలుడు పరమానందం పొందాడు. ఆ మణిమయ సౌధంలోని హంసతూలికా తల్పంపైన విరాజమానమై యున్న ఆ కృష్ణునికి మగువులు వింజామరలు వీచడం కనిపించింది. మంచి అగరుధూప వాసన కుచేలుని సమీపించింది. ఇక సందేహం అక్కర్లేదు. మన్మథమన్మథుడైన ఆ హరి ఇక్కడే ఈ సౌధంలోనే ఉన్నాడు అని స్థిర నిర్ణయం చేసుకొని స్వామి చెంతకు అడుగులు వేశాడు. సాటిలేని సౌందర్యరాశియైన కృష్ణుడు అంత దూరంలోనే కుచేలుని చూశాడు. దిగ్గున లేచాడు. ఎదురుగా వచ్చే కుచేలుని సాదరంగా ఆహ్వనించడానికి కృష్ణునికి పాదాల అడుగులు వాటంతటవే పడుతున్నాయ.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804