డైలీ సీరియల్

కలిప్రభావం అధర్మములకే సుమా ( పరీక్షిత్తు - 2 )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చేటపుడు ఆయనకు ధర్మదేవత ఒంటికాలిపై నిల్చుని గోమాతతో తన దుఃఖాన్ని పంచుకోవడం కనిపించింది. ఓక రాజు సాధువు జంతువైన గోమాతను కాలితో తన్నడం చూస్తాడు. ఆ రాజే తిరిగివృషభాన్ని కూడా కఠినాతికఠినంగా కాలితో తన్ని తాను సంతోషించడం పరీక్షీన్నమహారాజు చూశాడు. ఎంతో ఆవేదన చెందాడు. వెంటనే ఆ వృషభ గోమాతలను రక్షించాడు. అమితంగా వేదన చెందే వారికి స్వస్థత కలిగించే మాటలు మాట్లాడాడు.
అమ్మా! గోమాత, ధర్మస్వరూపా! వృషభరూపా! మీరు బాధపడకండి. ఈ ధూర్తులు అఖిల లోకాలను సంరక్షించే అఖిలాండేశ్వరుడైన లోకాలను పాలించే శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠ ధామానికి వెళ్లిపోయాడనే ధైర్యంతోనో, లేక భుజబలసంపన్నులు, వీరాధివీరులైన పాండవులు లేరన్న ఆలోచనతోనో అధర్మాన్ని చేయబూనుతున్న ఈ దుర్మార్గులను నేను కాలరాస్తాను. బ్రహ్మదేవుడు ధర్మాన్ని కాపాడమని రాజులను సృష్టించాడని నేను విన్నాను. మీకేవిధమైన భయంలేకుండా మీరు సంచరించండి. నేను ప్రాణాలతో ఉన్నంతవరకు ధర్మానికి విఘాతం కలుగకుండా చూస్తాను అని వారికి భరోసా ఇచ్చి ఆ రాజవేషధారియైన కలిపురుషుడితో పరీక్షిత్తు యుద్ధం ఆరంభించాడు.
పరీక్షిత్తు యుద్ధ్భాలాషియై తన వద్దకు రావడం చూసి కలిపురుషుడు భయవిహ్వలుడయ్యాడు. అధర్మమార్గంలో చరించేవారి పట్ల తాను భయంకరుడై నిల్వవచ్చునేమో కాని ధర్మమార్గంలో చరించేవారి నీడన కూడా నేను నిలువ లేను కదా అని భయంచేత కపించిపోతూ పరీక్షిత్తు ఎదురుగా రావడానికి కూడా జంకుతూ నిల్చున్నాడు.
మిలమిలా మెరిసే తన ఖడ్గాన్న ఆగ్రహంతో చివాలున బయటకు తీసిన పరీక్షిత్తు ఆ దుర్మార్గుడైన రాజును సంహరించాలన్న తలంపుతో ముందుకు ఉరికాడు. వెంటనే కలిపురుషుడు రాజచిహ్నాలన్నింటిని వదిలివేసి వడలిన వదనంతో, గడగడలాడుతూ పరీక్షిత్తుదగ్గరకు పరుగెత్తుతూ వచ్చి ఆయన పాదాలపై వాలిపోయాడు
ఓ పరీక్ష్నీమహారాజా! నన్ను క్షమించు. నేను శరణుకోరుతున్నాను. అంటూ పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. భయంతో కంపించిపోయేవారికి దండించకూడదన్న ధర్మనిర్ణయానికి కట్టుబడి కలిని నిల్చోబెట్టి మహారాజు మందలించాడు. నీ ధూర్తస్వభావాన్ని వదిలి ఈ చోటనుంచే కాదు ఈ లోకంనుంచి నిష్కమ్రించు అని గట్టిగా హెచ్చరించాడు.
నీవు చూడడానికి రాజుగా కనిపిస్తున్నావు కానీ నీలో అసత్యం, లోభం, దొంగతనం, దౌర్జన్యం, దురాచారం,మోసం, కలహం, కపటం, కలుషం , దౌర్భాగ్యం మొదలైన అధర్మగుణాలన్నీ ప్రోగుపడి ఉన్నాయి కనుక నీవీ భూమండలంలో ఉండడానికి వీలులేదు. ఈ చరాచర ప్రపంచంలో వెలుపలా, లోపలా నిండి సంచరించే వాయువులాగా సర్వాంతర్యామి అయిన పరమాత్మ సమస్త శుభాలు చేకూరుస్తూ సత్యధారిణులను, ధర్మాచరణులను రక్షించడానికి సర్వవేళలా ఎదురుచూస్తున్నాడు.

- డా. రాయసం లక్ష్మి. 9703344804