తెలంగాణ

తెలంగాణలో 30 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 12 వరకు దసరా సెలవులుగా తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. వచ్చే నెల 13న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొంది. వీటితోపాటు ఈ విద్యా సంవత్సరంలో ఇతర సెలవులు, విద్యా కార్యక్రమాలకు సంబంధించిన ఉత్తర్వులను డీఈవోలకు ఇటీవల జారీ చేసింది. అన్ని తరగతుల వారికి వచ్చే నెల 27వ తేదీ నుంచి నవంబర్ 3లోగా సమ్మెటివ్ అసెస్‌మెంట్-1 (ఎస్‌ఏ-1) పరీక్షలను నిర్వహించాలని విద్యాశాఖ పేర్కొంది. వార్షిక పరీక్షల స్థానంలో ఎస్‌ఏ-2 పరీక్షను వచ్చే ఏడాది మార్చి 7 నుంచి 15 వరకు నిర్వహించాలని సూచించింది. పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలను 2017 ఫిబ్రవరి 6 నుంచి 18 వరకు నిర్వహించాలని తెలిపింది.