క్రీడాభూమి

టోక్యోలో పతకం గెలుస్తా : దీపా కర్మాకర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగర్తల: రియో ఒలింపిక్స్‌లో పతకం గెలవలేకపోయానని, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో తప్పకుండా పతకం గెలుస్తానని భారత జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ ప్రమాణం చేసింది. రియో ఒలింపిక్స్‌ ఫైనల్‌లో ప్రమాదకర ప్రొడునోవా విన్యాసం చేసిన భారత జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌కు సొంత రాష్ట్రం త్రిపురలో సోమవారం ఘనస్వాగతం లభించింది. కోచ్‌ బిశ్వేశ్వర్‌ నందితో కలిసి అగర్తల చేరుకున్న దీపకు పలువురు స్వాగతం పలికారు. వివేకానంద స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మానిక్‌ సర్కార్‌ దీపను సన్మానించారు. ఆసియా గేమ్స్‌, టోక్యో 2020 ఒలింపిక్స్‌లో దీప పతకం గెలవాలంటే అగర్తలలోని రీజనల్‌ కోచింగ్‌ సెంటర్‌లో ఉన్న ఇండోర్‌ స్టేడియాన్ని ఆధునీకరించాలని దీప కోచ్‌ బిశ్వేశ్వర్‌ ముఖ్యమంత్రిని కోరారు.