తెలంగాణ

కడుపులో తన్నినందుకే గర్భిణి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజనిర్ధారణ కమిటీ స్పష్టీకరణ ఇటుక బట్టీ నిర్వాహకులపై చర్యకు డిమాండ్

హైదరాబాద్, డిసెంబర్ 5: ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఓ కార్మికురాలిని కడుపులో తన్నినందుకే తీవ్ర రక్తస్రావమై మృతి చెందిందని నిజనిర్ధారణ కమిటీ స్పష్టం చేసింది. శనివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు ఐలయ్య, కిషన్, పర్వతాలు, బిట్టు, పూజ, ప్రొఫెసర్ రోషన్, ఆనంద్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం హనుమంతునిపేటలో శ్యామ్ అనే వ్యాపారి ఇటుక బట్టీ నిర్వహిస్తున్నాడు. ఒరిస్సాకు చెందిన సుర్జాబాగ్, జితేందర్ బాగ్ దంపతులు ఆ ఇసుక బట్టీలో పనిచేస్తున్నారు. కాగా ఈ నెల ఒకటిన గర్భవతైన సుర్జాబాగ్ అనారోగ్య కారణాల వల్ల పనికి వెళ్లలేదు. ఇటుక బట్టీవద్దే ఓ పూరి గుడిసెలో ఉంటున్న ఆ మహిళ వద్దకు వెళ్లిన ఇటుక బట్టీ యజమాని శ్యామ్, మరో ముగ్గురు సూపర్ వైజర్లు పనికి రాలేదేమంటూ అమెను దుర్భాషలాడారు. తన ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో ఇటుక బట్టీ యజమానితోపాటు ముగ్గురు ఆమెను కడుపులో తన్నారు. దీంతో రక్తస్రావంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. సదరు మహిళను ఆసుపత్రిలో చేర్పించకపోవడమే కాకుండా ఓ మామూలు ఆర్‌ఎంపి వైద్యుడితో చికిత్స చేయించి చేతులు దులుపుకున్నారు. తీవ్ర రక్తస్రావానికి గురైన సుర్జాబాగ్ మృతి చెందింది. ఇటుక లోడింగ్ విధుల్లో ఉన్న ఆమె భర్త విషయం తెలుసుకొని ఇటుక బట్టీ యజమాని శ్యామ్, మరో ముగ్గురు సూపర్‌వైజర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలికి ప్రభుత్వం రూ. 50వేల చెక్కును, అంత్యక్రియలకు మరో రూ. 20వేలు చెల్లించిందని నిజనిర్ధారణ కమిటీ వెల్లడించింది. ఇటుక బట్టీలో మొత్తం 260మంది కార్మికులు పనిచేస్తున్నారని వారికి యాజమాన్యం ఎలాంటి సౌకర్యం కల్పించకపోగా వారికి ఒరిస్సాకు బస్ చార్జిలు కూడా ఇవ్వడం లేదు. ఒరిస్సాలోని ఒక ఏజెంట్ ద్వారా రూ. 15వేలు, 17వేలు అడ్వాన్సుగా చెల్లించి కార్మికులను రప్పించుకుంది. నిర్బంధంలో ఉన్న కార్మికులను వారివారి ప్రాంతాలకు వెళ్ళేందుకు సహాయక చర్యలు తీసుకోవాలని కమిటీ ఆర్డీఓను కోరింది.