విశాఖపట్నం

ఎపి ప్రజలను మోదీ, బాబు మోసగిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు
విశాఖపట్నం, నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసగిస్తున్నారని పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ విమర్శించారు. పిసిసి అదేశాల మేరకు చేపట్టిన మట్టి సత్యాగ్రహంలో భాగంగా నగరంలోని 31, 15 వార్డుల్లో మట్టి సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు చాలదు, అధికారంలోకి వస్తే పదేళ్లు ఇస్తామని మభ్యపెట్టి మోసగించారన్నారు. అధికారంలోకి వచ్చిన బిజెపి, తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు హోదా హామీని తుంగలోకి తొక్కి దొంగాటలాడుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకహోదాపై కేంద్రాన్ని నిలదీయకుండా, వారికి వత్తాసు పలకడం శోచనీయమన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వంతో లాలూచీ పడిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసగించారన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగే విధంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా సాధించేంత వరకూ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కార్యదర్శి కె గోపాలరెడ్డి, 31వవార్డు కమిటీ అధ్యక్షుడు కంబాల మురళీకృష్ణ, 15వ వార్డు కమిటీ అధ్యక్షుడు టి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు గొంటు మోహనరావు, హైదర్ ఆలీ సింకా, బిసిసెల్ చైర్మన్ పొగుడు జ్యోతి, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు జగదాంబ, కన్నతల్లి, తదితరులు పాల్గొన్నారు.

పిఎఫ్, ఇఎస్‌ఐ సొమ్మును సక్రమంగా జమచేయాలి
* సమయం దాటితే వడ్డీ వసూలు
* జివిఎంసి కమిషనర్
విశాఖపట్నం, నవంబర్ 27: జివిఎంసిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి జీతాల నుంచి మినహాయించే ఇపిఎఫ్ (ఎంప్లారుూస్ ప్రావిడెంట్ ఫండ్), ఇపిఎస్ (ఎంప్లారుూస్ స్టేట్ ఇన్సూరెన్స్) సొమ్మును సక్రమంగా ఆయా సంస్థలకు చెల్లించాలని కమిషనర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల నుంచి వసూలు చేసిన ఇపిఎఫ్ సొమ్మును తర్వాతి నెల 15వ తేదీలోగాను, ఇపిఎఫ్ సొమ్మును తర్వాతి నెల 21వ తేదీలోగా ఆయా కమిషనర్ కార్యాలయాలకు జమచేయాలని స్పష్టం చేశారు. నిర్ధేశించిన సమయం దాటి ఇపిఎఫ్ మొత్తాన్ని రెండు నెలల వరకూ జమచేయకుంటే 17 శాతం, 4 నెలలు దాటితే 22 శాతం, ఆరు నెలలు దాటితే 27 శాతం, ఆరు నెలలు నాటితే 32 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే ఇఎస్‌ఐ మొత్తాన్ని రెండు నెలల వరకూ 5 శాతం, నాలుగు నెలల వరకూ 10 శాతం, ఆరు నెలల వరకూ 15 శాతం, ఆరు నెలలకు పైబడితే 25 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. జీతాలు డ్రా చేసే అధికారులు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని సకాలంలో ఇపిఎఫ్, ఇఎస్‌ఐ మొత్తాలను సక్రమంగా జమచేసేందుకు చొరవు చూపాలని స్పష్టం చేశారు. ప్రతి నెలా జీతాల బిల్లులో వీటిని స్పష్టంగా పేర్కొనాలని లేని పక్షంలో బిల్లులు స్వీకరించేది లేదని ఆడిట్ విభాగానికి స్పష్టం చేశారు. ఉత్తర్వులను అతిక్రమించిన జీతాల డ్రాయింగ్ అధికారుల నుంచి వడ్డీ మొత్తాన్ని వసూలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

హస్తకళల ప్రదర్శన ప్రారంభం
విశాఖపట్నం , నవంబర్ 27: హస్తకళలు, చేనేత ఉత్పత్తిదారులను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఎంవిపి కాలనీలోని న్యూ రైతు బజార్‌లోని అఖిల భారత హస్తకళ ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్పత్తిదారులే విక్రయాలు చేపట్టడంతో వినియోగదార్లకు అందుబాటు ధరల్లో లభిస్తాయన్నారు. దివాళీ స్పెషల్ క్రాఫ్ట్ బజార్ పేరిట దేశంలోని వివిధ ప్రాంతాల వస్తువులను ఒకే చోటకు తెచ్చి ప్రదర్శించడం అభినందనీయడమన్నారు. విశాఖ ఆర్టిజన్స్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు మహ్మద్ నశీం మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో హైదరాబాద్ మంచి ముత్యాలు, కలంకారీ పెయింగ్స్, మార్బుల్ బొమ్మలు, షహరాన్ పూర్ ఉడ్ కార్వింగ్, బ్లాక్‌మెటల్ కార్పెట్‌లు, బెంగాల్ కాటన్ శారీస్, మైసూర్ రోజ్ ఉడ్, ఒడిశా ఆప్టిక్ వర్క్స్ తదితర వస్తువులు లభ్యమవుతాయన్నారు. గ్రేటర్ విశాఖ 8వ వార్డు మాజీ కార్పొరేటర్ చోడే పట్ట్భా మాట్లాడుతూ డిసెంబర్ 13 వరకూ ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకూ ప్రదర్శన కొనసాగుతుందని వివరించారు.

ఎయులో ఇంక్యుబేషన్ సెంటర్
* విసి జిఎస్‌ఎన్ రాజు
విశాఖపట్నం, నవంబర్ 27: ఆంధ్రా యూనివర్శిటీలో త్వరలోనే ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ జిఎస్‌ఎన్ రాజు తెలియచేశారు. ప్రస్తుతం 1000 ఎస్‌ఎఫ్‌టితో చిన్న ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. 10వేల ఎస్‌ఎఫ్‌టితో పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఆయన తెలియచేశారు. దీనికి ఇంజనీరింగ్ కళాశాల్లోని స్థలాన్ని తాము కేటాయిస్తున్నామని, ప్రభుత్వం పది కోట్ల రూపాయలను మంజూరు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందని చెప్పారు. మరో నాలుగు నెలల్లో దీనికి సంబంధించిన కార్యాచరణ మొదలవుతుందని రాజు వివరించారు.