ఈ వారం తార

పాత్రను ప్రేమిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరీర్ ఎలా వుంది?
-అందరికీ తెలిసిందే. ‘కంచె’దాటి వచ్చాను. మంచి పేరు తెచ్చుకోవడం హ్యాపీ అనిపించింది. సూటయ్యే పాత్రలు, ప్రాజెక్టుల్లో ఆఫర్లు వస్తున్నాయి. నటనకు స్కోప్‌వున్న పాత్రలు ఎంచుకునే పనిలో ఉన్నా.
మొట్టమొదటి మాస్ మూవీలో..?
-నిజమే మాస్ ఫైట్స్.. క్లాసిక్ లవ్ ట్రాక్.. నవ్వించే కామెడీ పంచ్‌లు.. వెరసి గుంటూరోడు కచ్చితంగా ఆకట్టుకుంటాడు. గుంటూరు అమ్మాయిగా నా పాత్ర స్వీట్‌గా, లవ్‌లీగా, బబ్లీగా సాగిపోతుంది.
పాత్రను ఎలా ఎంచుకుంటారు?
-నా పాత్రను నేను ప్రేమిస్తాను. అందులో ఇన్‌వాల్వ్ అయి నటించడానికి ప్రయత్నిస్తా. పాత్రల స్వభావాన్ని ఓన్ చేసుకున్నప్పుడే ఫలితాలు వస్తాయని నమ్ముతాను. ఈ చిత్రంలో నా స్వభావానికి తగిన విధంగా ఈ పాత్ర ఉంటుంది.
హైలెట్స్?
-సినిమాలో మ్యూజిక్‌ని బాగా ఎంజాయ్ చేస్తారు. వసంత్ బాణీలు ఇట్టే ఎక్కిపోతాయి. నేను ఇప్పటికే ఎంజాయ్ చేస్తున్నా. బ్యూటిఫుల్ ఎంటర్‌టైనర్ కథనంతో చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
మనోజ్ ఎలా చేశాడు?
-మనోజ్ మంచి కో ఆర్టిస్ట్. ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న హీరో. ఈ సినిమాలోనూ ప్రతి ఫ్రేమ్‌లో అతని టాలెంట్ చూస్తారు. కష్టపడే మనస్తత్వం కనుక, ప్రతి సన్నివేశాన్నీ పండించాడు. నవరసాలను బ్యాలెన్స్‌డ్‌గా ‘గుంటూరోడు’తో రుచి చూపిస్తాడు.
తెలుగు పరిశ్రమ ఎలా వుంది?
-ఆరు నెలలుగా ఇక్కడే వుంటున్నా. ఇక్కడి వాతావరణం బాగా నచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ అంటే ఇష్టం ఏర్పడింది. లవ్‌లీ సిటీగా చెప్పాలి. ఇక్కడి ప్రజలు కామ్ గోయింగ్. నైస్‌గా, స్వీట్‌గా ఉంటారు.
ఇంకా విశేషాలు?
-హైదరాబాద్ బిరియానీ నచ్చేసింది. నిజానికి నాకు జంక్ ఫుడ్స్ ఇష్టం ఉండదు. అప్పుడప్పుడు బైటికి వెళ్లి తిరిగివస్తా. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు హార్ట్ టచ్‌గా ఉన్నాయి.
నక్షత్రం ఎలా వుంటుంది?
-సినిమా చాలా అద్భుతంగా వస్తోంది. నేటి యువతి ఎలా ఉంటుందో నా పాత్ర అలా ఉంటుంది. వర్కింగ్ సీరియస్‌లీ. గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తా. ఇంకా రెండు మూడు ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే వెల్లడిస్తా.

పోస్టర్
ప్రగ్యా జైస్వాల్